ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో నెలకొన్న ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు మార్గదర్శి చిట్‌ఫండ్ సంస్థ రెండు స్వర్ణకమలాలను కానుకగా సమర్పించింది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విశేష పర్వదినమైన దుర్గాష్టమి రోజున మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు బంగారు కమలాలను అమ్మవారికి సమర్పించారు. వాటిని 280 గ్రాముల బంగారంతో తయారు చేశారు. రామోజీ ఫిలిం సిటీ ఎండి విజయేశ్వరి తో కలిసి ఆదివారం వేకువ జామున అమ్మవారిని దర్శించుకున్న శైలజా కిరణ్ గారు మొక్కులు చెల్లించారు. స్వర్ణకమలాలను అర్చకులు జగన్మాత పాదాల చెంత ఉంచి పూజలు చేశారు .అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు . అమ్మ వారి కృపతో దసరా రోజులలో రెండు స్వర్ణ కమలాలు కానుకగా సమర్పించి మొక్కులు చెల్లించాము. ఈ భాగ్యం లభించినందుకు జగన్మాతకు ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని శైలజా కిరణ్ గారు తెలిపారు.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
19, అక్టోబర్ 2026, సోమవారం
15, అక్టోబర్ 2026, గురువారం
శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం 2026
నేటి అలంకారం.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం.
ఆశ్వయుజ శుద్ధ పంచమి,గురువారం ..
శరన్నవరాత్రి మహోత్సవాలలో ఐదవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గా విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ దర్శనమిస్తారు.త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్య దేవత.త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకు గడ, విల్లు పాశ అంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలు ఇస్తుందని ,పంచ, దశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. లలితా దేవి విద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి, అని మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం .లలితా దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలని పురాణాలు పేర్కొంటున్నాయి .త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారని ,ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి .
నైవేద్యం.. అల్లం గారెలు ,ఐదు రకాల తీపి పదార్థాలు.
అలంకరించే చీర రంగు.. బంగారు వర్ణం.
అర్చించే పూల రంగు .. వివిధ రకాలు.
పారాయణ చేయాల్సింది..లలితా సహస్ర నామం.
28, సెప్టెంబర్ 2026, సోమవారం
దుర్గమ్మకు బంగారు కిరీటం..
బెజవాడ కనకదుర్గమ్మ కు బంగారు కిరీటం కానుకగా రానున్నది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సుమారు 506.020 గ్రాముల తో తయారు చేయించిన ఈ బంగారు కిరీటంలో 1.73 క్యారెట్ల డైమండ్లు కూడా పొదిగారు .76 లక్షల 60 వేల రూపాయలతో దీనిని తయారు చేశారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ సమక్షంలో త్వరలో ఆలయ అధికారులకు కిరీటాన్ని అందించనున్నారు.
19, మార్చి 2024, మంగళవారం
ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం
ఇంద్రకీలాద్రిపై బఫే పద్ధతితో అన్న ప్రసాదం
శుక్ర శని ఆదివారాల్లో అందించాలని నిర్ణయము మహా మండపం మొదటి అంతస్తులు ఏర్పాట్లు
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్న ప్రసాదం అందాల అధికారులు చర్యలు చేపట్టారు క్యూ లైన్ లో వేచి ఉండకుండా నేరుగా ప్రసాద వితరణ హాల్లోకి చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు నిత్యము అమ్మవారి దర్శనానికి సుమారు 30 వేల నుంచి 40000 మంది విచ్చేస్తుంటారు వీరిలో అత్యధికులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారే సాధారణ రోజులలో 4000 మందికి శుక్ర శని ఆదివారాలు రోజుకు 5000 మందికి అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నారు మహా మండపం రెండవ అంతస్తులు రెండు హాల్స్‌లో అన్న ప్రసాద వితరణ జరుగుతుంది రాంబాబు అన్నదానం వితరణను పరిశీలించిన క్రమంలో పలువురు భక్తులు తమ ఇబ్బందులను వారి దృష్టికి తీసుకువచ్చారు మహా మండపం మొదటి అంతస్తులు పద్ధతిలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన రావడంతో పాటు దానిని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించారు దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఒకదాఫా 100 మంది చొప్పున రోజుల 1500 మందికి అన్న ప్రసాదం అందించే వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వారమే దీని అమలు చేయాలని నిర్ణయించారు
