తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ
సన్న జాజులూ బంతి పువ్వులూ వెంకటరమణని కొలచినవీ " తెల్లా "
గొల్లలు పిల్లలు తలుపులు తెరువగ కర్పూర హారతి ఇచ్చెనులే
పరిమళాలు పంచామృతములతో చక్కటి స్నానము చేయరే " తెల్లా "
మంగళ హారతి గైకొనుమా మా మానస మంగళ హారతీ
కర్పూర హారతి వెలుగులె నీకు ముత్యాల మంగళ హారతీ " తెల్లా "
వెండి కొండపై నిండు మనసుతో కోయిల నీకై పాడెనులే
త్యాగయ్య గీతిక పదములె నీకూ ముత్యాల మంగళ హారతీ " తెల్లా "
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
హారతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
హారతులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, సెప్టెంబర్ 2018, మంగళవారం
30, ఆగస్టు 2018, గురువారం
హర హర మహదేవా - భజన
హర హర మహదేవా
నీరాజనమిదె గైకొను దేవా హర హర మహ దేవా 2
గంగా జలముల తోనూ దధిక్షీర ఘృతమ్ములతోనూ
అభిషేకములే చేసెదమయ్యా " హర "
బిల్వా పత్రముతోనూ
కాశీ గన్నేరులతోనూ
అర్చనలే నీకు చేసెదమయ్యా " హర "
రంభా ఫలములతోనూ
నెయ్యి పాయసముతోనూ
నైవేద్యములే ఒసగెదమయ్యా
ఆరగించి మము బ్రోవుమయ్యా " హర "
దివి కైలాసములోనా
వెలసిన ఓ మహదేవా
భువిలో నీ దాసులనూ
ఆదరించి దరి చేర్చుకోవా " హర "
నీరాజనమిదె గైకొను దేవా హర హర మహ దేవా 2
గంగా జలముల తోనూ దధిక్షీర ఘృతమ్ములతోనూ
అభిషేకములే చేసెదమయ్యా " హర "
బిల్వా పత్రముతోనూ
కాశీ గన్నేరులతోనూ
అర్చనలే నీకు చేసెదమయ్యా " హర "
రంభా ఫలములతోనూ
నెయ్యి పాయసముతోనూ
నైవేద్యములే ఒసగెదమయ్యా
ఆరగించి మము బ్రోవుమయ్యా " హర "
దివి కైలాసములోనా
వెలసిన ఓ మహదేవా
భువిలో నీ దాసులనూ
ఆదరించి దరి చేర్చుకోవా " హర "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)