శ్రీ వీర హనుమాన్ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ వీర హనుమాన్ ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

అంజన్న స్వాముల సన్నిధానానికి కూలర్లు అందజేత

 కుంటాల మండల కేంద్రమైన కుంటాలలోని అంజన్న స్వాములకు సన్నిధానంలో నందిపేట మండలంలోని జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నందగిరి అన్వేష్ కుమార్ అంజన్న భక్తులకు రెండు కూలర్లను విరాళంగా తన వంతుగా సహాయంగా అందజేశారు అంతేకాకుండా అంజన్న భక్తులకు బిక్షం ఏర్పాటు చేసి అన్నదానం చేశారు ఈ సందర్భంగా గురుస్వామి భుజంగం గణపతి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామి పూజా కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అంజన్న స్వాములు గ్రామస్తులు పాల్గొన్నార



19, మార్చి 2024, మంగళవారం

దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపనలు

 ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటారుమూరులో శివ పంచాయతన సహిత హనుమాన్ దేవాలయ ప్రతిష్టాపన మహోత్సవాలు ప్రారంభమయ్యాయి నాలుగు రోజులపాటు జరగనున్న ఉత్సవాలలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు విగ్రహాల ఊరేగింపు అనంతరం ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించారు బుధవారం శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య స్వామీజీ చేతుల మీదుగా శివ పంచాయత నవగ్రహ ధ్వజ శికర సహిత హనుమాన్ దేవత మూర్తులు యంత్రస్థాపన మూర్తుల ప్రతిష్టాపన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో వీడిసి అధ్యక్షుడు ఇత్తడి గంగారెడ్డి కోశాధికారి తిరుపతి గౌడ్ ప్రధాన కార్యదర్శి గడ్డి కార్తీక్ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు

3, మార్చి 2024, ఆదివారం

హనుమాన్ ఆలయాలలో భక్తుల పూజలు

 బాన్సువాడ పట్టణంలోని పెద్ద హనుమాన్ మందిరం గౌలిగూడ పాత బాన్సువాడ శ్రీ రామ మందిరాలలో శనివారం భక్తులు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం నుంచి ఆలయ అర్చకులు స్వామి వారికి సుప్రభాత సేవ అభిషేకాలు అర్చనలు నిర్వహించారు సింధూరంతో స్వామిని అలంకరించారు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ఆంజనేయస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు

2, మార్చి 2024, శనివారం

హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు

 బోధన్ పట్టణంలోని నడివూరు చావిడి వద్ద నూతన హనుమాన్ ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా రెండో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు శుక్రవారం రెండో రోజు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. పాడిపంటలు చల్లగా ఉండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు బాగ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి మహా సంస్థానం పీఠాధిపతి హాజరుకానున్నారని పేర్కొన్నారు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం చేసినట్లు తెలిపారు కార్యక్రమంలో గ్రామ కమిటీ సభ్యులు వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు



29, ఫిబ్రవరి 2024, గురువారం

హనుమాన్ ఆలయానికి మైక్ సెట్ వితరణ

 పిట్లం మండలంలోని చిల్లరికి హనుమాన్ ఆలయానికి గ్రామానికి చెందిన దుమ్మ శంకర్ అనే దాత పదివేల రూపాయల విలువ చేసే మైక్ సెట్ గురువారం ఆలయ కమిటీ సభ్యులకు వితరణ చేశారు ఆయన మాట్లాడుతూ అనుమానాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించే సమయంలో హనుమాన్ మాల ధారణ స్వాములకు ఈ మైక్ సెట్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు అదేవిధంగా ఉదయాన్నే గ్రామస్తులను మేల్ కోల్పోయిన అనుమాన ఆలయం ఆవరణలో ఆంజనేయ స్వామి చాలీసా వినిపించడం జరుగుతుందని పేర్కొన్నారు



నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు

 బోధన్ పట్టణంలోని మారుతి మందిరం నూతన మండపంలో గురువారం నవగ్రహ యంత్ర ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు ఇట్టి కార్యక్రమంలో బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి నెట్టూరి వామన అవధాని యొక్క సుహస్తాల చేత యంత్ర స్థాపన చేతి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ బాలయోగి పిట్ల కృష్ణా మహారాజ్ ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ మహేష్ జోషి కేదార్ కార్యనిర్వాన  అధికారి రవీందర్ గుప్తా రాములు విగ్రహ దాతలు  తదితరులు పాల్గొన్నారు



నేరుగా ఇంటికి అయోధ్య హనుమాన్ ప్రసాదము

 అయోధ్యలో ఉన్న హనుమాన్ గడి ఆలయ ప్రసాదం ఇక నేరుగా భక్తుల ఇళ్ళకు చేరనున్నది బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట తర్వాత అయోధ్యలో భక్తుల రద్దీ లక్షల సంఖ్యలో పెరిగింది దీంతో చాలామంది భక్తులకు హనుమాన్ గడి ఆలయ దర్శనం సాధ్యం కావడం లేదు ఈ నేపథ్యంలో భారతీయ తపాలా శాఖ హనుమాన్ గడి ఆలయ ప్రసాదాన్ని పోస్టల్ శాఖ ద్వారా ఇళ్లకు పంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ప్రసాదం కోసం దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి డిప్యూటీ పోస్ట్ మాస్టర్ అయోధ్య ఖాన్ 224123 చిరునామాతో ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ తీయాలి భక్తుల చిరునామా ఇచ్చి ఆర్డర్ చేయాలి పిన్కోడ్ ఫోన్ నెంబర్ తప్పనిసరి ఇలా ఆర్డర్ చేశాక స్పీడ్ పోస్ట్ ద్వారా ప్రసాదాన్ని ఇంటికి పంపుతామని ప్రయోగరాజ్ వారణాసి జోన్ పోస్ట్మాస్టర్ కృష్ణకుమార్ తెలిపారు 251 ఒక్క రూపాయల మనీ ఆర్డర్ కు లడ్డూలు, హనుమాన్ చిత్రం మహావీర్ గంధం అయోధ్య దర్శన పుస్తకం పంపుతారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం

 శ్రీ అభయాంజనేయ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సత్కరించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు




21, ఫిబ్రవరి 2024, బుధవారం

మందిర పునర్నిర్మాణ కరపత్రాల ఆవిష్కరణ

 బోధన్ పట్టణంలోని పాత బస్టాండ్ లో గల ఎల్లమ్మ గుడి చావిడి ప్రాంతంలో గల హనుమాన్ మందిర పునర్నిర్మాణం విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు ఈనెల 29 నుండి మార్చి ఒకటి రెండు తేదీలలో మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అన్నారు దీనికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం గ్రామ కమిటీ అధ్యక్షులు బాగయ్య యాదవ్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ మూడు రోజులపాటు పూజా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం మూడు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది అని తెలిపారు



ప్రారంభమైన ఆలయాల యజ్ఞాలు

రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన రామాలయ హనుమాన్ ఆలయాల విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని మంగళవారం ప్రారంభించారు మొదటి రోజు యజ్ఞాలు, హోమాలు కాల్చి పూజలు నిర్వహించారు గ్రామంలోని మహిళలందరూ మంగళహారతులతో ఆలయాలను చేరుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సాయి గౌడ్ కోశాధికారి గోపాల్ సాయిబాబాగౌడ్ మాజీ సర్పంచులు పాముల సాయిలు ఆగంటి సురేందర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ సుంకరి సుదర్శన్ పోశెట్టి టీచర్ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు




19, ఫిబ్రవరి 2024, సోమవారం

ఆంజనేయుడికి సింధూరం ఎందుకు ప్రీతి

 సింధూరం ఆంజనేయుడికి ప్రతిపాత్రం కావడం వెనుక రామాయణ గాథలు ఒక ఘట్టాన్ని కారణంగా చెబుతారు రామ రావణ సంగ్రామం జరిగే సమయంలో ఒక సందర్భంలో శ్రీరాముడు ఆంజనేయుడు భుజాలపై ఎక్కి యుద్ధం చేశాడు ఆ సమయంలో రావణుడు విసిరిన బాణాలు తరచుగా ఆంజనేయుడికి తగిలాయి హనుమా శరీరమంతా రక్తసిక్తమైంది అయినా ఏమాత్రం చెల్లించకుండా దృఢదీక్షతో నిలబడతాడు రాంబంటు రక్తంతో తడిసి ముద్దయిన హనుమదేహం పూచిన మోదుగ చెట్టు వలె ఉందని వాల్మీకి మహర్షి వర్ణించారు ఆనాటి సన్నివేశం హనుమకు ఎంతో ఆనందాన్ని సంతృప్తిని కలిగించింది ఆంజనేయుడికి స్వామికార్యం తప్ప స్వకార్యం లేదు కదా అందుకే ఈనాటికి తిరుమల బ్రహ్మోత్సవాలు సహా అన్ని వైష్ణవాల ఉత్సవాలు విష్ణుమూర్తికి హనుమత్ వాహనం ఏర్పాటు చేసే సంప్రదాయం కనిపిస్తుంది ఇక అర్చనలో భాగంగా ఆంజనేయుడికి ఎర్రని సింధూరం ఆనాడు రామయ్య కోసం శరీరం రక్తసిక్తమైన వేళ తను పొందిన ఆనందం తలుపులు మెదిలి హనుమాన్ ఆనందిస్తాడట వెంటనే భక్తుల పట్ల ప్రసన్నుడు అవుతాడని పెద్దల మాట ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సింధూరం పూసి ఆచారం లోకంలో ప్రచారం అయింది అంతేకాదు ఎర్రని రంగు పరాక్రమానికి పవిత్రతకు త్యాగానికి సంకేతం ఈ గుణాల సమ్మేళన మీ హనుమంతుడు కాబట్టి హనుమత్ అర్చనలు సింధూర పూజా ప్రత్యేకమైనదిగా నిలిచింది



18, ఫిబ్రవరి 2024, ఆదివారం

సలాబత్పూర్ ఆలయంలో భక్తుల సందడి

 



మద్నూర్ మండలంలోని మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న సలాబత్పూర్ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి తెల్లవారుజామునంచే భక్తులు తరలివచ్చారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు సత్యనారాయణ వ్రతాలను చేశారు మహారాష్ట్ర నుంచి భక్తులు కాలినడకన వచ్చే ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రతి శనివారం ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం మానవాహిక వస్తుంది. అదేవిధంగా మూడు రాష్ట్రాల నుంచి భక్తి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో పిక్కిరిసిపోయింది భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు



17, ఫిబ్రవరి 2024, శనివారం

రామాలయ హనుమాన్ ఆలయాలకు ఐదున్నర లక్షల విరాళం

 రెంజల్ మండలంలోని బాగేపల్లి గ్రామంలో రామాలయ హనుమాన్ మందిరాల అభివృద్ధి కోసం అదే గ్రామానికి చెందిన ఆగంటి సాయిబాబా గౌడ్ 55,55 రూపాయలను శుక్రవారం విరాళంగా అందజేశారు నిర్వాహకులకు నగదును ముక్త చెప్పారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పాముల సాయిలు మాట్లాడుతూ పెద్ద మనసుతో గ్రామంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించిన సాయిబాబా గౌడ్ కు గ్రామస్తుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ సేవా భావాన్ని అలవర్చుకోవాలని సూచించారు అందజేసిన వారిలో ఎంపీడీవో శంకర్ నాయక్ గ్రామ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్ కార్యదర్శి జే శ్రీకాంత్ గ్రామస్తులు ఉన్నార



12, ఫిబ్రవరి 2024, సోమవారం

రేపు ఆలయ షాపింగ్ కాంప్లెక్స్లకు వేలం

 


మాచారెడ్డి మండలంలోని గజ్జియా నాయక తండా ఎక్స్ రోడ్డు గ్రామంలోని వీర హనుమాన్ ఆలయ ఆవరణలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లకు ఈనెల 14న ఆలయ ఆవరణలో వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జి ఈవో ప్రభురాం చంద్రం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు 20 షాపింగ్ కాంప్లెక్స్లకు గాను 18 షాపింగ్ కాంప్లెక్స్ లకు దేవాదాయశాఖ అధికారుల ఆధ్వర్యంలో వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేలంలో పాల్గొనేవారు పదివేల రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు ఆసక్తి ఉన్నవారు పూర్తి వివరాలకు ఆలయంలోని కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు