నిజామాబాద్ నగరంలోని జెండా బాలాజీ దేవస్థానం నందు ఉండే లెక్కింపు గురువారం జరిగినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి గింజపల్లి వేణు తెలిపారు. ఈ లెక్కింపులో 54,710 నోట్ల రూపంలో నాణ్యాలు 5540 మొత్తం 60 వేల 250 వచ్చినవే అని ఆయన తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో దేవాదాయ శాఖ నిజామాబాద్ సహాయ కమిషనర్ నాయని సుప్రియ ఆధ్వర్యంలో జరిగిందని కార్యనిర్వాహణాధికారి గింజపల్లి వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ జాలిగామ గోపాల్, ధర్మకర్తలు వై రాముగౌడ్ ,పి నర్సింగరావు, టి నాగభూషణం, ఏ సంతోష్, వి నాగరాజు, ఆలయ అర్చకులు ఈ నాగరాజు, జూనియర్ అసిస్టెంట్ శివరాత్రి ఆంజనేయులు, ఆలయ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులు పాల్గొన్నారు.