అలిపిరి వద్దనున్న టీటీడీ శిల్ప కళాశాలకు చెందిన విద్యార్థి సుబ్బరాయుడు గౌడ్ తయారుచేసిన ఆరున్నర అడుగుల అనంతపద్మనాభ స్వామి ప్రతిమ ఇది. ప్రాక్టికల్స్ లో భాగంగా 2025 లో టీటీడీ అందజేసిన టేకు కొయ్యతో దీనిని రూపొందించారు. ప్రస్తుతం ఈ నమూనాను శ్రీవారి సాలకట బ్రహ్మోత్సవాలలో భాగంగా ఫల పుష్ప ప్రదర్శన వద్ద ఏర్పాటుచేసిన శిల్ప కళాశాల స్టాల్లో ఉంచారు. ఇప్పటివరకు ఇంత పొడవైన దేవతామూర్తుల ప్రతిమను ఏ విద్యార్థి తయారు చేయలేదని ప్రిన్సిపల్ వెంకటరెడ్డి తెలిపారు.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
14, సెప్టెంబర్ 2026, సోమవారం
డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్.. తిరుమల
క్యూలైన్లలో వైకుంఠ వైభవం.. భక్తులకు డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్..
తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృధా పోనీయకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు టీటీడీ వినూత్న అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాల్టీ తదితర ఆధ్యాత్మిక సాంకేతిక పరిజ్ఞానంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ లో నాలుగు కోట్ల రూపాయలతో డివోషనల్ ఎక్స్పీరియన్స్ సెంటర్/ హీలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసింది.
తిరుమలేశుడి ఆలయ ప్రాకారాలు మిలమిల..
తిరుమలేశుడి ఆలయంలోని పురాతన మండపాలకు శాస్త్రీయ రసాయన సంరక్షణ పనులను పుణె కు చెందిన లార్డ్ వెంకటేశ్వర చారిటబుల్ అండ్ రెలీజియస్ ట్రస్ట్ ముందుకొచ్చి చేయిస్తోంది. మొదటి దశలో ఆలయానికి చెందిన ఉత్తర, పశ్చిమ, దక్షిణ వైపుల్లోని పై కప్పులు , స్తంభాలకు సంబంధించిన పనులను నిపుణులైన కార్మికులు పూర్తి చేశారు. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మైసూరు పురావస్తు శాఖ విశ్రాంత కెమిస్ట్ అంబేద్కర్ పర్యవేక్షణలో ఈ పనులు చేస్తున్నారు.
టీటీడీ కి కోటి రూపాయల విరాళం..
టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు బెంగళూరుకు చెందిన గిరియప్ప దయానంద రూ. 50 లక్షలు, శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టు కు 50 లక్షలు విరాళంగా అందించారు.
11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
శ్రీవారికి రికార్డు స్థాయి ఆదాయం..
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ప్రవాహం కొనసాగుతున్నది . తాజాగా శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డ్ స్థాయికి చేరింది. గురువారం ఒక్క రోజు హుండీ ద్వారా 6 కోట్ల 93 లక్షల రూపాయలు ఆదాయం లభించినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు .ఇది ఇటీవలి కాలంలో నమోదైన అత్యధిక ఒక్కరోజు ఆదాయాలలో ఒకటిగా నిలిచింది .
తిరుమల చరిత్రలో ఇప్పటివరకు హుండీ ఆదాయం 6 కోట్ల రూపాయల మార్పును దాటడం కేవలం నాలుగు సార్లు మాత్రమే జరగడం విశేషం.
10, సెప్టెంబర్ 2026, గురువారం
తిరుమల వచ్చే ప్రతి భక్తుడికి బీమా
సహజ మరణాలకు రెండు లక్షల రూపాయలు ప్రమాదం అయితే పది లక్షలు టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు ప్రకటన
తిరుమల కొండ ఎక్కే ప్రతి భక్తుడికి బీమా సదుపాయం కల్పించనున్నట్లు టిటిడి చైర్మన్ బీ ఆర్ నాయుడు ప్రకటించారు. అలిపిరి దాటినప్పటి నుంచి భక్తులందరికీ ఈ గ్రూప్ పాలసీ వర్తిస్తుందని తెలిపారు .తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వివరించారు. కొండపై సహజ మరణం పొందిన భక్తుడు కుటుంబానికి రెండు లక్షల రూపాయలు చెల్లిస్తామని చెప్పారు .ఈ విధానాన్ని దేశంలోనే తొలిసారిగా ఆలయాల పరిధిలో టిటిడి ప్రవేశపెడుతోంది అని పేర్కొన్నారు. ప్రమాదాలలో మరణించిన భక్తులకు మూడు లక్షలు గా ఉన్న భీమాను 10 లక్షల రూపాయలకు పెంచామని దీనికి 17 లక్షల రూపాయల ప్రీమియం ఖర్చును టీటీడీ భరిస్తుందని వెల్లడించారు. ఇందుకోసం ఎల్ఐసి తో ఒప్పందం చేసుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపిందని చెప్పారు.
7, సెప్టెంబర్ 2026, సోమవారం
వనితలకు రూ 5 కే ఆటో
తిరుపతి జిల్లా తిరుచానూరుకు చెందిన యువకుడు అజిత్ కుమార్ . ఇంటర్ వరకు చదివి ఆటో నడుపుతున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారు వెలసిన ప్రాంతంలో ఉంటున్నందున అమ్మవారి దర్శనార్థం వచ్చే మహిళలకు తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ ,రైల్వే స్టేషన్ వరకు ప్రయాణానికి ఐదు రూపాయల చొప్పున మాత్రమే తీసుకుంటున్నారు .
ఇతర ఆటోవాలా లు 30 నుంచి 50 రూపాయల వరకు వసూలు చేస్తారని బస్సు చార్జీ 20 రూపాయలు ఉంటుందని అజిత్ తెలిపారు. నాలుగు నెలల క్రితం ఆటో నడపడం ప్రారంభించామని ,అప్పటి నుంచి ఇదే నిర్ణయానికి కట్టుబడ్డానని అజిత్ వివరించారు. తమిళనాడు సీఎం విజయ్ అభిమానిని అని అందుకే ఆటోకు ఆయన చిత్రాలు వేసుకున్నట్లు పేర్కొన్నారు.
2, సెప్టెంబర్ 2026, బుధవారం
తిరుపతిలో శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు..
తిరుమలలో సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను ధ్వజారోహణంతో శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి ఈ ఉత్సవాల్లో భాగంగా 19 న అత్యంత విశేషమైన గరుడ సేవ ను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కు వచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటోంది. కొద్ది నెలల క్రితం తిరుమల లో అందుబాటులోకి వచ్చిన వసతి సముదాయం 5 ను పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకుంటున్నారు. తిరుమల లో 60 వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు , 5 పీ ఏ సీ లు ఉన్నాయి. అయినా భక్తులు గదుల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తిరుపతి లో కొత్త వసతి సముదాయాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుపతి లో భక్తుల కోసం నిర్మించిన శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు ముఖ్య మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మేరకు టీటీడీ తుది ఏర్పాట్లను వేగవంతం చేసింది.
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో గోవింద రాజ స్వామి సత్రాల స్థానంలో నిర్మిస్తున్న ఈ సముదాయాల పనులు చివరి దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రధాన భవనం, గదుల నిర్మాణం పూర్తయినా , లోపలి ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ రెండు సముదాయాల్లో భాగంగా ఒక్కో భవనంలో తొమ్మిది అంతస్తులు నిర్మించారు.దాదాపుగా 10 వేల మంది భక్తులకు వసతి సౌకర్యం కల్పించే వెసులుబాటు కలగ నున్నదని ఆలయ వర్గాల అంచనా.
రెండో అంతస్తులో రిసెప్షన్ , అన్న దానం , వసతి కేంద్రాలుంటాయి. మూడు,నాలుగు అంతస్తుల్లో 48 డార్మెటరీలు..సుమారు 7 వేల మంది భక్తులకు సరిపడా లాకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2024 మార్చి నెలలో ప్రారంభమైన వీటి నిర్మాణానికి రూ 600 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
ఈ గదులను ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా పొందేలా భక్తులకు వినియోగంలోకి తీసుకు వచ్చే విధంగా తుది కసరత్తు కొనసాగుతోంది.
3, మే 2026, ఆదివారం
తిరుపతిలో రెడ్డి భవనం నిర్మాణానికి కోటి రూపాయలు
తిరుపతిలో నిర్మించనున్న ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవన నిర్మాణం కోసం పి పి రెడ్డి గ్రూపు చైర్మన్, యాదగిరిగుట్ట రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు పన్నాల పర్వతాలు రెడ్డి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. రెడ్డి సంఘం ప్రతినిధులు మురళీకృష్ణారెడ్డి, మల్రెడ్డి రామిరెడ్డి ,వినయ్ కుమార్ రెడ్డి, గూడూరు నరోత్తం రెడ్డి, కొలను మహేందర్ రెడ్డి తదితరులు సమక్షంలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా వారు పర్వతాల రెడ్డిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అఖిల భారత రెడ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తిరుపతిలో అధునాతన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ రెడ్డి సంఘం భవనం నిర్మించనున్న విషయం తెలిసింది.
1, మే 2026, శుక్రవారం
పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం
పుష్కరిణి నీటితో శ్రీవారి చిత్రం.. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ఒక యువకుడు గురువారం నాడు తన కళా ప్రతిభతో భక్తిని వ్యక్తం చేశాడు. తమిళనాడులోని తిరువూరుకు చెందిన మోహన్ ప్రభువు అనే భక్తుడు గత పది సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు.
శ్రీవారి పుష్కరిణి నీటిని ఉపయోగించి సుమారు మూడు గంటల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకుంటూ వాటర్ పెయింటింగ్ రూపొందించాడు. అతని భక్తిని కళా నైపుణ్యాన్ని చూసిన పలువురు భక్తులు ప్రశంసించారు.
25, మార్చి 2024, సోమవారం
శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పుస్తక ఆవిష్కరణ
శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రాలను 22 మంది చిత్రకారులు వేయగా దీన్ని శ్రీ వెంకటేశ్వర చిత్రార్చన పేరుతో తిరుపతికి చెందిన శ్రీ కళాక్షేత్ర ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒక పుస్తకంగా రూపొందించింది ఈ పుస్తకాన్ని ఆదివారం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను గీసిన బొమ్మ కూడా ఈ పుస్తకంలో ఉండడం ఆ దేవదేవుడి కృపయా అన్నారు కాకా బ్రహ్మానందం ఆదివారం ఉదయం బిజెపి బ్రేకులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఆయనకు రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డు ప్రసాదాలు అందజేశారు
5, మార్చి 2024, మంగళవారం
శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు
స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు
3, మార్చి 2024, ఆదివారం
తిరుపతి లడ్డు ధరలు తగ్గించేది లేదు
డయల్ యువర్ ఈవోలో ధర్మారెడ్డి వెల్లడి
తిరుమలలో శ్రీవారి లడ్డు ప్రసాదాల ధరలను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించేది లేదని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు లడ్డు బరువు పరిమాణం ఏమాత్రం తగ్గలేదని రేటు తగ్గించడానికి అవకాశం లేదని స్పష్టం చేశారు తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో భక్తుడు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు తిరుపతి లడ్డూ ధరలు తగ్గించాలని భక్తులు విజ్ఞప్తి చేశారు దీనికి ఈవో ధర్మారెడ్డి స్పందిస్తూ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఉచితంగా అందిస్తున్నామని బ్రహ్మోత్సవాలు వైకుంఠ ఏకాదశి తదితర పర్వదినాలలో తప్ప మిగిలిన సమయంలో భక్తులు కావలసినవి లడ్డూలు కొనుగోలు చేసుకోవచ్చు అని సూచించారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
తిరుమలలో ఇక నిత్య సంగీతార్చన
తిరుమల కాలినడక భక్తులకు నిత్య సంకీర్తన అర్చన
టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయము
తిరుమలకు కాలినడకన వచ్చే భక్తుల కోసం నిత్య సంకీర్తన అర్చన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు టిటిడి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్థానిక అన్నమయ్య భవనంలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోర్డు తీర్మానాలను ఈవో ధర్మారెడ్డి తో కలిసి చైర్మన్ వెల్లడించారు అలిపిరి తిరుమల కాలినడక మార్గంలోని గాలిగోపురము ఏడవ మైలు శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహము మోకాళ్ళ మెట్టు వద్ద కళాబృందాలతో నిరంతరం సంకీర్తన అర్చన తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరాన్ని నిర్మించి అక్కడ కూడా నిత్యసంకీర్తనర్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపార
శ్రీవారి ఆలయంలో ద్వారపాలకులైన జయ విజయల విగ్రహాలు ఉన్న గుడి తలుపులు అరిగిపోయిన నేపథ్యంలో ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు తాపడంతో కొత్తవి ఏర్పాటు
శ్రీవారి వివాహ కానుకగా నాలుగు కోట్ల రూపాయలతో మంగళ సూత్రాలు లక్ష్మీకాసులు 7 డిజైన్లలో తయారు చేసేందుకు నాలుగు ప్రముఖ బంగారు ఆభరణాలు తయారీ సంస్థలకు అనుమతి
చిన్నారులలో ధార్మిక నైతిక విలువలు పెంచడంలో భాగంగా సులభ శైలిలో రూపొందించిన భగవద్గీతను తెలుగు తమిళం కన్నడ హిందీ ఆంగ్ల భాషలలో 98 లక్షల కాపీల ముద్రణకు మూడు కోట్ల 72 లక్షల రూపాయలు మంజూరు
తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు పై టీటీడీ రేటు వేసింది టీటీడీ ప్రభుత్వము అహోబిలం మఠము అర్చకులు జీయర్లపై రమణ దీక్షితులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై కీలక నిర్ణయం తీసుకున్న టిటిడి నుంచి ఆయనను తొలగిస్తూ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు టిటిడిలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 9000 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు సిబ్బంది వేతనాలు పెంచుతూ పలక మండలి నిర్ణయం తీసుకున్నది శ్రీవారి ఆలయంలోని జయ విజయ ల వద్ద ఉన్న తలుపులకు ఒక కోటి 69 లక్షల రూపాయలతో బంగారు కాపడం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు గాలిగోపురము ఆంజనేయస్వామి విగ్రహము మోకాల మిట్ట ప్రాంతాల్లో ఇకనుంచి నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయించారు తాళ్లపాకలో అన్నమయ్య కళామందిరం నిర్మాణంతో పాటు నిత్య సంగీతార్చన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు 4 కోట్ల రూపాయలతో నాలుగు ఐదు పది గ్రాముల తాళిబొట్టుల తయారీకి పాలకమండలి నాలుగు కంపెనీలకు టెండర్ కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదముద్ర వేసింది ప్రతిఏటా ఫిబ్రవరి 24వ తేదీన టిటిడి ఆధ్వర్యంలో తిరుపతి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు
11, ఫిబ్రవరి 2024, ఆదివారం
తిరుమల హుండీ ఆదాయం 4.31 కోట్లు
తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం సమకూరింది శుక్రవారం ఒక్కరోజే హుండే కానుకల ద్వారా నాలుగు కోట్ల 31 లక్షల రూపాయలు వచ్చాయి స్వామివారిని 62,593 మంది భక్తులు దర్శించుకోగా 18517 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది సర్వదర్శనం కోసం భక్తులు దాదాపు 8 గంటల సమయం వేచి చూడాల్సి వస్తున్నది తమిళ హీరో జయం రవి శనివారం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు..
6, ఫిబ్రవరి 2024, మంగళవారం
SMS పేలింక్ తో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్ల జారీ
భక్తులు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను ఎస్ఎంఎస్ పే లింకు ద్వారా ఆన్లైన్లో నగదు చెల్లించి పొందేలా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది ఈ మేరకు గత రెండు రోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో విఐపి టికెట్లను నమోదు చేసుకుని రసీద్ పొందిన భక్తులకు టికెట్లు జారీ కాగానే నేరుగా వారి మొబైల్ కు ఎస్ఎంఎస్ లింక్ పంపుతున్నారు. సదర్ లింక్ పై భక్తుడు క్లిక్ చేసి పేమెంట్ గేటువే ద్వారా నగదును చెల్లించి బ్రేక్ దర్శన టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకవేళ పేమెంట్ కట్టే టికెట్ లింకు రాకుండా ఉంటే ఎంబీసీ 34 వద్దకు వెళ్లి నగదు చెల్లించినట్లు చూపించి టికెట్ తీసుకోవచ్చు సదరు టికెట్ను ప్రింట్ తీసుకొని దర్శనానికి వెళ్ళవచ్చు
4, ఫిబ్రవరి 2024, ఆదివారం
మఠాలు పీఠాల సూచనలతో సనాతన ధర్మ ప్రచారానికి కృషి
మఠాధిపతులు పీఠాధిపతులు సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు స్వామీజీల ఆశీస్సులు ఆదేశాలుగా పాటించి ధర్మ ప్రచారానికి పునరంగితమవుతామని పేర్కొన్నారు తిరుమల వాసాన మండపంలో మూడు రోజులపాటు నిర్వహించనున్న శ్రీ వెంకటేశ్వర ధార్మిక సదస్సు శనివారం ప్రారంభమైంది తొలిరోజు 25 మంది పీఠాధిపతులు మఠాధిపతులు స్వామీజీలు హాజరయ్యారు వారికి టీటీడీ జేఈఈవోలు సదా భార్గవి వీరబ్రహ్మం సి వి ఎస్ ఓ నరసింహ కిషోర్ ఇతర అధికారులు మంగళ వాయిద్యాలు నడుమ స్వాగతం పలికారు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి ప్రత్యేక పూజలు అనంతరం భూమన ప్రారంభోపన్యాసం చేశారు ఈవో ఏవి ధర్మారెడ్డి సదస్సు ఉద్దేశాలను వివరించారు హిందూ ధర్మ ప్రచారానికి టీటీడీ చేస్తున్న కృషిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు తిరుమల పెద్ద జీయర్ స్వామి చిన్న జీయర్ స్వామి తో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడులోని వివిధ మతాలు పీఠాలకు చెందిన అధిపతులు అనుగ్రహ భాషణం చేశారు ఆదివారం మరికొందరు ప్రత్యక్షంగా వర్చువల్ గా ప్రసంగించనున్నారు











