అమ్మవారి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అమ్మవారి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం

మరుగోళ్ళ పోటీలు అంటే..

 పోలాల అమావాస్య అంటే.. 

శ్రావణం సకల దేవతలకు ప్రీతికరమైన మాసం.. ఈ మాసం సమృద్ధికి ఆలంబనం. ఈ నెలలో ప్రతి రోజూ విశేషమైనదే. ఈ మాసంలో చివరి రోజైన శ్రావణ బహుళ అమావాస్యను "పోలాల అమావాస్య" అంటారు.దీనిని కౌశి అమావాస్య , ఆలోక అమావాస్య గా కూడా పూర్వ గ్రంథాలు పేర్కొన్నాయి.ప్రధానంగా ఇది శక్తి పూజ .ముత్తైదువులు దీన్ని ఆచరిస్తారు. పోలాంబకు ప్రతీకగా కంద మొక్కను పూజా మండపం మీద ప్రతిష్టించి పూజిస్తారు. వరి దుబ్బును కూడా పూజించే ఆనవాయితీ ఉంది. తోరాలను కట్టి ,వాటిని అమ్మవారికి అర్పించి , తమ చేతులకు ,ఇంట్లోని ఆడపిల్లల చేతులకు కట్టుకుంటారు. పోలాంబను పూజించడం వల్ల కుటుంబ సౌఖ్యం, సిరి సంపదలు ,సౌభాగ్యం లభిస్తాయని భక్తుల విశ్వాసం.నందీశ్వరుడు జన్మించిన రోజు ఇదే అని పురాణాలు చెబుతున్నాయి.కాబట్టి పలు ప్రాంతాలలో రైతులు తమకు సాగులో సాయం చేసే బసవన్నలకు వృషభ పూజను నిర్వహిస్తారు. దీనిని " ఎడ్ల పొలాల అమావాస్య " అని కూడా అంటారు.



ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం పోలాల పండుగ సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఎడ్లను రంగు రంగుల దుస్తులతో, బెలూన్లతో అలంకరించారు.అనంతరం వీధులలో ఊరేగించారు. గ్రామ దేవతల ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. 



తర్వాత ఎడ్లను పూజించి నైవేద్యం సమర్పించారు.వాటికి నైవేద్యం పెట్టిన తర్వాత ఉపవాసం వీడడం ఇక్కడి రైతుల సంప్రదాయం.



సీతాదేవి ఆలయం, నువారా ఎలియా జిల్లా,శ్రీలంక.

మరుగోళ్ళ పోటీలు..అంటే..

ఆదివాసీ సంస్కృతి,సాంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవి.వాటిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. పోలాల అమావాస్య రోజున సాంస్కృతిక గిరి ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంగణంలో మరుగోళ్ళ పోటీలు ప్రారంభం అయ్యాయి.ప్రకృతితో మమేకమై జీవించే ఆదివాసీల ఆచారాలు ,పండుగలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.వీటి పరిరక్షణకు ఐటిడిఏ విశేష కృషి చేస్తోంది.


3, మే 2026, ఆదివారం

శివుడికి తల్లి అయిన బెజ్జమహాదేవి

 


శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పం నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని బెజ్జం దేవి గుడిలో ఉన్నది. వీరశైవ భక్తురాలైన అక్కమహాదేవి శిల్పం ప్రసిద్ధం. ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహం అంతటిది. పాల్కురికి సోమన బసవ పురాణంలో బెజ్జమహాదేవి కథ రాస్తూ ఆ పిజ్జా మహాదేవి అందరికీ అందరు ఉన్నారు కానీ శివునికి తల్లి ఉన్నట్లయితే తాపసిని కానిస్తుందా జుట్టు జడలు కట్టనిస్తుందా తల్లుంటే విషం తాగనిస్తుందా తోళ్లు కట్టనిస్తదా.. పాముల ధరింపనిస్తుందా బూడిద పూసుకొని స్తుందా. పల్లకాటిలో ఉండనిస్తుందా తల్లి లేనందువల్లనే కదా శివుడికి నికష్టాలు నేనే శివునికి తల్లిని అవుతానని పిచ్చమహాదేవి లింగమూర్తిని కొడుకును చేసుకుని చంటి బిడ్డకు అభ్యంగన స్నానాలు చేయించినట్టు తాను స్నానం ఆడిస్తున్నదట. ఉగ్గు తినిపిస్తున్నదట ముద్దాడుతున్నదట ఆమె చేస్తున్న బాల్యోపచారాలకు శివుడు మిర్చి ఆమె వద్ద శిశువు గానే ఉండిపోయాడట బెజ్జ మహదేవి శివుణ్ణి నాకున్న, నా పట్టి ,నా చిన్న పడగ, నా కుర్ర అని గారాబాలు చేసింది  తన ఒడిలో పడుకోబెట్టుకుని తన్మయం చెందిందని వర్ణిస్తాడు.



బెజ్జూరలో బెజ్జమహాదేవి శిల్పము 

శివుడిని కొడుకుగా భావించిన బెజ్జమహాదేవి శిల్పము నిజామాబాద్ జిల్లా బెజ్జోరా గ్రామంలోని దేవి గుడిలో ఉన్నది వీరశైవ భక్తురాలైన అక్క మహాదేవి శిల్పము ప్రసిద్ధము ఇక్కడ బెజ్జమహాదేవి విగ్రహము అలా అంతటిది. ఈ శిల్పాన్ని మా కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ చూసి ప్రతిమ లక్షణాలను గుర్తించడం కోసం ఫొటోలు పంపాడు.



7, మార్చి 2024, గురువారం

మేడారం జాతర ఆదాయం 13 కోట్ల 25 లక్షలు

 గత జాతర కంటే కోటి రూపాయల 80 లక్షల ధనం 779 గ్రాముల బంగారం సమర్పించిన భక్తులు ముగిసిన హుండీలు లెక్కింపు

తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహా జాతర హుండీల కానుకల ఆదాయం మొట్టమొదటిసారి 13 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటివరకు జరిగిన జాతరలో ఇదే అత్యధిక ఆదాయంగా నమోదయింది 2022 జాతర కంటే మరో కోటి రూపాయల 80 లక్షల ఆదాయం పెరిగింది బంగారం వెండి కానుకలు కూడా పెరిగాయి మొత్తంగా వరంగల్లో వారం పాటు నిర్వహించిన హుండీల లెక్కింపు ప్రక్రియ బుధవారం ముగిసింది ఈసారి జాతరలో 540 ఉండి ఏర్పాటు చేశారు ఫిబ్రవరి 29న లెక్కింపు మొదలుపెట్టగా కరెన్సీ నోట్లు నాణేల రూపంలో 13 కోట్ల 25 లక్షల 225100 వచ్చింది 2022 జాతరలో 517 హుండీలు ఏర్పాటు చేయగా 11 కోట్ల 45 లక్షల 34,526 రూపాయలు ఆదాయం వచ్చింది తాజాగా హుండీల ద్వారా 779 గ్రాముల 800 మిల్లి గ్రామంలో బంగారం 55 కిలోల 150 గ్రాముల వెండి ఆభరణాలు సమకూరాయ్ ఇతర దేశాలకు చెందిన 38 కరెన్సీ నోట్లు రాగా ఇందులో యూఎస్ డాలర్ 20072 కతారి 8 ఆస్ట్రేలియా 6 ఇంగ్లాండ్ 3 సింగపూర్ రెండు నోట్లు వచ్చాయి వీటిని ఫారం ఎక్స్చేంజిలో విలువ కట్టడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మొత్తం ఆదాయంలో కలవాలని ఉన్నట్లు అధికారులు తెలిపారు ఎండోమెంట్ శాఖా సొంత సిబ్బందితోపాటు మరో రెండు వందల మంది వాలంటీర్ల సహాయంతో వారం రోజుల్లో కౌంటింగ్ విజయవంతంగా పూర్తి చేసింది దేవాదాయశాఖ అకౌంట్లో ఉన్న మూడు బ్యాంకుల సిబ్బంది కౌంటింగ్ మిషన్లతో భారం పాటు ఇక్కడే డ్యూటీ చేశారు వచ్చిన ఆదాయాన్ని డిపార్ట్మెంట్ బ్యాంక్ అకౌంట్లో జమ చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ రామాల సునీత మేడారం ఈవో రాజేంద్రన్ తెలిపారు




1, మార్చి 2024, శుక్రవారం

కన్నుల పండుగ విగ్రహ ప్రతిష్టాపన

 లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామంలో గణపతి శ్రీ వీరభద్ర సమేత భద్రకాళీ దేవి శివలింగం నంది విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పలుకుట శ్రీ మంగి రాములు మహారాజ్ వేద పండితులు యోగేష్ స్వామీల ఖర కమలములచే కన్నుల పండుగ నిర్వహించారు ఉదయం నుండి యంత్ర ప్రతిష్ట కళ్యాణం ఉత్సవం కాలన్యాసం నేత్రోన్ మలను స్వామివారి అలంకరణ సర్వదర్శనం మంగళహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా రాములు మహారాజు మాట్లాడుతూ గణపతి వీరభద్ర సమేత శ్రీ భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో సకాలంలో వర్షాలు కురిసి పంటలు పండాలని ప్రజల ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆశీస్సులంతా చేశారు అనంతరం భక్తుల సౌకర్యార్థం కమ్మనైన వంటకాలతో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పురోహితులు విశ్వనాథ శాస్త్రి పృథ్వి స్వామి వికాస్ స్వామి నిఖిల్ స్వామి లేడీస్ పెద్దలు మహిళలు యువత యువకులు పాల్గొన్నారు



మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం

 


మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు

గురువారం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ సమీపంలోని టీటీడీ కల్యాణ మండపంలో భారీ బందోబస్తు మధ్యన లెక్కింపు ప్రక్రియ మొదలైంది దేవాదాయ రెవిన్యూ శాఖల సిబ్బంది స్వచ్ఛంద కార్యకర్తల సహాయంతో  లెక్కింపు జరుగుతుంది

హుండీలో బంగారు తాళిబొట్లు ఫారిన్ కరెన్సీలతో పాటు ఫేక్ నోట్లను కూడా భక్తులు కానుకలుగా వేశారు 518 హుండీలలో ఒక్కో హుండీని ఓపెన్ చేస్తూ లెక్కిస్తున్నారు అనుమకొండ పబ్లిక్ గార్డెన్ ఎదురుగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో లెక్కింపు ప్రక్రియను గురువారం ఎండోమెంట్ పోలీస్ మేడారం పూజారులు ప్రారంభించారు హుండీలలో విలువైన బంగారు వెండి ఆభరణాలతో పాటు చిల్లర కాయిన్స్ ను భక్తులు భారీగా వేశారు టన్నులకొద్దీ ఒడిబియ్యాన్ని బస్తాల్లో నింపుతున్నారు కాగా మొదటి రోజు మూడు కోట్ల రూపాయల 15 లక్షల 40 వేల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపార మొదటిరోజు ఆదాయాన్ని అధికారులు ఎండోమెంట్ అకౌంట్ లో జమ చేశారు లెక్కింపు ప్రక్రియను దేవాదాయ శాఖ డిప్యూటీ అడిషనల్ కమిషనర్లు శ్రీకాంతరావు సునీత పర్యవేక్షిస్తున్నారు

బంగారు భరిణలు వెండి ఉయ్యాలలు జాతరలో  చాలామంది భక్తులు తమ మొక్కులలో భాగంగా బంగారు వెండి ఆభరణాలను హుండీలలో వేశారు లెక్కింపు సమయంలో ప్రతి బాక్సులు బంగారు తాళిబొట్లు కుంకుమ భరణి కడియాలు బయటపడుతున్నాయి వెండితో చేసిన ఊయలలు సమ్మక్క సారలమ్మ తల్లుల కన్నుల రూపాలు నాగుపాము ముద్రలు ఇంటి బొమ్మలు తదితరాలు కానుకలుగా వచ్చాయి వాటిని ప్రత్యేక హుండీలో వేసి తాళాలు వేసి భద్రపరిచారు జాతరకు వచ్చిన కొందరు విదేశీ భక్తులతో పాటు ఇతర దేశాలకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన తెలంగాణ భక్తులు కూడా మొక్కల క్రింద ఫారిన్ కరెన్సీని హుండీలలో కానుకలుగా సమర్పించారు ఇలాంటి వందల కొద్ది నోట్లు బయటపడుతున్నాయి మరికొందరు భక్తులు డాన్స్ చేసిన పాత 500 రూపాయల నోట్లు వేశారు 2000 రూపాయల నోట్లు కూడా వేశారు అంబేద్కర్ ఫోటోతో ముద్రించిన 100 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లు హుండీలలో కనిపించాయి కరెన్సీ పై అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని ఆ నోట్లపై రాశారు కదా మేడారం జాతరలో మొత్తం 535 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు 518 హుండీలు పూర్తిగా నిండాయి ఇందులో 482 ఐరన్ 34 క్లాత్ రెండు కోడి బియ్యం హుండీలు ఉన్నాయి ఇంకా తెలుగు వారం హుండీలు మండపానికి చేరుకోలేదు గురువారం 134 హుండీలను తెరిచారు

లెక్కింపు సిబ్బందికి డ్రెస్ కోడ్ కానుకల లెక్కింపులో మొత్తం 400 మంది సిబ్బంది పాల్గొన్నారు వీరిని మహిళా కానిస్టేబుల్ తో చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు లెక్కింపులో పాల్గొనేవారు చేతివాటం ప్రదర్శించకుండా అధికారులు సీసీటీవీ కెమెరాలో ఏర్పాటు చేశారు మెయిన్ డోర్ వద్ద మెటల్ డిటెక్టర్ ఏర్పాటుచేసి తనిఖీలు చేశారు కానుకల రూపంలో వచ్చిన కరెన్సీని బ్యాంకర్లు తీసుకువచ్చిన కౌంటింగ్ మిషన్లతో లెక్కిస్తున్నారు అమ్మవార్ల కానుక లెక్కించడానికి గతంలో రెండు వారాల సమయం పట్టగా ఈసారి వారంలో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు

చిల్లర లెక్కింపు కోసం మిషన్లు జాతరలో భాగంగా భక్తులు వేసిన చిల్లర నాణేలతో చిన్నచిన్న డ్రమ్ములు నిండుతున్నాయి అయితే చిల్లర నాణేల లెక్కింపు అధికారులకు తలనొప్పిగా మారేది అయితే ఈసారి కాయిన్స్ లెక్కించడానికి ప్రత్యేకంగా మిషన్లు తయారు చేయించారు కాయిన్ సైజు ఆధారంగా నాణేలను ఆ మిషన్లను వేయగానే అవిసెపరేట్ అవుతున్నాయి దీంతో లెక్కించడానికి సులభం అవుతుంది. గతంలో భారీ మొత్తంలో వస్తున్న రూపాయి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయల నాణేలను వేరుచేసి లెక్కించడానికి అదనంగా నాలుగు అయిదు రోజులు సమయం పట్టేది అదే సమయంలో భక్తులు మొక్కల రూపంలో వేసిన పచ్చని ఓడిబియ్యాన్ని జల్లెడ సాయంతో వేరు చేసి బస్తాల్లో నింపుతున్నారు



అన్నపూర్ణాదేవి విగ్రహ ప్రతిష్టాపన

 


బిచ్కుంద మండల కేంద్రంలోని బండయప్ప మఠంలో గురువారం అన్నపూర్ణాదేవి గణపతి విగ్రహం నవగ్రహాల విగ్రహాలను ప్రతిష్టించారు మఠం పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి కమల ఖడ్గం హానేగా మఠం పీఠాధిపతుల సమక్షంలో ప్రత్యేక పూజలు హోమాలు యజ్ఞం పాలాభిషేకం చేసి విగ్రహాల ప్రతిష్టాపన చేశారు అన్నపూర్ణాదేవి మందిరం ముందు ధ్వజస్తంభం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొని పూజలు చేసే ముక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ సోమయ్యప్ప స్వామి మాట్లాడుతూ ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి దైవభక్తి పెంపొందించుకోవాలన్నారు అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మఠాధిపతులు మల్లికార్జున స్వామి శంకరాలింగ వివాచార్య కాంగ్రెస్ విఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

29, ఫిబ్రవరి 2024, గురువారం

భగవంతుడిని ఏమని అడగాలి

 వివేకానంద యుక్త వయసులో ఉండగా తండ్రి విశ్వనాథ దత్త హఠాత్తుగా కన్నుమూశారు ఒక్కసారిగా కుటుంబం పేదరికంలో కురుకుపోయింది పెద్ద కుమారుడైన వివేకానందుడే ఆధారమయ్యాడు పట్టభద్రుడైన ఆయనకు ఎక్కడా ఉద్యోగం దొరకలేదు అలాంటి క్లిష్ట పరిస్థితులలో గురువు పరమహంస వద్దకు వెళ్లి బాధపంచుకున్నాడు అప్పుడు ఆయన సమీపానే ఉన్న దక్షిణేశ్వర కాళి ఆలయం వైపు చూపిస్తూ ఇవాళ మంగళవారం ఈరోజున అమ్మవారిని ఏది కొడితే అది అనుగ్రహిస్తుంది వెళ్లి ప్రార్థించు అన్నాడు ఆ సాయంత్రం వివేకానంద మందిరానికి వెళ్లి అమ్మను ప్రార్థించారు తిరిగి వచ్చాక రామకృష్ణుడు అమ్మ ఏమన్నది అని అడిగారు అరే అడగటం మర్చిపోయాను అని వివేకానంద మదనపడ్డారు. సరే మళ్ళీ వెళ్ళు అన్నారు పరమహంస ఈసారి అదే పద్ధతి మూడోసారి స్వామీజీ ఖాళీ ఆలయానికి వెళ్లి వచ్చాక ఎలాంటి అలజడి లేకుండా ప్రశాంతంగా కనిపించారు పరమహంసను ఉద్దేశించి జగన్ మాతను డబ్బు కావాలని ఎలా అడగగలను? అలా చేస్తే మహారాజు దగ్గరకు వెళ్లి గుమ్మడికాయ అడిగినట్లు ఉంటుంది నిస్వార్ధ ప్రేమతో భక్తితో అమ్మను అర్థం చేసుకునే శక్తిని ఇమ్మని ప్రార్థించాను అన్నారు వివేకానంద కానీ అమ్మవారి కృప గురువుగారి ఆశీస్సులు ఫలంగా అప్పటినుంచి వివేకానంద కుటుంబానికి ఎలాంటి లోటు రాలేదు అవసరమైన వసతులకు ఇబ్బంది కలగలేదు

27, ఫిబ్రవరి 2024, మంగళవారం

హనుమకొండకు మేడారం హుండీలు

 మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగియడంతో జాతర సమయంలో లక్షలాదిమంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు ఈ సందర్భంగా గద్దెల ప్రాంతంలో ఏర్పాటు చేసిన హుండీలో తల్లులకు సమర్పించిన కానుకలను లెక్కించడానికి దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఆర్టిసి కార్గో బస్సులలో 512 హుండీలను హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో రాజేంద్ర మాట్లాడుతూ ఈనెల 29 నుంచి హుండీల లెక్కింపు పకడబందీగా చేపట్టనున్నట్లు తెలిపారు



26, ఫిబ్రవరి 2024, సోమవారం

రాజగోపుర నిర్మాణానికి విరాళం

 కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నెలకొని ఉన్న శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ రాజగోపుర నిర్మాణానికి బోడపుంటి సురేఖ కాశీనాథ్ దంపతులు పదివేల ఒక వంద పదహారు రూపాయల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకుడు భావి శరత్చంద్ర శర్మ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఆలయ రాజగోపుర నిర్మాణానికి భక్తులు ఇదోదికంగా విరాళాలు అందజేసి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆలయ కమిటీ వర్గాలు కోరాయి.

24, ఫిబ్రవరి 2024, శనివారం

అమ్మవారి రాజగోపుర నిర్మాణానికి విరాళము

 

దోమకొండ చాముండేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారి రాజ గోపుర నిర్మాణానికి అతిమాముల విజయ బలరాం దంపతులు పదివేల ఒక వంద ఇరవై ఒక్క రూపాయిలు నిరాళంగా అందించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానికులు చింతల రాజేష్ తాటిపల్లి శ్రీధర్ పోతుల రాజు పూజారి శరత్ చంద్ర తో పాటు ధర్మకర్తల పాల్గొన్నారు.

23, ఫిబ్రవరి 2024, శుక్రవారం

బాసరలో ఆర్జిత సేవలకు సంప్రదాయ దుస్తులు

 బాసర అమ్మవారి ఆలయంలో అచ్యుత సేవలు అభిషేక పూజలు చేసే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచిస్తూ ఆలయ పరిసరాలలో బోర్డులు ఏర్పాటు చేశారు ఆయా పూజలకు పురుషులు ధోవతి పంచే తెల్లటి చుక్క కండువా మహిళా భక్తులు చీర అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు మార్చి ఒకటి నుంచి అమలు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.

21, ఫిబ్రవరి 2024, బుధవారం

నూతన దేవి విగ్రహాల ప్రతిష్టాపన

 దోమకొండలోని శ్రీ నల్ల మారెమ్మ దేవి ముత్యాలమ్మ దేవి నూతన విగ్రహాల ప్రతిష్టాపన ఉత్సవాన్ని మంగళవారం నాడు ఘనంగా నిర్వహించారు ఆలయంలో ఉదయం అగ్ని ముఖం అగ్ని ప్రతిష్టాపన సర్వదేవత పూజలు హోమాలు నూతన విగ్రహాలకు జలాధివాసం శిరాధివాసం ధాన్యాధివాసం చతుర్వేద స్వస్తీ తదితర పూజలు నిర్వహించారు జడ్పిటిసి తిరుమల గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శంకర్ శ్రీనివాస్ కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారామధుడు సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి గోసంగి సంఘం నాయకులు పుల్లయ్య పోశెట్టి రాజేశం శ్యామ్ రాజేందర్ లక్ష్మీపతి స్వామి తదితరులు పాల్గొన్నారు



18, ఫిబ్రవరి 2024, ఆదివారం

కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్టాపనను విజయవంతం చేయండి

 


బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో ఈ నెల 19 నుంచి నిర్వహించబోయే కనకదుర్గాదేవి స్థిర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రేమల శంబురెడ్డి భక్తులను కోరారు శనివారం విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రేమలో మాట్లాడుతూ ఈనెల 19 నుంచి 23 వరకు ఐదు రోజులపాటు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఉంటాయన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సరిత బెజకం సత్యనారాయణ సంతోష్ శర్మ రాజు తదితరులు ఉన్నారు



16, ఫిబ్రవరి 2024, శుక్రవారం

సమ్మక్కకు ముస్లిం భక్తుల ఎత్తు బంగారం

 కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు చెందిన ఎండి సర్దార్ షబానా దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్కను దర్శించుకున్నారు కొడుకు నవాజ్ ఇటీవల అనారోగ్యానికి గురికాగా వారు వనదేవతలకు మొక్కుకున్నారు అతడి ఆరోగ్యం కుదుటపడగా గురువారం శంకరపట్నం లోని సమ్మక్క గద్దెకు చేరుకొని బాలుడు ఎత్తు బంగారం సమర్పించారు



ఆలయ నిర్మాణానికి విరాళం

 గాంధారి మండల కేంద్రంలోని సేవాలాల్ మహారాజ్ జగదాంబ మాత ఆలయ నిర్మాణం కోసం తన వంతు సహాయంగా తిప్పారం తండా మాజీ సర్పంచి సుందరి భాయ్ భర్త బిషన్ నాయక్ 21 రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ చైర్మన్ శంకర్ నాయక్ గురువారం అందజేశారు వెంట గిరిజన నాయకులు భాగ్య నాయక్ శంకర్ నాయక్ పాల్గొన్నారు



15, ఫిబ్రవరి 2024, గురువారం

కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి భూమి పూజ

 బిబిపేట్ మండల కేంద్రంలోని నగరేశ్వర మందిరంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు కార్యక్రమంలో సంఘ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు



వైభవంగా విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు

 నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి గౌడ సంఘం ఆధ్వర్యంలో బుధవారం జలాభిషేకం హోమం నిర్వహించగా గురువారం విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు వేద పండితుడు సంజీవరావుతో పాటు గౌడ సంఘం సభ్యులు కృష్ణ గౌడ్ మొగలాగౌడ్ అంజా గౌడ్ సురేష్ గౌడ్ సుభాష్ గౌడ్ దంపతులు భక్తులు పాల్గొన్నార



ఆలయ నిర్మాణానికి భూమి పూజ

 బీర్కూరు మండల కేంద్రంలోని తోట్ల హనుమాన్ ఆలయ ఆవరణలో దుర్గామాత సంత్ గులాబ్ బాబా ఆలయాల నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు శ్రీ కాళీ దండి స్వామి వారి ఆధ్వర్యంలో వేద పండితులతో పూజలు నిర్వహించారు కార్యక్రమంలో భవాని కమిటీ అధ్యక్షుడు మాధప్ప ఆనంద పటేల్ గంగా గౌడ్ విజయ్ కన్న రాజశేఖర్ భక్తులు పాల్గొన్నారు



14, ఫిబ్రవరి 2024, బుధవారం

భక్తులకు పండ్లు వాటర్ పంపిణీ

 బాన్స్వాడ నుండి బాసరకు కాలినడకన వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు థర్డ్ బిలోలిలో పండ్లు వాటర్ బాటిల్ ని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అష్టం శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో భక్తులకు వాటర్ సౌకర్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల సాయి రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా తదితరులు పాల్గొన్నార



బాన్సువాడ నుంచి బాసరకు భక్తుల పాదయాత్ర

 


బాన్సువాడ నుండి ప్రారంభమైన భక్తుల పాదయాత్ర మంగళవారం బోర్గం మీదుగా బాసరకు చేరుకుంది వసంత పంచమే వేడుకలను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఏటా బాసరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారింది ఈ సందర్భంగా మార్గమధ్యంలో బూర్గం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వసంత పంచమి వేడుకల సందర్భంగా 1993 నుండి కాలినడకన బాసర పీఠాధిపతిని చేరుకుంటామన్నారు వసంత పంచమికి 46 ఒక్కరోజు ముందు భక్తులు మండల దీక్షలు నిర్వహిస్తారు వేడుకలకు రెండు రోజుల ముందు బాన్స్వాడ నుండి కాలినడకన బాసర వరకు భక్తులు పాదయాత్ర చేపడతారు నెమ్లి సాయిబాబా మందిరం బోధన్ రెడ్డి తదితర ప్రాంతాలలో బిక్షలు ఏర్పాటు చేసుకుంటారు బాసర సరస్వతి మాత ఆలయానికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు