తెలుసుకోవలసిన విషయాలు / telusukoavalsina vishayaalu. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుసుకోవలసిన విషయాలు / telusukoavalsina vishayaalu. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, మే 2021, సోమవారం

కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీస్తారు?

 కొబ్బరికాయకు పీచు కింది భాగంలో మూడు కళ్ళు ఉంటాయి .ఈ కళ్ళు ఉన్న ప్రదేశం సున్నితంగా ఉంటుంది .అక్కడ గోటితో  గిచ్చిన నీళ్ళు బయటకు వచ్చేస్తాయి .కొబ్బరి పీచు ను పూర్తిగా తీసి నట్లయితే నీళ్లు కారిపోయే అవకాశం ఉంటుంది .అందుకే కళ్ళున్న వైపు పిలకలా పీచును విడిచిపెడతారు .అరటి వంటి పళ్ళను కొద్దిగా వలిచి నివేదన చేస్తారు .భగవంతుడు తినడానికి సిద్ధంగా చేసి ఇవ్వడం అన్నమాట .అందుకే పిలకతో ఉన్నా కొబ్బరికాయను పగలకొట్టి ఆపైన పిలక తీసివేసి నివేదన చేస్తాము.

కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు?

 ప్రతి మంచి పని లోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్ళు. శుభకార్యాలలో యజ్ఞ దీక్ష సమయాలలో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆర వే య డ ము ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలు ఇతరులకు ఇవ్వకూడదు .నూతన వస్త్రాలు ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పా త వైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు .ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు .పసుపు క్రిమిసంహారిణి .అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల లో ఎటువంటి క్రిములు ఉన్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్న ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది

శుభకార్యం చేసిన తర్వాత దర్భలు, నువ్వులు తాకకూడదా?

 దర్భలు ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాకకూడదు అని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది  దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్ది కాలానికే పెద్దలకు సంవత్సరీకాలు , త ద్ది నా లు పెట్టుకోవలసి వస్తే నువ్వులు తాకక పోవడం మాత్రం కనిపిస్తుంది .నువ్వుల కు బదులుగా వాడేవి ఏ వీ  సరైన ప్రత్యామ్నాయాలు కావు . పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వుల నేఉపయోగించాలి .అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అస్సలు మానేయకూడదు.

గుడిలోనికి వెళ్లేముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

 గుడిలోనికి మాత్రమే కాదు ఇక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్ళాలి .లక్ష్మీ దేవి గా భావిస్తాము. అందుకే  రోజు గడపన కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాము. దేహ లీ దేహ పర్యంత స్థాన సంపర్క శోభితే మత్కర్మ పరి పూర్ణయ యతో భవే సదా మమ అనే మంత్రాన్ని చెబుతూ గడపకు నమస్కరించాలి .నేను ఆచరించిన కర్మలు పరిపూర్ణంగా సఫలం చేసుకోవడానికి కావలసిన సంస్కారాన్ని ప్రసాదించు తల్లి, నన్ను మంచివాడిగా చేయమని ఈ శ్లోకానికి అర్థం. మంచివాడిగా ఉంటే సమాజం తద్వారా దేశం ఉత్తమంగా తయారవుతాయి .సంస్కారాన్ని మనకు నేర్పేది గడప రూపంలోని లక్ష్మీదేవి .అందుకే గడపకు నమస్కరించాలి.

ఆలయాలలో నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా?

 అవసరం లేదు .పరిహార పూజలు జరిపించే సందర్భంలో మాత్రమే కొన్ని విధి నియమాలు ఉంటాయి. అటువంటి సందర్భం లేనప్పుడు నవగ్రహ దర్శనానంతరం కాళ్ళు కడుక్కుని అక్కరలేదు .ఆలయంలో అందరూ దేవి దేవతలను దర్శించినట్లు నవగ్రహాలను దర్శించుకోవచ్చు ,.తాకవచ్చు ,పూజించవచ్చు.

ఇంటిలో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయవచ్చా?

 శాస్త్ర ప్రకారం ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన చేయకూడదు .గర్భవతిగా ఉన్న ఇల్లాలికి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటి నిర్మాణంలో పడితే ఆమెకు పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేడు వారిద్దరికీ అన్యాయం చేసినట్లు అవుతుంది .కాబట్టి ఇంటిలో గర్భవతులు ఉండగా గృహనిర్మాణ గృహప్రవేశం చేయకూడదు .అయితే ఇల్లు కట్టబడి ప్రారంభించిన తరువాత ఇల్లాలు నెల తప్పితే గృహనిర్మాణం, గృహప్రవేశం నిరభ్యంతరంగా చేయవచ్చు.

సంప్రదాయం అంటే ఏమిటి?

 ఆయము అంటే మన సంపాదన. మనం మాత్రమే వినియోగించుకుంటారు. దాయం అంటే ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళు నలుగురు పంచుకునే వారసత్వపు ఆస్తి. ప్రదాయము అంటే ఎంత పంచుకున్న తరగని గొప్ప సంపద .అంటే మన విజ్ఞానం ఇంటి పేరు గోత్రం వంశ చారం వంటివి .సంప్రదాయం అంటే సమ్యక్ ప్రదాయం  వేలాది సంవత్సరాలు గడిచిపోయినా మానవుని ని జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చేది సంప్రదాయమే .ఏ సందేశాన్ని ఆచరించడం వల్ల మానవుడు మెరుగైన ఫలితాలు పొందుతాడో అదే సత్సంప్రదాయం.

శ్రీ అంటే అర్థం ఏమిటి?

 ఓం కారం శ్రీకారం మంగళ వాచకాలు. శ్రీకారం తో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది .క్షేమము కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం .శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్థాలు లు ఉన్నాయి .అలాగే శ్రీ ని స్త్రీ వాచకంగా గుర్తిస్తారు. సీత తో కూడిన రాముని శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు .మంత్ర సాధన లో కూడా శ్రీ బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది .మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్సరంగా వాడే శబ్దం గా గుర్తించాలిి.

28, జనవరి 2019, సోమవారం

మనది కానిది / పరుల సొమ్ము పాము వంటిది

ఒక రోజు బుద్ధుడు శిష్యులతో కలిసి ఒక పొలం గట్టు మీదుగా వెళ్తున్నాడు.దారిలో ఒక చెట్టు పక్కన ఒక భిక్షువుకి ఒక డబ్బు మూట కనిపించింది.ఆ భిక్షువు - భగవాన్ ఇదిగో ధనం మూట అని చూపించాడు.

" నాయనా, అది ఒక కాలసర్పంలాంటిది.దాని జోలికి వెళ్ళొద్దు,ఇటు వచ్చేయ్ అని వెళ్ళిపోయాడు.మిగిలిన భిక్షువులు ఆ మూటకి కాస్త దూరం జరుగుతూ ఆయన వెంట వెళ్ళిపోయారు.కొద్దిదూరంలో ఉన్న ఒక బాటసారి ఈ తతంగమంతా చూస్తున్నాడు.

వీరికి అక్కడ పామేదో కనిపించినట్లుంది,ఉట్టి పిరికి వాళ్ళలా ఉన్నారు అంతమంది ఉండి కూడా దానిని ఏమీ చేయలేక తప్పుకుని పారిపోతున్నట్లున్నారు అనుకుంటూ అక్కడికి వచాడు.తీరా వచ్చి చూస్తే అక్కడ డబు మూట ఉంది.దాన్ని చేతుల్లోకి తీసుకుని ,వీళ్ళు పిరికివాళ్ళే కాదు,వెర్రిబాగులవాళ్ళలాగా ఉన్నారు,లేకపోతే దీనిని చూసి పాముని చూసినట్లు పరుగులు పెడుతున్నారు.అనుకుంటూ మూటవిప్పి డబ్బు లెక్కపెట్టుకుంటున్నాడు.నిజానికి అసలు జరిగిందేమిటంటే  ఆ ముందు రోజు రాత్రి రాజు వద్ద పనిచేసే అధికారి ఇంట్లో దొంగలు పడి చాలా ధనాన్ని దోచుకుపోతూ ,ఈ చెట్టుకింద మూటల్ని లెక్కపెట్టుకున్నారు.చీకట్లో ఒక మూట జారి పక్కన పడిపోయింది. ఇది గమనించకుండా వారు వెళ్ళిపోయారు.తెల్లవారగానే ఆ అధికారి ,దొంగలను వెతుక్కుంటూ ఇటుకేసి వచ్చాడు ,అతను వచ్చే సమయానికి ఈ బాటసారి మూటలోని ధనాన్ని లెక్కపెట్టుకుంటూ కనిపించాడు.ఇతడే ఆ దొంగతనం చేసాడని భావించి అతణ్ణి బాగా తన్ని రాజు గారి దగ్గరకు లాక్కుపోయాడు.ఇదీ కథ.

పరుల సొమ్ము పామువంటిది అనే నానుడి ఇలా పుట్టింది.అందుకే బుద్ధుడు ఇతరులు ఇవ్వకుండా నీకు దొరికింది కూడా నీది కాదు,అదీ ఒకరకంగా దొంగతనమే అని తన శిష్యులకు చెప్పాడు.అంటే నీ శ్రమ కానిది నీది కాదు.మరొకరు దానంగా ఇవ్వనిదేదీ నీది కాదు అని దాని అర్థం

 - బుద్ధుని పంచశీల నుంచి -

24, జనవరి 2019, గురువారం

యక్ష ప్రశ్నలు - ధర్మరాజు జవాబులు


1. ఏ శక్తి వల్ల సూర్యుడు ప్రతి నిత్యం ప్రకాశిస్తాడు?

సత్యసంధత గల ధర్మమనే శక్తి వల్లే

2 . ప్రాణం ఆపదలో ఉన్నపుడు మనిషిని రక్షించే శక్తి ఏది?

ధైర్యం.

3. ఏ శాస్త్రాలను అధ్యయనం చేస్తే మనిషి విజ్ఞుడవుతాడు?

ఏ శాస్త్రాలవల్లా కాదు.గొప్పవారి సహచర్యం,లోకజ్ఞానం వల్ల.

4. భూమి కంటే భారమైనది ఏది?

నవమాసాలూ మోసి బిడ్డను కనే తల్లి.


5. ఆకాశానికన్నా ఉన్నతమైనదేది?

తండ్రి హృదయం.

6. గాలికన్నా వేగమైనదేది?

మనస్సు.

7. బతికే ఉన్నా చచ్చినవాడితో సమానమైనవారెవరు?

తాను మాత్రమే తింటూ ,ఆకలితో ఉన్నవాడికి పెట్టనివాడు.

8. గడ్డి పరకకంటే తేలికైనది ఏది?

బాధా దగ్ధ హృదయం.

9.బాటసారికి చుట్టమెవరు ?

భార్య.

10. చనిపోయినవారిని అనుసరించేది ఏది?

ధర్మం.

11.మనిషి దేనిని విడిచిపెడితే లోకంలో ప్రేమించబడతాడు?

గర్వం.

12. దు:ఖం రాకూడదంటే ఏం వదిలేయాలి?

కోపం.

13. మనిషి ఆనందంగా బతకాలంటే వదిలేయాల్సిందేమిటి ?అన్నీ నాకే కావాలనే కోరిక.

14. లోకంలో చిత్రమైనదేది?

సృష్టే ఒక విచిత్రం.

15. లోకంలో ఆశ్చర్యకరమైనదేమిటి?

ప్రపంచంలో ప్రతి ఒక్కరికి మరణం అనివార్యమని తెలిసినా మనం ఎప్పుడూ మరణించమని భావిస్తామో ...అదెంతో ఆశ్చర్యకరం.

16. ధర్మ మార్గాన్ని ఎలా తెలుసుకోవాలి?

వాదం చేత ఏదీ తేలదు.సిద్ధాంతాలూ ,శాస్త్రాలూ ఒకదాన్ని మరొకటి వ్యతిరేకిస్తుంటాయి.మనుషుల్లో ఏ ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఉండరు.అందుకనే గొప్పవారు నడిచిన మార్గమే సరైన దారి.అదె సనాతన ధర్మం.

21, జనవరి 2019, సోమవారం

తల్లి దండ్రులను మరువ వద్దు.


మాతృదేవోభవ ,పితృదేవోభవ

1. ఎవరిని మరచినా నీ తల్లిదండ్రులను మాత్రం మరువకు.వాళ్ళను మించి నీ మంచి కోరేవారు ఎవరూ ఉండరని తెలుసుకో.

2. నీవు జన్మించాలని రాళ్ళకు పూజలు చేశారు వారు.రాయివై వారి హృదయాలను ముక్కలు చేయకు.

3. కొసరి కొసరి గోరుముద్దలు పెట్టి అల్లారుముద్దుగా నిన్ను పెంచారు వారు.నీకు అమృతం పంచిన వారిపై విషాన్ని విరజిమ్మకు.

4. ముద్దుమురిపాలతో నీ కోర్కెలు తీర్చారు వారు.ఆ ప్రేమమూర్తుల కోరికలు నీవు నెరవేర్చాలని మరువవద్దు.

5.నువ్వెన్ని కోట్లు సంపాదించినా అవి తల్లిదండ్రులకు సమానమౌతాయా ?తల్లిదండ్రుల సేవలోనే నిజమైన సంపాదనలున్నాయని గ్రహించు.

6.సంతానం వల్ల సుఖం కోరుతావు.నీ సంతాన ధర్మం మరువవద్దు.ఎంత చేసుకుంటే అంత అనుభవించక తప్పదనే సత్యం మరువబోకు.

7.నీవు తడిపిన పక్కలో వారు పడుకొని నిన్ను మాత్రం పొడి పొత్తిళ్లలో పడుకోబెట్టారు.అమృతాన్ని కురిపించే అమ్మ కళ్ళలో అశ్రువులను నింపకు.

8.నీవు నడిచే మార్గములో పూలు పరిచారు వారు.అట్టి మార్గదర్శకులకు నీవే కాలులో ముల్లువై బాధించకు.

9. డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు.తల్లిదండ్రులను మాత్రం సంపాదించలేవు.వారి పాదసేవలోనే గొప్పదనం ఉన్నదని జీవితాంతం మరువవద్దు.

29, డిసెంబర్ 2018, శనివారం

హనుమంతుడికి ఎలా నమస్కరించాలి? / HANUMANTHUDIKI YELA NAMASKARINCHAALI?


ఏ దేవతకైనా అర్చనలో భాగంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరాదని శాస్త్ర నియమం.హనుమంతుడి విషయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం ఏదీ లేదు.అది ఒక విశ్వాసం మాత్రమే.ఆంజనేయుడు అంటే సేవకు ప్రతీక.అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసి కూడారామచంద్రుని పాదసన్నిధిని కోరుకునే సేవా తత్పరుడు.తాను రామదాసుణ్ణని త్రికరణశుద్ధిగా భావించే ఆంజనేయుడు భక్తి అంతా శ్రీరామునికే సమర్పించాలని భావిస్తాడు.ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయరాదనే నమ్మిక లోకంలో ప్రచారమైంది.ఐతే స్వామి త్రిమూర్తి స్వరూపుడనీ ,రుద్రాంశ సంభూతుడనీ సమ్హితలు చెబుతున్నాయి.ఈ దృష్టితో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.కొందరు హనుమ పాదాల కింద శైనైశ్చరుడు ఉంటాడు కాబట్టి సాష్టాంగం చేయకూడదని అనుకుంటారు,అది సరి కాదు.

21, డిసెంబర్ 2018, శుక్రవారం

నాలుగు మంచి మాటలు


1. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపి అయిన పరమేశ్వరుని దర్శింపుము.

2. నీ భాగ్య రేఖ తొలగిన వేళలో నీకు తోడెవ్వరు రారు.అలాగని బాధ పడవద్దు.నిరంతరం నిన్ను వెంటాడే నీ నీడ నీవే కనుక వెలుగు నుండి చీకటిలోకి వెళ్ళినప్పుడు లేదు కదా.

3. నీకన్నా తక్కువ అదృష్టం గల వారిని చిన్న చూపుతో చూడకు.

4. కళయే దైవ సమానం.

5. యాచకులను నిందించకు.నిజానికి లోకులందరూ యాచకులే.

6. కళను,కళాకారులను దూషించకు.నీవు కళాకారుడవైతే ఇతరులను కళావంతులుగా చేయుటకై యత్నించు.

7. జగమంతయు జగదీశ్వరుని సామ్రాజ్యం.అతడు ఎవరికి ఏ పదవినిచ్చునో ఎవ్వరమెరుగలేము.

8. మత్తు పానీయాలు తాగినవాడు దేహాన్ని మరచిపోతాడు.బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు జగత్తునే మరచిపోతాడు.

9.లోభత్వం వీడక మనిషి జ్ఞానం పొందలేడు.

10. మహాత్ములు పరోపకారార్థమై ,లోక కళ్యాణార్థమై అవతరిస్తారు.

11. చంచల చిత్తం సంగీత శ్రవణం ద్వారా ప్రశాంతం నొందగలదు.

12. శ్రమను గుర్తెరుగని యజమానులను సేవింపకు.

13.అపాత్ర దానం మంచిది కాదు.

14. ధనము లేనిదే ఏ పని జరుగదు.కావున ధనం విలువైనది.ధనము విలువను గుర్తెరిగే జ్ఞానము ఇంకా విలువైనది.

15.నీవు పొందుతున్న సౌఖ్యాలు ప్రస్తుతం తరిగిపోతున్న గతములోని పుణ్యపు మూట ,కష్టాలు తరిగిపోతున్న గతములోని నీ పాపపు మూట.

16. కోరకయే ప్రతివారికి భగవంతుడిచ్చే వరం మరణం.

17. ఎంతటి వారైనా దురభిమానం వీడవచ్చు కాని ఆత్మాభిమానాన్ని పూర్తిగా వీడలేరు.

18. విద్య,బల,జాతి,ధన గర్వముతో ఇతరులను వంచించి బాధించకూడదు.

19. అహంకారం నశించే వరకు మనిషి జ్ఞాని కాలేడు.

20. మనిషి ఏది చేసినా జన్మమున్నంతవరకే,త్వరపడి మంచి పనులు చేయండి.పుణ్యాత్ములై శుభఫలితాలనొందండి.మీరు జ్ఞానులై అజ్ఞానులను జ్ఞానులుగా చేయండి.

21. సామ వేద సారమే సంగీతము.

22. జీవ హింస మహా పాతకం.

23.దేహధారి అయిన ప్రతివారికి ఇంచుమించుగా కష్టసుఖాలుంటాయి.

24. మనిషి డబ్బుతో ఎన్నో కొన్నప్పటికి నిమిషమాయువును కూడా కొనలేడు.

25. నిరాకార స్వరూపి అయిన భగవానుని ఉనికి తెలిసికొనుటకు ఏ మూర్తినైనా పూజించవచ్చు.

26. నైరాశ్యము మరియు దురాశ - ఇవి జీవిత లక్షణాలు కావు.

27. భక్తి పేరున అమాయకులను దోచుకునే వారు పాపాత్ములు.

28. అతిథులను శక్తికొలది ఆదరింపుము.

29.ప్రశ్నిచిన వాని ప్రశ్నను బట్టి అతని వివేకము నిర్ధారించవచ్చు.వివేకమైన ప్రశ్న అల్పుడడగలేడు.

30. కళను ఆదరించేవారికన్నా కళను ఆరాధించే వారు చాలా తక్కువగా ఉంటారు.

31.వృద్ధాప్యము మనిషికి భగవంతుడిచ్చే శిక్షలలో చిట్టచివరిది.

28, మే 2017, ఆదివారం

నీవు జయిస్తావు. / NEEVU JAYISTHAVU


మనందరిలోనూ అంతుచిక్కని గొప్ప విలువలు గోప్యంగా ఉన్నాయి.మన వల్ల చేతనవుతుంది, మనవల్ల చేతనవదు అన్నది మనకు సంబంధించిందిగానే ఉంటుంది.కాని 'నేను చేస్తాను 'అన్న మనోవైఖరి ఉండాలి.

ఏదైనా కౄరమృగాన్ని అదుపులో పెట్టాలంటే ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది.కాని పోను పోను దానిపైన స్వారీ చేసినా అది ఏమీ చెయ్యనంత సమర్ధతతో దాని శిక్షకుడు దానిని వశం చేసుకుంటాడు.మనం సర్కస్ లో సాధారణంగా ఇలాంటివి చూస్తుంటాము.అదే విధంగా మనం కౄరంగా ఉన్న మనస్సును మన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.

జీవితం ఒక శారీరకమైన రాకపోకలతోనే పరిమితమైంది కాదు.అది చాలా విశాలమైనది.

వేదాంతపరంగా చెప్పే కాలనిర్ణయం వేరుగా ఉంటుంది.ఒక బండరాయిపైన ,ఇంటికప్పుపైనుంచి రోజూ ఒక్కొక్క బొట్టుగా నీరు పడుతుంటే కొంత కాలానికి రాయి అరిగిపోవడం చూస్తం.

ఒక భక్తుడు రోజూ సాష్టాంగ ప్రణామం చేసి,తన నుదురును నేలపైన ఆనిస్తుంటే కొన్ని సంవత్సరాలకు సొట్టపడటం చూసాను.దానివల్ల అభ్యాసానికి ఎంత విలువుందో తెలుస్తుంది.

మృదువైన నీటి బిందువు రాయిలో మార్పు తీసుకురాగలిగినప్పుడు ,చంచలంగా ఉన్న మనస్సుకు శిక్షణనిచ్చి నిశ్చలంగా చేసినట్లైతే సత్యంలోనికి అది తప్పకుండా చొచ్చుకుపోగలుగుతుంది.

గొప్ప గురువులు అనబడే వారందరిచేతా ' ఓర్పుగా ఉండి,మెలకువగా ఉండి,కష్టపడు,నీవు జయించుతావు ' అని చెప్పబడింది.

ఓటమికి ఆధ్యాత్మిక జీవితంలో స్థానమే లేదు.ఎన్నిసార్లు ఓటమి కలిగినా చివరికి జయిస్తావు.

                              ---- స్వామి రంగనాథానందజీ .

12, మే 2017, శుక్రవారం

నిద్ర లేవగానే భూమికి ఎందుకు వందనం చేయాలి? / LEVAGANE BHOOMIKI VANDANAM YENDUKU CHEYALI?


ఉదయం నిద్ర లేవగానే చేతిని నేలకు తాకించి వందనం చేయాలి.ఎందుకంటే నిద్ర పోతున్నవారి శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తుంటుంది.అది కాస్తా మనం నిద్ర మేల్కొని లేచి నిలబడినపుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది.నిద్రపోతున్నప్పటి ఎనర్జీ స్వచ్చమైనది  కాదు.కావున లేవగానే మనం మొదలు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతి ద్వారా బయటకు పోయి స్వచ్చమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది.అందుకే మన పూర్వీకులు నిద్రలేవగానే మొదట చేతిని భూమికి ఆనించి ఉంచాలని ఆ తరువాతే పాదాలను భూమికి తాకించాలని చెప్పడం జరిగింది.మన దిన చర్యలో భాగంగా ఈ నియమాన్ని పాటించినట్లైతే మనలో అనుకూలమైన శక్తి చేరుతుంది.

8, మే 2017, సోమవారం

ఆలయాల్లో కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? / ALAYALLO KOBBARIKAYA YENDUKU KOTTALI?


దేవాలయాలకు వెళ్లిన ప్రతీ భక్తుడు దేవాలయంలో ప్రత్యేకంగా కొబ్బరి కాయను కొడతారు.కొబ్బరి కాయ కొట్టినట్లైతే మోక్షం లభిస్తుంది అని భక్తులు భావిస్తారు.అందుకోసం దేవాలయాలకు వెల్లిన భక్తులు ఖచ్చితంగా దేవాలయంలోని గర్భ గుడిలో లేదా బయట కొబ్బరి కాయను కొట్టి మొక్కు తీర్చుకుంటారు.ఆలయంలో కొబ్బరి కాయ కొట్టినట్లైతే భగవంతుడి కృప ఉంటుందని భావించి ప్రతీ భక్తుడు దేవాలయాల్లో కొబ్బరి కాయలు కొడతారు.కొట్టిన కొబ్బరి కాయను దేవాలయంలోనే తీర్థ ప్రసాదంగా స్వీకరిస్తారు.

26, మార్చి 2017, ఆదివారం

ఉదయం దీపం పెట్టాక ఇల్లు శుభ్రం చేసుకోవచ్చా? / VUDAYAM DEEPAM PETTAKA ILLU SHUBHRAM CHESUKOVACHA?


దీపం జ్యోతి పరబ్రహ్మ దీపే లక్ష్మి ప్రతిష్టత: ...దీపం అంటే పరమాత్మ.దీపంలో లక్ష్మీదేవి నివసిస్తుంది అని దీని అర్థం.లక్ష్మీదేవి,విష్ణుమూర్తి ఉన్న ప్రదేశంలో చెత్తను ,మురికిని ఉండనీయక పరిశుభ్రంగా ఉంచుకోవాలి.అందువల్ల ప్రాత:కాలమే లేచి ఇంటి ముందు చక్కగా అలికి ముగ్గులు వేసి ఇల్లంతా పూర్తిగా శుభ్రం చేసుకున్న తరువాతనే దీపం పెట్టుకోవాలి.ఇలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మన ఇంట ఎల్లప్పుడూ నివాసముంటుంది.

31, డిసెంబర్ 2011, శనివారం

జ్ఞానం లేని బ్రతుకు LIFE WITH OUT KNOWLEDGE

1. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నచోట ప్రదక్షిణం చేస్తే సంతానం కలుగుతుందా?

పిల్లలు సరైన సమయంలో కలగకపోతే 28 సార్లు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయడం చాలాచోట్ల చాలా కాలం నుండి ఉన్నది. దానికి వైద్య కారణం వెతికితే చిరంజీవి వంటి రావిచెట్టు పురుష అంశ కలది వేప చెట్టు స్త్రీ అంశ కలది ఈ రెండు కలిసిన ప్రదేశం వద్ద ప్రదక్షిణలు చేయడం వల్ల శరీరం వాటి నుంచి ఆమ్ల జణితము ఇట్టే గ్రహిస్తుంది గర్భదోషాలను అరికడుతుంది ఎక్కువ రోజులు ప్రదక్షిణం చేయడం ద్వారా వాటి పైనుంచి పడిన సూర్యకిరణాల వల్ల గర్భకోశ శక్తి పెరిగి సంతానవంతులయ్యే అవకాశం ఉంది 

2. మనిషి తప్పక తీర్చవలసిన రుణాలు ఏమిటి ?

పరిపూర్ణమైన ఆలోచనలతో ధర్మ సంబంధ గృహ సంబంధిత సుఖాలకై మానవజన్మ ఇచ్చినందుకు తోలుతా దేవ రుణాన్ని పూజలు యాగాల ద్వారా తీర్చాలి యజ్ఞ యాగాలు చేయడం ద్వారాచేయడం ద్వారా దేవరుణం తీరటం తో పాటు పరిసరాల్లోని అనేక క్రిముల వల్ల వ్యాపించే అంటురూగాలు సైతం దూరమవుతాయి ఆ తర్వాత నవ మాసాలు మోసి లాలించి పెంచి పెద్ద చేసిన తల్లి రుణాన్ని విద్యాబుద్ధులు నేర్పించి వివాహాది కార్యాలను చేసి ని ఇష్టానుసారంగా బతికే స్వేచ్ఛ ఇచ్చిన తండ్రి రుణాన్ని అనగా తల్లి తండ్రి ఋణాన్ని వయసు మళ్ళినప్పుడు వారు ఏ పని చేసుకోలేని స్థితికి వచ్చినప్పుడు అన్ని తానే అయి తీర్చుకోవాలి . ఆపై ఆచార్య రుణం అనగా సమస్త జ్ఞానాన్ని సభ్యత సంస్కారాలు నేర్పించిన గురువులు ఆచార్యదేవులను ధనం ద్వారా వినయం ద్వారా సేవించాలి తీర్చుకోవాలి

3 . దేవుడికి నైవేద్యం ఎందులో పెట్టాలి ?

బంగారం వెండి రాగి ఇత్తడి అలాగే మోదుగ ఆకుల్లో గాని అరటి ఆకులో గాని తామరాకులు గాని అదే కుదరకపోతే మట్టి పాత్రలోనైనా నైవేద్యం పెట్టాలి. స్టీలు గాజు వంటి వాటిల్లో నైవేద్యం పెట్టడం తగదు 

4 . జ్వరము నీరసము దగ్గు ఉన్నప్పుడు దిష్టి తీయగానే ఒకంత ఉపశమనం కలుగుతుంది ఎందుకు?

 నిప్పులు పళ్లెంలో పోసి ముఖానికి దగ్గరగా పెట్టి మూడుసార్లు మిరపకాయలతో ఉప్పుతో దిష్టి తీసి నిప్పుల మీద వేస్తారు అలా వేసిన తర్వాత వచ్చే పొగను పీల్చడం వల్ల అనగా సోడియం క్లోరైడ్ విడిపోయి సోడియం పెరాక్సైడ్ గా క్లోరిన్ గా మారిన వాటిని పిల్చడం వల్ల ముక్కు రంధ్రాల గుండా తీక్షణమైన వాయువు శరీరంలో ప్రవేశించటంతో శ్వాస మండలం రిలాక్స్ అవుతుంది. దానితో ఏదో తెలియని శాంతి కలుగుతుంది పెద్దలు పెట్టిన ఏ ఆచారంలో నైనా సంప్రదాయంలో నైనా ఎంతో జ్ఞానం ఉంది అలాగే దీనికి ప్రాధాన్యం ఉంది.



జంతువుల్లో కొన్నిటికి తోకాలుటాయి ఆ తోకల వలన
 అవి రెండు ప్రయోజనములను పొందుతుంటాయి వానిలో ఒకటి ఈగల మొదలైన వాటిని తోలుకోవడం రెండు మర్మస్థానాన్ని కప్పిపుచ్చుకోవడం కానీ కుక్క తోక విలక్షణమైనది అది పైన తెలిపిన రెండు కార్యాలకు కూడా ఉపయోగించదు అది వ్యర్థంగానే ఉంటుంది అన్నది నిజమే విజితమే జ్ఞానం లేని బ్రతుకును ధర్మము లేని విద్యను కుక్కతోకతో పోల్చి కొందరు చెప్పి ఉన్నారు కుక్క తోక ఎట్లు నిష్ప్రయోజనకరమైనదో జ్ఞానం లేని బ్రతుకు ధర్మాచరణ లేని విద్య నిరుపయోగమైనవే కాగలవు కాబట్టే జనులు పవిత్రమైన మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ఆత్మ జ్ఞానాన్ని అలవర్చుకోవాలి తన జీవిత లక్ష్యాన్ని గూర్చి పెద్దల వద్ద చక్కగా తెలుసుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడానికి అనవరత కృషిని సెల్ఫీ బ్రతుకును సార్ధకపరుచుకోవాలి ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నప్పటికీ ఆ విద్యతోపాటు ధర్మచరణ ఉన్నప్పుడే అది శోభిస్తుంది. రాణిస్తుంది అట్లు కానిచో ధర్మోద్ధరణకు పవిత్ర వ్యక్తిత్వానికి సచ్చిలానికి ఆ విద్య ఉపయోగపడక పోతే అది నిష్ప్రయోజనమే కాగలదు కాబట్టి మానవుడు ఎన్ని విజయాలు నేర్చుకున్నా ఎన్ని కళలు సంపాదించిన ఆ విద్యలకు కళలకు తపస్సును కూడా జోడించాలి సచ్చేలాన్ని కూడా అనుసంధించాలి అప్పుడే విద్యలు లోకంలో సార్ధకమవుతాయి శాశ్వత ప్రయోజనాన్ని సాధిస్తాయి ధర్మచరణ వల్ల క్రమంగా చిత్తశుద్ధి కలిగి ఆత్మానుభూతికి అవకాశం ఏర్పడుతుంది అటువంటి స్వస్వరూపానుభూతియే జీవితం యొక్క చర్మ లక్ష్యం అద్దానిని ధర్మాచరణతో కూడిన విద్యల వల్ల ఆచారకాలంలోనే మానవుడు పొందగలిగిన వాడు అవుతాడు 
విద్యాతపుభ్యం భూతాత్మ అనునట్లు విద్యతో పాటు తపస్సును సంపాదించి ధర్మాన్ని ఆచరించి జీవుడు కృతకృత్యుడు కావాలి శున : పుచ్చ మివ వ్యర్థం జీవితం విద్య యా వినా నగోపయతి గోప్యాంగం నివారయతి యక్షికాన్.