ఈశ్వర/శివ భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఈశ్వర/శివ భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, అక్టోబర్ 2018, మంగళవారం

కావ రాగదయ్యా కాశీ విశ్వనాథా - భజన

కావ రాగదయ్యా కాశీ విశ్వనాథా
కాన రాగదయ్యా కన్నీటి ధారా   " కావ "

నీలకంఠ రావా దిక్కు నీవె కావా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా   " కావ "

విఠల నేత్ర నాపై కఠినమేలనయ్యా 3
నీలకంఠ నాపై జాలే లేదా   " కావ "

పన్నగేంద్ర భూషా పలుకవేలనయ్యా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా  " కావ "

ప్రేమ మీద నీదు నామ భజన చేసే 3
రామచంద్ర బ్రోవ రావా ఓ దేవా   " కావ "

11, సెప్టెంబర్ 2018, మంగళవారం

నటరాజ గంగాధరా - భజన

నటరాజ గంగాధరా
హే జటధారి గంగాధరా 2

అట జూడ నీవే ఇట జూడ నీవే
ఎటు జూసినా నీవే  2
ఘటమందు నీవే మఠమందు నీవే
విఠలాక్ష జగమంత నీవే కదా   " నటరాజ "

హే నాగభరణా నీ నామస్మరణా
నే మానలేదయ్యా  2
నానావిధంబుల గానంబు జేతూ
దీనావనా జాలి చూపించవా         " నటరాజ  "

కలవారలెన్నో కానుకలనిచ్చీ
కొలిచేరు ఓ దేవా 2
ఫలపత్రమైనా తేలేని నేనూ 2
పిలిచేను నా పిలుపు ఆలకించవా     " నటరాజ "

భువనేశ సకలా భూతేశ్వరా
హే భవబంధ పరిహారా 2
శివచంద్రశేఖర భవదీయదాసూ
కవి రామచంద్రుణ్ణి కాపాడవా       " నటరాజ "

10, సెప్టెంబర్ 2018, సోమవారం

జయ కాశీ విశ్వనాథా మము కాపాడు ఓ జగన్నాథా - భజన

జయ కాశీ విశ్వనాథా మము కాపాడు ఓ జగన్నాథా 2
పరమదయాళో భోళా శంకర్ 2            " జయ "

నందివాహనా నాగాభూషణ 2
గంగాజటధరా గౌరిమనోహర  2      " జయ "

దుష్ట శిక్షణా శిష్ట రక్షణా 2
నీలకంఠాధరా నిముషము మరువరా    " జయ "

30, ఆగస్టు 2018, గురువారం

హర హర మహదేవా - భజన

హర హర మహదేవా
నీరాజనమిదె గైకొను దేవా హర హర మహ దేవా 2

గంగా జలముల తోనూ దధిక్షీర ఘృతమ్ములతోనూ
అభిషేకములే చేసెదమయ్యా     " హర "

బిల్వా పత్రముతోనూ
కాశీ గన్నేరులతోనూ
అర్చనలే నీకు చేసెదమయ్యా   " హర "

రంభా ఫలములతోనూ
నెయ్యి పాయసముతోనూ
నైవేద్యములే ఒసగెదమయ్యా
ఆరగించి మము బ్రోవుమయ్యా   " హర "

దివి కైలాసములోనా
వెలసిన ఓ మహదేవా
భువిలో నీ దాసులనూ
ఆదరించి దరి చేర్చుకోవా   " హర "

ఓ....కైలాస హిమగిరి శంకరా - భజన

ఓ....కైలాస హిమగిరి శంకరా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా...2

నీలకంఠా నిను చూడగోరి
నిరతమూ నిను ప్రార్థింతురా
జగతినేలా జాగేల దేవా
జ్యోతులివిగో జగమేలయా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా   " ఓ "

మనసు నిలిపిన మహనీయులెందరో
జన్మ సద్గతి సాధించిరీ
కానరాని కలిమాయలోనా
గమ్యమెరుగక పడిపోతినీ
కరుణించవేమయా
మనసార మోము చూపించవా  " ఓ "

చంద్రమౌళీ చితభస్మధారీ
చంద్రకిరణాల తేజోవిహారీ
దండమోయీ ఓ లింగరూపా
అండ నీవే భూతాధిపా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా  " ఓ "