విష్ణు ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
విష్ణు ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఫిబ్రవరి 2024, గురువారం

కొనసాగుతున్న అఖండ హరినామ సప్తాహం

 కోటగిరి మండల కేంద్రంలోని విఠలేశ్వరాలయంలో ఈనెల 26న మొదలైన అఖండ హరినామ సప్తహ కార్యక్రమం మార్చి 4న 3 నుండి ఈ సప్తహ కార్యక్రమం గోండిబా మహారాజ్ గంధపు ప్రకాష్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది ఈ సప్తాహ కార్యక్రమం గురువారానికి నాలుగో రోజుకు చేరింది ఈ సప్తహ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు కాకడ హారతి తో మొదలుకొని జ్ఞానేశ్వర్ మహారాజ పారాయణం తుకారం మహారాజ్ గాత భజన హరి పాఠం కీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు రాత్రి 11 గంటల నుండి హరి జాగరణ భజన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికారులకు భక్తులకు కోటగిరి గ్రామానికి చెందిన ఎం శకుంతల అన్న ప్రసాద వితరణ చేశారు కార్యక్రమంలో గాయకులు, జ్ఞానేశ్వర్ తడగూర్ సోపాన్ ముదిలి సాయిబాబా పోతంగల్ నాందేవ్ కిష్టాపూర్ తగిలేపల్లి సాయిలు మోహన్ సేట్ కట్టు నగేష్ సంతోష్ భక్తులు మహిళలు పాల్గొన్నారు



25, ఫిబ్రవరి 2024, ఆదివారం

స్వామి పాదాలపై సూర్యకిరణాలు

 జైనథ్ మండలంలోని అతి ప్రాచీన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకాయి శనివారం వేకువజామున సూర్యకిరణాలు కోనేరు మీదుగా నేరుగా స్వామి వారి పాదాలను తాకాయి దీనితో గర్భగుడిలోని స్వామి వారు సువర్ణ కాంతులతో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా అర్చకులు భక్తులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కాగా మరికొన్ని రోజులపాటు స్వామి వారి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని భక్తులు వేకువజామున వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు



19, ఫిబ్రవరి 2024, సోమవారం

శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో రెండో రోజు కొనసాగుతున్న ఉత్సవాలు

 బాల్కొండ మండలంలోని పాత జలాల్పూర్ గ్రామంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఉత్సవాలు రెండో రోజు ఆదివారం కూడా కొనసాగాయి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలుతో పాటు యజ్ఞం నిర్వహించడం జరిగింది. శనివారం మొదటి రోజు జలాల్పూర్ గ్రామం నుంచి శ్రీ రంగనాథ స్వామి ఆలయం వరకు ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకురావడం జరిగింది. నేడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం శ్రీ రంగనాథ స్వామి ఆలయ రంగంలో సోమవారం అనగా నేడు ధ్వజస్తంభ ప్రతిష్టాపన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ వర్గాలు తెలిపాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు



15, ఫిబ్రవరి 2024, గురువారం

అబుదాబిలో ఆలయ నిర్మాణం సువర్ణ అధ్యాయం

 




యూఏఈ రాజధాని అబుదాబిలో రూపుదిద్దుకున్న హిందూ ఆలయాన్ని ప్రపంచ మానవాళి ఉమ్మడి వారసత్వ విలువలకు నూతన ప్రత్యేకగా ప్రధాని నరేంద్ర మోడీ అభిమానించారు అంతర్జాతీయ స్థాయిలో మతసామరస్యానికి ఐక్యతకు చిహ్నంగా అది విలసిల్లుతుందని ఆశాభావం వెలిబుచ్చారు బొచా సన్ వాసి అక్షర పురుషోత్తం సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన ఈ స్వామినారాయణ్ ఆలయాన్ని బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు సంప్రదాయ పద్ధతిలో లేత గులాబీ రంగు దోమతి కొత్త స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అర్చకులు పురోహితులతో కలిసి పూజారికాలు తదితరులు పాల్గొన్నారు.

దేవత మూర్తులకు హారతులు ఇచ్చారు యూఏఈ మంత్రి షేక్ నహియాన్ బిన్ ముబారక్ అల్ నహియాన్ స్వామి నారాయణ్ సంప్రదాయకులతో పాటు పలు మత సంప్రదాయాలకు చెందిన ఆధ్యాత్మిక పెద్దలు ప్రారంభోత్సవానికి హాజరయ్యారు అనంతరం వేలాదిగా పాల్గొన్న భక్తులను ఉద్దేశించి మోడీ మాట్లాడారు ఈ ఆలయ నిర్మాణం ద్వారా మానవ చరిత్రలోనే సువర్ణ అధ్యాయానికి యూఏఈ తెరతీసింది 140 కోట్ల మంది భారతీయుల మాది గెలుచుకుంది అంటూ కొనియాడారు భారతీయ ఆకాంక్షలను సాకారం చేసినందుకు యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ కృతజ్ఞతలు తెలిపారు ఆలయ నిర్మాణానికి ఆయన అందించిన అండదండలు మరవలేనివని ప్రశంసించారు ఆలయంలో అడుగడుగునా మతవైవిద్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అనగానే గుర్తొచ్చే బుర్జ్ ఖలీఫా షేక్ జాయిద్ మసీదులకు ఇకపై స్వామినారాయణ్ ఆలయం కూడా తోడు అవుతుంది. దీని సందర్శనకు మునుమందు భారీగా భక్తులు తరలివస్తారు. అని ఆశా భావం వెలిబుచ్చారు భవ్య రామ మందిరం ప్రారంభించుకున్నామంటూ గుర్తు చేసుకున్నారు ఆ వెంటనే అబుదాబిలోనూ ఆలయాన్ని ప్రారంభించే అదృష్టం తనకు దక్కిందన్నారు ఇది భారత్ తో పాటు దేశ మత విశ్వాసానికి సంస్కృతి కూడా అమృతకాలం అని అన్నారు అంతకుముందు ఆలయ నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరినీ మోడీ కలిసి కృతజ్ఞతలు తెలిపారు రాతిపై వాసుదేక కుటుంబం అంటూ స్వయంగా చెక్కారు ఆలయ నిర్మాణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు





14, ఫిబ్రవరి 2024, బుధవారం

అరబ్బుల రాజధానిలో అబ్బురాల ఆలయం

 యునైటెడ్ అరబ్ యూనిట్స్ లో హిందూ ఆలయం కొన్నాళ్ల క్రితం దాకా అసాధ్యమైన ఊహగా తోచిన ఆ ఆలోచన ఎప్పుడు సహకారమైంది యూఏఈ రాజధాని అబూ దాబిలో ఏకంగా 27 ఎకరాల్లో సువిశాలమైన ఆలయం సర్వాంగ సుందరంగా రూపొందింది బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఆరంభానికి సిద్ధమైంది అదే బోచ సన్వాసి శ్రీ అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ్ సంస్థ మందిరం. యూఏఈ లోనే గాక మొత్తం మధ్య ప్రాంతంలోనే పూర్తి హిందూ సంప్రదాయ రైతులు నిర్మితమైన తొలిరాత్రి ఆలయం ఇది. భారత్తో యూఏఈ పటిష్ట బంధానికే గాక ఆ దేశ మతసామరస్యానికి కూడా ప్రతీకగా ఈ మందిరం అలరాలనుంది విశేషాలు ఎన్నో బాప్స్ ఆలయం ప్రత్యేకతలు అన్ని ఇన్ని దాదాపు 30 లక్షల దాకా భారతీయులు ఆలయాలు లేకపోలేదు దుబాయిలో ఇప్పటికే రెండు హిందూ దేవాలయాలు ఒక సిక్కు గురుద్వారా ఉన్నాయి అయితే అవి చూసేందుకు వెళ్లాల మాదిరిగా ఉంటాయి యూఏఈ మొత్తంలో పూర్తి హిందూ శైలిలో రూపొందిన తొలి ఆలయం బాప్స్ మందిరమే ఇది దుబాయ్ అబుదాబి హైవే సమీపంలో 27 ఎకరాల్లో నిర్మితమైంది దీని నిర్మాణానికి 700 700 కోట్ల రూపాయలు ఖర్చయింది మొత్తం నిర్మాణం బాప్సన్నల్లో జరిగింది 108 అడుగుల ఎత్తు 262 అడుగుల పొడవు 180 అడుగుల వెడల్పుతో మొత్తం 55 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఆలయం రూపుదిద్దుకుంది దీని నిర్మాణానికి దాదాపు మూడున్నర ఏళ్లు పట్టింది రాజస్థాన్ గుజరాత్ కు చెందిన 200 మందికి పైగా కార్మికులు నిపుణులు మూడేళ్ల పాటు శ్రమించి 42 తెల్లని పాలరాతి స్తంభాలను చెక్కారు ఆలయ నిర్మాణంలో స్టీల్ కాంక్రీట్ సిమెంట్ ఏమాత్రం వాడలేదు అయోధ్య రామాలయం మాదిరిగానే అత్యాశనిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో రాళ్ల వరుసలను నేర్పుగా పరస్పరం కలుపుతూ పోయారు ఆలయం నిర్మాణం లో ఉపయోగించిన పాలరాతి తదితరాలను పూర్తిగా రాజస్థాన్లోని భరత్పూర్ నుంచి శిల్పాలను బిల్వారా నుంచి తెప్పించారు లోపల నిర్మాణాల్లో ఇటాలియన్ మార్బుల్ వాడారు మందిర పునాదులు 100కు పైగా సెన్సార్లను కూడా ఏర్పాటు చేయడం విశేషం టూ కంపాలతో పాటు ఉష్ణోగ్రత ఒత్తిళ్లు తదితరాల్లో మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పట్టిస్తాయి వీటిని మొత్తం 25 వేల పైచిలుకు విడిభాగాలుగా భారత్ లో నిపుణులైన పని వాళ్ళతో తయారు చేయించి యూఏఈ లో జోడించడం విశేషం ఆలయ కాంప్లెక్స్ లో ప్రార్థన మందిరం సందర్శకులకు కేంద్రం తిమ్మాటిక్ గార్డెన్లు గ్రంథాలయం గ్యాలరీ ఎగ్జిబిషన్ సెంటర్లు ఏకంగా 5000 మంది పట్టే రెండు కమ్యూనిటీ హాళ్లతో పాటు ప్రత్యేకించి పిల్లల కోసం ఆటస్థలం కూడా ఉన్నాయి మందిర ప్రారంభోత్సవంలో పాల్గొనాలనుకునే వారికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ప్రారంభించారు సోమవారం ఆలయంలో యజ్ఞం నిర్వహించారు





ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఆలయంలోని ఏడు గోపురాలను యూఏఈ లోని ఏడు ఎమిరేట్లకు ప్రత్యేకగా తీర్చిదిద్దడం మరో విశేషం రామాయణ ఇతివృత్తాలను ఆలయ గోడలపై అందంగా చెక్కారు ఆలయం బయట గోడలపై ప్రపంచ ప్రసిద్ధ నాగరికతలన్నింటినీ చక్కగా చెప్పారు తద్వారా ఈ ఆలయాన్ని మతసామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దారు భక్తుల బస తదితరాలకు ఆలయ సమీపంలో భవనం కూడా ఏర్పాటయింది దీన్ని అరేబియన్ ఇస్లామిక్ వాస్తరీతులు నిర్మించడం విశేషం

ఇలా పురుడు పోసుకుంది 2014లో మోడీ తొలిసారి ప్రధాని పదవి చేపట్టిన కొద్ది కాలానికి ఈ హిందూ ఆలయ నిర్మాణానికి బీజం పడింది 2017లో మోడీ యూఏఈ పర్యటన అనంతరం వేగం పుంజుకుంది 1981 తర్వాత అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధాని మోడీ ఇప్పటిదాకా యూఏఈ లో ఆరుసార్లు పర్యటించారాయన తాజాగా ఏడో పర్యటనలో ఉన్నారు. 2017 పర్యటన సందర్భంగా యూఏఈ యువరాజుగా ఉన్న షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహీంతో పలు అంశాలపై మోడీ లోతుగా చర్చలు జరిపారు ఆ వెంటనే ఆలయ నిర్మాణానికి యూఏఈ సర్కారు నిర్ణయం తీసుకోవడమే గాక 13 1/2 ఎకరాల భూమి కూడా కేటాయించింది అనంతరం 2019లో మతసహన ఏడాది ఉత్సవాల సందర్భంగా ఈ ఆలయానికి మరో పదమూడున్నర ఎకరాలు ప్రకటించింది అలా ఆలయానికి 27 ఎకరాల భూమి సమకూరింది 2018లో మోడీ తన రెండో యూఏఈ పర్యటన సందర్భంగా బాక్స్ హిందూ ఆలయ నిర్మాణానికి దుబాయ్ ఒపేరా హౌస్ నుంచి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు