నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రం అయినటువంటి సద్గురు మాతా సుదీక్షకి మహారాజ్ ఆధ్వర్యంలో సంత నిరంకార్ నిజామాబాద్ బ్రాంచ్ సంయోజకర్ లక్ష్మణ్ నేతృత్వంలో జరిగిన ప్రాజెక్టు అమృత స్వచ్ఛమైన మీరు స్వచ్ఛమైన మనసు అనే కార్యక్రమంలో నిరంకారీ సేవాదాల సభ్యులందరూ పాల్గొని గోదావరి పరివాహక ప్రాంతంలోని గోదావరి నది పుష్కర ఘాట్లతో దశరథ మహారాజ్ ఆశ్రమం పరిసర ప్రాంతాలలోని చెత్తాచెదారాన్ని స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సుమారు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పుష్కర ఘాట్లను చెత్తాచెదారం లేకుండా తొలగించారు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ప్లాస్టిక్ వ్యర్ధాలపై అవగాహన కల్పించారు పవిత్ర గోదావరి నదిని అపవిత్రం చేయకుండా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని సూచించారు.
ఆధ్యాత్మిక విశేషాలు, పూజలు, దేవాలయాలు, సాంప్రదాయాలు తదితర ఆధ్యాత్మిక విషయాల సమాహారం..
26, ఫిబ్రవరి 2024, సోమవారం
23, ఫిబ్రవరి 2024, శుక్రవారం
బాసరలో ఆర్జిత సేవలకు సంప్రదాయ దుస్తులు
బాసర అమ్మవారి ఆలయంలో అచ్యుత సేవలు అభిషేక పూజలు చేసే భక్తులు సంప్రదాయ దుస్తులను ధరించాలని సూచిస్తూ ఆలయ పరిసరాలలో బోర్డులు ఏర్పాటు చేశారు ఆయా పూజలకు పురుషులు ధోవతి పంచే తెల్లటి చుక్క కండువా మహిళా భక్తులు చీర అమ్మాయిలు సంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు మార్చి ఒకటి నుంచి అమలు చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
14, ఫిబ్రవరి 2024, బుధవారం
సరస్వతీ మాత భక్తులకు స్నాక్స్ అందజేత
వసంత పంచమి సందర్భాన్ని పురస్కరించుకొని కాలినడకన బాసరకు వెళుతున్న సరస్వతి మాత భక్తులకు పోతంగల్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బచ్చు శేఖర్ సెట్ మంగళవారం స్నాక్స్ వాటర్ బాటిల్లు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీర్కూరు నుండి మొదలైన ఈ పాదయాత్ర బాసర టెంపుల్ వరకు సుమారు 70 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుందన్నారు ఈ పాదయాత్రలో సుమారు 68 మంది సరస్వతి మాత భక్తులు పాల్గొన్నట్లయితే తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల తన మనసుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని తెలిపారు కార్యక్రమంలో భీమ్సేట్ భక్తులు తదితరులు పాల్గొన్నారు
భక్తులకు పండ్లు వాటర్ పంపిణీ
బాన్స్వాడ నుండి బాసరకు కాలినడకన వస్తున్న భక్తుల దాహార్తిని తీర్చేందుకు థర్డ్ బిలోలిలో పండ్లు వాటర్ బాటిల్ ని పంపిణీ చేశారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు అష్టం శ్రీనివాస్ తన సొంత ఖర్చులతో భక్తులకు వాటర్ సౌకర్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో సొసైటీ మాజీ అధ్యక్షుడు గుజ్జుల సాయి రెడ్డి రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్ మౌలానా తదితరులు పాల్గొన్నార
బాన్సువాడ నుంచి బాసరకు భక్తుల పాదయాత్ర
బాన్సువాడ నుండి ప్రారంభమైన భక్తుల పాదయాత్ర మంగళవారం బోర్గం మీదుగా బాసరకు చేరుకుంది వసంత పంచమే వేడుకలను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఏటా బాసరకు కాలినడకన వెళ్లడం ఆనవాయితీగా మారింది ఈ సందర్భంగా మార్గమధ్యంలో బూర్గం గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వసంత పంచమి వేడుకల సందర్భంగా 1993 నుండి కాలినడకన బాసర పీఠాధిపతిని చేరుకుంటామన్నారు వసంత పంచమికి 46 ఒక్కరోజు ముందు భక్తులు మండల దీక్షలు నిర్వహిస్తారు వేడుకలకు రెండు రోజుల ముందు బాన్స్వాడ నుండి కాలినడకన బాసర వరకు భక్తులు పాదయాత్ర చేపడతారు నెమ్లి సాయిబాబా మందిరం బోధన్ రెడ్డి తదితర ప్రాంతాలలో బిక్షలు ఏర్పాటు చేసుకుంటారు బాసర సరస్వతి మాత ఆలయానికి చేరుకోవడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు ఉన్నారు
బీర్కూర్ నుంచి బాసరకు మహాపాదయాత్ర
వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం బీర్కూరు మండల కేంద్రం నుంచి గురుస్వామి సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాదిమంది భక్తులు మహా పుణ్యక్షేత్రమైన బాసరకు మహాపాదయాత్రను చేపట్టారు బీర్కూరు మండల కేంద్రంలోని గాంధీ చౌక్ లో గల హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పెద్దహవారి గంగారాం జండా ఊపి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏటా వసంత పంచమి సందర్భంగా బీర్కూర్ నుంచి చదువుల తల్లి కొలువుదీరిన బాసర వరకు పాదయాత్ర నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తుందన్నారు గత తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా పాదయాత్ర చేపడుతున్నామని తెలిపారు బుధవారం బాసరలో అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతామన్నారు పాదయాత్రకు తరలి వెళ్లిన వారిలో లింగం బాలకృష్ణ డాక్టర్ బాలకృష్ణ రాజేందర్ రాజు విట్టల్ గోపాల్ గోపి ఆకాష్ కుమార్ సంతోష్ యోగేష్ తదితరులు ఉన్నారు
బాసర ఆలయానికి హుండీల అందజేత
బాసర జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి ఒడిబియ్యం హుండీలను మంగళవారం కామారెడ్డి జిల్లా ఆరుగొండ గ్రామానికి చెందిన కందాడి నరేందర్ రెడ్డి కీర్తిశేషులు కందాడి జగ్గమ్మ జ్ఞాపకార్థం అందజేశారు వీరి వెంట మమ్మాయి సచిన్ ఆలయ అధికారులు పాల్గొన్నారు






