పాలు పొ0గి న ఇల్లు శ్రీలు పొంగిన ఇల్లు అవుతుందని మన వారి నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ,భోగభాగ్యాలు విలసిల్లు తాయి .కొత్త ఇంటిలోకి ముందుగా గోవు ను ప్రవేశపెట్టి తర్వాత క యజమాని ప్రవేశిస్తాడు .గోవు మహాలక్ష్మి తిరిగిన ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచు లను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషుని కి నైవేద్యం పెడతారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు సంపదలకు కొదవ ఉండదని నమ్మకం .అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.
No comments:
Post a Comment