శ్రీ సరస్వతీ దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ సరస్వతీ దేవాలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మార్చి 2024, శుక్రవారం

ఆది శంకరాచార్యులు అక్షరాభ్యాసం చేసింది ఇక్కడే

 




బడికి వెళ్లబోయే పిల్లలకు ముందుగా సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం చేయడం తెలిసింది కానీ ఈ ఆవనం కోడ్ సరస్వతి దేవి ఆలయంలో పిల్లలతో పాటు ఉన్నత విద్యావంతుడు పెద్దపెద్ద అధికారులు సైతం అక్షరాభ్యాసం చేయించుకోవడం విశేషం పరుశురాముడు నిర్మించిన ఈ ఆలయంలోనే జగద్గురు ఆదిశంకరాచార్యులకు అక్షరాభ్యాసం జరిగిందని ప్రతిదీ

అద్వైత వేదాంత సృష్టికర్త అయిన జగద్గురు ఆదిశంకరాచార్యులకు చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో అక్షరాభ్యాసం జరగలేదంట కొన్నాళ్లకు శంకరాచార్యులు తల్లి ఈ ఆలయానికి తీసుకొచ్చే అమ్మవారి సమక్షంలోనే అక్షరాభ్యాసం చేయించిందని ఐతెహ్యం అలా వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ యవ్వనం కోడ్ సరస్వతి దేవాలయం కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి దగ్గరగా ఉంటుంది ఇక్కడ అక్షరాభ్యాసాన్ని చేయించుకునే వారికి చదువుతోపాటు వాక్కును అందించే శక్తి స్వరూపిణిగా సరస్వతి దేవి పూజలు అందుకుంటుంది ఈ ఆలయంలో అమ్మవారితో పాటు జ్ఞానాన్ని ప్రసాదించే దక్షిణామూర్తిని ఆటంకాలను తొలగించి విజయాలను అందించే వినాయకుడిని దర్శించుకోవచ్చు.

స్థల పురాణము.. ఒకప్పుడు ఈ ఊరివాళ్లు గడ్డి కోసేందుకు వెళ్లినప్పుడు ఒక రాయికి కొడవలి తగిలి నెత్తురోడిందట సరిగ్గా అప్పుడే పరశురాముడు అక్కడికి వచ్చి ఆశిలలో సరస్వతి దేవి ఉందని గ్రహించి ఆ శిలనే ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించాడని కథనం అలా పరశురాముడు నిర్మించిన 108 దుర్గాలయాలలో అవనం కోడ్ సరస్వతి దేవి సన్నిధానం కూడా ఒకటి

అక్షరాభ్యాసం రెండు రకాలుగా..

ఈ ఆలయంలో విద్యారంభం విద్యా వాగేశ్వరి పేరుతో రెండు రకాల అక్షరాభ్యాసాలు చేస్తారు చదువును మొదలుపెట్టే పిల్లలకు విద్యారంభాన్ని నిర్వహిస్తే ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు విద్యావాహిస్వరి పూజను చేయించుకుంటారు ఒక్క విజయదశమి గ్రంథ పూజగా పిలిచే ప్రత్యేక పర్వదినాలలో తప్ప ఏడాది మొత్తం ఉదయం పూట అక్షరాభ్యాసాలు చేయించుకోవచ్చు ఇక్కడ ఆ ప్రక్రియ కూడా కాస్త ప్రత్యేకంగానే ఉంటుంది ఆలయంలోని ప్రధానార్చకుడు అమ్మ వారిని పూజించిన బియ్యాన్ని తీసుకొచ్చి అందులో ఓం హరి శ్రీ గణపతియే నమః అని పిల్లల చేత రాయిస్తాడు. తర్వాత అదే నామాన్ని వాళ్ళ నాలుక పైన రాస్తాడు ఆ ప్రక్రియ పూర్తయ్యాక బియ్యాన్ని పిల్లలకే ఇచ్చేసి అమ్మవారిని అభిషేకించిన నెయ్యిని ప్రసాదంగా ఇస్తారు అక్షరాభ్యాసం చేయించాలి అనుకునేవారు మనీ నరయంగా పిలిచే నాలుక గంట కలం ఆకారాలను దేనికి సకానుకగా సమర్పించడం కనిపిస్తుంది దాని వలన పిల్లలలో వాక్కు వినికిడి శక్తి పెరిగి విద్య వస్తుందని భక్తుల నమ్మకం ఇక విద్యా వాగేశ్వరి పేరుతో నిర్వహించే పూజలు చేయించుకునేందుకు పండితులు రీసర్చ్ స్కాలర్లు పెద్దపెద్ద అధికారులు ఉన్నత విద్య కోసం పోటీ పరీక్షలు రాసేవారు ఆసక్తి చూపిస్తారు ఆ పూజ వల్ల అజ్ఞాన సమపారచనతోపాటు చదువులలో ఏకాగ్రతకుదురుతుందని ఉద్యోగాలలో పదోన్నతి లభిస్తుందని అంటారు ఆలయానికి వచ్చే భక్తులు ఈ ప్రాంగణంలోని ఇసుకలోను అక్షరాలను రాయడానికి చూడవచ్చు

పాస్పోర్ట్ సన్నిధానంగాను..

అవనం కోడ్ సరస్వతి దేవి ఆలయం కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా నడుం బస్సెరీలో ఉంటుంది ఉన్నత విద్యా లేదా ఉద్యోగాల నిమిత్తము విదేశాలకు వెళ్లేవారు ముందుగా అమ్మవారి సమక్షంలో పాస్పోర్టులను ఉంచి పూజిస్తే ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగడంతో పాటు విజయాలు సొంతమవుతాయని ఉద్దేశంతోనే విమానం ఎక్కే ముందు ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని పాస్పోర్టులకు పూజలు చేయిస్తారు అందుకే ఈ సన్నిధానానికి పాస్పోర్ట్ ఆలయం అని పేరు ఉంది అదే విధంగా కళాకారులు రచయితలు, సైతం తమ పుస్తకాలను సంగీత వాయిద్యాలను అమ్మవారి సమక్షంలో ఉంచి పూజలు చేయిస్తూనే తమకు వచ్చిన విద్యను ఇక్కడ ప్రదర్శించేందుకు ప్రాధాన్యమిస్తారు ఇక స్వయంభూవుగా సాక్షాత్కరించిన అమ్మవారు ఈ ఆలయంలో పడమర వైపు దర్శనమిస్తుంది అమ్మవారితో పాటు దక్షిణామూర్తిని వినాయకుడిని దర్శించుకోవచ్చు సరస్వతి దేవికి ఈరోజు వారే చేసే పూజలతో పాటు ఏడాదికోసారి మార్చి నెలలో పురం పేరుతో పది రోజులపాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలను జరిపిస్తారు


29, ఫిబ్రవరి 2024, గురువారం

అమ్మవారి సేవలు

 నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని ఆర్ అండ్ బి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ దర్శించుకున్నారు వీరికి ముందుగా స్థానిక మాజీ సర్పంచ్ డి లక్ష్మణరావు ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక అభిషేక పూజ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారి మోహన్ నాయక్ పూజ సేవా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు వీరి కాలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదం అందజేసి ఆశీర్వదించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి క్షేత్ర పర్యటనలో భాగంగా గ్రామంలోని బొర్రా గణేశా ఆలయం నుండి మహాలక్ష్మి ఆలయం శ్రీ పాప హరేశ్వర ఆలయం శ్రీ దత్తాత్రేయ ఆలయం నుండి సరస్వతి అమ్మవారి ఆలయం వరకు బైపాస్ సీసీ రోడ్డు రహదారి కొరకై ప్రత్యేకంగా ఆరు కోట్ల రూపాయల నిధులతో పనులు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు ఈ పనులు పూర్తయితే బాసర మండల కేంద్రానికి వచ్చే గ్రామాల ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని తెలిపారు



15, ఫిబ్రవరి 2024, గురువారం

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న ఎస్పీ

 బాసరలో వసంతం పంచమిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల బుధవారం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం బందోబస్తును పర్యవేక్షించారు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు సిబ్బందికి పలు సూచనలు చేశారు భక్తుల దర్శనం ప్రశాంతంగా జరుగుతోందని ఎక్కడెక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ ముధోల్ సిఐ మల్లేష్ బాసర ఎస్సై పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు



ఘనంగా వసంత పంచమి వేడుకలు

 కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని నిలిచిపూరు సరస్వతి ఆలయంలో బుధవారం వసంత పంచమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేపట్టి భక్తులకు ప్రసాదం అన్న ప్రసాద వితరణ చేపట్టారు బాన్సువాడ పట్టణంలోని శ్రీ విద్యా జ్ఞాన సరస్వతి దేవి ఆలయంలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఉదయం నుంచి అర్చకులు సంతోష్ శర్మ విజయ్ శర్మ అమ్మవారికి సుప్రభాత సేవ అభిషేకం అర్చనలు చేపట్టారు భక్తులు సమర్పించిన నూతన వస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి దంపతులు ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం పల్లకి సేవ నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు చేసిన శ్రీ మాత్రే నమః అని నామస్మరణతో పట్టణమంత మారుమోగిపోయింది ఆలయ ప్రాంగణంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో వినోద్ రెడ్డి ప్రమోద్ రెడ్డి అరుణ్ రెడ్డి బసంత్ మహిళలు భక్తులు తదితరులున్నారు బిబిపేట మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పాఠశాలలో బసంత పంచమి వేడుకలను పురస్కరించుకొని సరస్వతి దేవాలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు పాఠశాలలో సరస్వతి దేవి పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్లోకాలు పాటించారు కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు 

ఇకనూరు మండలంలోని ఆయా గ్రామాల్లో అంగన్వాడి సెంటర్లు ప్రైవేటు పాఠశాలలో బుధవారం వసంత పంచంగం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ సెంటర్లు ఆయా పాఠశాలలు సరస్వతీ దేవి చిత్రపటానికి అర్చకులు ఉపాధ్యాయులు ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం అంగన్వాడి సెంటర్లు ఆయా పాఠశాలల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు ఈ మేరకు ప్రైవేటు పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి లింగంపేట మండల కేంద్రంలోని సరస్వతి శిశు మందిరంలో బుధవారం ఘనంగా వసంత పంచ వేడుకలు జరుపుకున్నాడు సరస్వతీ దేవికి ప్రత్యేక పూజలు చేశారు కొత్తగా 100 మంది విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి అధ్యక్షుడు కొత్త దుర్గయ్య పాఠశాల ప్రబంధ గారిని ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ కోశాధికారి చందు రాజ్ కుమార్లతో పాటు ఉపాధ్యాయులు ఉన్నారు

నెమలి సాయిబాబా ఆలయంలో బుధవారం వసంత పంచమి సందర్భంగా భక్తులు సాయి ఆలయాన్ని చేరుకుని సాయిబాబాను దర్శించుకున్న అనంతరం భక్తులు వసంత పంచమి పురస్కరించుకొని చిన్నారులతో అక్షరాభ్యాసాన్ని చేయించారు సాయి ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు






భక్తజన బాసర.. వసంత పంచమి

 



వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం బుధవారం భక్తజనసంద్రంగా మారింది పిల్లలకు అక్షరాభ్యాస పూజలు చేయించేందుకు రాష్ట్రం తో పాటు మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు అదిలాబాద్ ఎంపీ స్వయం బాబురావు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ఎమ్మెల్సీ దండ విటల్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు





ఘనంగా వసంత పంచమి

 వసంత పంచమి సందర్భంగా బుధవారం పాఠశాలలో విద్యార్థులు సరస్వతి దేవి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు ఆలయాల్లో పూజారులు చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు సరస్వతి దేవి ఆలయాల్లో సామూహిక కుంకుమార్చనలు జరిగాయి





14, ఫిబ్రవరి 2024, బుధవారం

సరస్వతీ మాత భక్తులకు స్నాక్స్ అందజేత

 వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని కాలినడకన బాసరకు వెళుతున్న సరస్వతి మాత భక్తులకు పోతంగల్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు శేఖర్ సెట్ మంగళవారం స్నాక్స్ వాటర్ బాటిల్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర బాసర టెంపుల్ వరకు సుమారు 70 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుందన్నారు ఈ పాదయాత్రలో సుమారు 68 మంది సరస్వతి మాత భక్తులు పాల్గొన్నట్లయితే తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో భీమ్సేట్ భక్తులు తదితరులు పాల్గొన్నారు



భక్తులకు పండ్లు వాటర్ పంపిణీ

 బాన్స్వాడ నుండి బాసరకు కాలినడకన వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు థర్డ్ బిలోలిలో పండ్లు వాటర్ బాటిల్ ని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అష్టం శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో భక్తులకు వాటర్ సౌకర్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల సాయి రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా తదితరులు పాల్గొన్నార



బాన్సువాడ నుంచి బాసరకు భక్తుల పాదయాత్ర

 


బాన్సువాడ నుండి ప్రారంభమైన భక్తుల పాదయాత్ర మంగళవారం బోర్గం మీదుగా బాసరకు చేరుకుంది వసంత పంచమే వేడుకలను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఏటా బాసరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారింది ఈ సందర్భంగా మార్గమధ్యంలో బూర్గం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వసంత పంచమి వేడుకల సందర్భంగా 1993 నుండి కాలినడకన బాసర పీఠాధిపతిని చేరుకుంటామన్నారు వసంత పంచమికి 46 ఒక్కరోజు ముందు భక్తులు మండల దీక్షలు నిర్వహిస్తారు వేడుకలకు రెండు రోజుల ముందు బాన్స్వాడ నుండి కాలినడకన బాసర వరకు భక్తులు పాదయాత్ర చేపడతారు నెమ్లి సాయిబాబా మందిరం బోధన్ రెడ్డి తదితర ప్రాంతాలలో బిక్షలు ఏర్పాటు చేసుకుంటారు బాసర సరస్వతి మాత ఆలయానికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు


గౌహతిలో వసంత పంచమి

 బుధవారం వసంత పంచమి వేడుకల సందర్భంగా గౌహతిలో పూజకు ముందు సరస్వతి విగ్రహాలకు శిల్పకారులు తుది మెరుగులు దిద్ది సిద్ధం చేశారు


బాసర ఆలయానికి హుండీల అందజేత

 


బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఒడిబియ్యం హుండీలను మంగళవారం కామారెడ్డి జిల్లా ఆరుగొండ గ్రామానికి చెందిన కందాడి నరేందర్ రెడ్డి కీర్తిశేషులు కందాడి జగ్గమ్మ జ్ఞాపకార్థం అందజేశారు వీరి వెంట మమ్మాయి సచిన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు



13, ఫిబ్రవరి 2024, మంగళవారం

నేడు వసంత పంచమి

 ఆలయాల్లో ప్రత్యేక పూజలు మండపాలు పెళ్లిళ్ల సందడి చదువుల తల్లి సరస్వతి దేవి జన్మ తిథి పంచమి పురస్కరించుకొని బుధవారం జిల్లాలు వివాహాలు అక్షరాభ్యాసాలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కోటగల్లి మార్కండేయ మందిరం సరస్వతీ శిశు మందిర్ నెలకుల రోడ్డు లలితాదేవి ఆశ్రమాలయం భవాని నగర్ తుల్జా భవాని తదితర దేవి ఆలయాలు ముస్తాబయ్యాయి వసంత పంచమి విశిష్టత సరస్వతీ దేవిని మాఘ పంచమి రోజు శ్రీ పంచమి పేరిట ఆరాధించడం మహారాధిగా వస్తున్న సంప్రదాయం వసంత పంచమి రోజు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే జ్ఞాన రాశులు అవుతారని ప్రతీతి సరస్వతీమాత ఆరాధన తో వాక్ శుద్ధి జ్ఞానాభివృద్ధి సద్బుద్ధి మేధా సంపద ఆలోచన ప్రతి ధారణ ప్రజ్ఞ దద్దరి శుభాలు కలిగి భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత విద్యలు రాణిస్తారని విశ్వాసం వాగేశ్వరి మహా సరస్వతి సిద్ధ సరస్వతి నీల సరస్వతి ధారణ సరస్వతి బాల సరస్వతి రూపాల్లో సరస్వతి చదువుల తల్లి నీ తెల్లని పూలతో పూజించడంతో సకల విధులు నేర్చుకుంటారని పురాణ ప్రవచనం శుభముహూర్తం తితులలో పంచమి వారాలలో బుధవారం నక్షత్రాలలో రేవతి గృహ వివాహ కార్యాలయకు అత్యంత అనుకూలమైన శుభ ముహూర్తం వసంత పంచమి దీంతో బుధవారం జిల్లాలో వందలాది వివాహాలు జరగనున్నాయి రైల్వే స్టేషన్ బస్టాండ్ కల్యాణ మండపాలు పెండ్లిల్లా సందడితో కిరకిటలాడుతున్నాయి



రేపు వసంత పంచమి వేడుకలు

 హిందూ కాలమానిని ప్రకారం వసంత పంచమి పండుగ సరస్వతి మాత జన్మదినం ప్రతి సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఐదో రోజున జరుపుకుంటారని ప్రముఖ కవి కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కంకణాల రాజేశ్వర్ సోమవారం ఒక ప్రకటనలో మీడియా ద్వారా తెలిపారు ఈ సంవత్సరానికి గాను ఫిబ్రవరి 14న అంటే బుధవారం రోజు వసంత పంచమి ఉదయం పదిన్నర నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు సరస్వతి మాత పూజకు శుభ సమయం గా పండితులు పేర్కొంటున్నారు చదువుల తల్లి అక్షరాల అధిదేవత విద్యార్థి దేవత పుస్తక పాణిని జ్ఞాన వరప్రదాయని అయిన సరస్వతి దేవిని వసంత పంచమి రోజున పూజిస్తే చదువులో వచ్చే ఆటంకాలు తొలగిపోయి జ్ఞాపకశక్తి పెంపొంది తెలివితేటలు వృద్ధి చెందుతాయని హిందూ ధర్మ శాస్త్రం చెబుతుంది వివాహాది శుభకార్యాలకు వసంత పంచమిని తిరుగులేని రోజుగా అభిమానిస్తారు అందుకే ఈ వసంత పంచమి రోజున పిల్లలకు సరస్వతి సన్నిధిలో సరస్వతీ పూజారికాల్లో వేద పండితుల సమక్షంలో అక్షరాభ్యాసం చేయిస్తారు తల్లి సరస్వతి ఆశీస్సుల ద్వారానే ప్రజలు జ్ఞానం వాక్కు కళా జ్ఞానాన్ని పొందుతారు సరస్వతీ దేవి అనుగ్రహం ఉంటే చతుర్ షష్టి కళల్లో విజయం సాధించవచ్చు అని కంకణాల రాజేశ్వర అన్నారు.

బాసరకు పాదయాత్ర

 బాన్సువాడ పట్టణంలోని సరస్వతి దేవి ఆలయం నుంచి బాసర క్షేత్రానికి మాలధారులు భక్తులు అధిక సంఖ్యలో సోమవారం పాదయాత్రగా బయలుదేరారు ఆలయ ధర్మకర్త శంభు రెడ్డి యాత్రను ప్రారంభించారు అంతకుముందు ఆలయంలో అర్చకులు కాశీ సంతోష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు