జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో శుక్రవారం నాడు గ్రామస్తులు భారడి పోచమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ పులిమేరలో ఉన్న ఆలయాన్ని పూలమాలలతో అందంగా అలంకరించడమే కాకుండా ఆడపడుచులు అందరూ గ్రామం నుండి నైవేద్యాలు తీసుకుని బోనాలు నెత్తిన పెట్టుకొని భాజా భజంత్రీలతో ఊరేగింపుగా వచ్చి పోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు దీనితో పాటు పలువురు బంధుమిత్రులకు సైతం గుడి వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా భారడి పోచమ్మ గుడి సేవకురాలు లక్ష్మీబాయి సేవలు అందించార
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
2, మార్చి 2024, శనివారం
13, ఫిబ్రవరి 2024, మంగళవారం
బారడి పోచమ్మకు బోనాల సమర్పణ
బిచ్కుంద మండలంలోని హస్గుల్ గ్రామంలో బారడి పోచమ్మ పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి అందంగా అలంకరించిన బోనాలను నెత్తిన పెట్టుకొని డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లారు అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మారుతి ఎంపిటిసి నారాయణ మంద రమేష్ గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
12, ఫిబ్రవరి 2024, సోమవారం
ఘనంగా పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన
భీమ్గల్ పట్టణంలో ఆదివారం రోజున పురాస్తూ గంగారపు సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ మరియు పోత లింగన్న విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది విగ్రహాన్ని ఊరు మైసమ్మ నుండి ఊరేగింపుగా పోతురాజుల నాట్య నృత్యాలతో డప్పు చప్పులతో మేళ తాళాలతో మంగళ హారతులతో బోనాలతో మహిళలు శోభాయాత్ర చేయడం జరిగింది. పోచమ్మ విగ్రహాన్ని కోరు చివర ఉన్న ఆలయంలో నూతన విగ్రహ పోచమ్మను మరియు పూత లింగన్నను ప్రతి స్థాపించారు తదనంతరం పోతురాజులు భజనలు పూజా కార్యక్రమాలు నిర్వహించి మేకతో బలిదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దురస్తూ కంగారపు సంఘాల సభ్యులందరూ రెండు సంఘాల మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు



