గణపతి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
గణపతి ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

దగడు సేటు వినాయకుడి కి ద్రాక్ష మహోత్సవం

 



హోలీ సంబరాల వేళ మహారాష్ట్రలో విఘ్నేశ్వరాలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు పూణేలో కొలువైన దగడు సేట్ వినాయక ఆలయాన్ని రంగురంగుల ద్రాక్ష పండ్లతో ముస్తాబు చేశారు ఇందుకోసం దాదాపు 2000 కిలోల ద్రాక్ష పనులను వినియోగించారు ఆలయ ప్రాంగణాన్ని నలుపు ఆకుపచ్చ ద్రాక్షలతో సుందరంగా తీర్చిదిద్దారు సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవము వేడుకగా జరుపుకోవాలని ఇక్కడ ఆనవాయితీ సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో తీర్చిదిద్దిన అద్భుతాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామి వారి వద్ద ఉంచిన ద్రాక్ష పనులను ససూన్ ఆసుపత్రి పితాశ్రీ వృద్ధాశ్రమం తో పాటు పలు సంస్థలకు భక్తులకు పంపిణీ చేస్తారు.



29, ఫిబ్రవరి 2024, గురువారం

శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు

 రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో గల నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు గత మూడు రోజులుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి గురువారం ఈ వేడుకలలో మాజీ స్పీకర్ బాన్సువాడ నియోజకవర్గం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టారు అనంతరం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడవాలని ఆయన సూచించారు భక్తితోనే ముక్తి లభిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బద్దం సంజీవరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాజీ విండో చైర్మన్ పత్తి రాము టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు