చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, మే 2026, శుక్రవారం

ఘనంగా అష్టోత్తర శతఘటభిషేకం

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజున ఆలయంలో మూలమూర్తికి అష్టోత్తర శతఘటభిషేకం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రోచారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు చేసి మూలమూర్తికి అభిషేకం నిర్వహించారు. 



స్వామి వారి జన్మదిన పురస్కరించుకొని స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఫల పంచామృతాభిషేకం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. బాలయ్య ప్రాంగణంలో 108 అష్టోత్తర శతఘటలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున ఉదయం నుండి ఆలయానికి చేరుకుని క్యూ పద్ధతిలో దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు కార్యక్రమంలో చైర్మన్ కమలాకర్ రెడ్డి పిఓ ప్రభురామచంద్రన్ సిబ్బంది అర్చకులు భక్తులు పాల్గొన్నారు.



27, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి సిరిసిల్ల వాస్తవ్యులు ముత్యంరావు లక్ష్మీ దంపతులు తమ వంతు సహాయంగా ఆలయ ప్రాంగణంలోని నాగుపాము పుట్టపైన రేకుల షెడ్డు నిర్మాణానికి 1,50,000 ఇచ్చుటకు వాగ్దానం చేసి 50 వేల రూపాయలను అడ్వాన్సుగా మంగళవారం ఆలయ అధికారులకు చెల్లించారు ఆలయం తరఫున సన్మానం చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ శనిగరం కమలాకర్ రెడ్డి ఈవో ఆలయ అర్చకులు సిబ్బంది పాల్గొన్నారు


19, ఫిబ్రవరి 2024, సోమవారం

చుక్కాపూర్ లక్ష్మీనరసింహుడికి పూజలు

 మాచారెడ్డి మండలం చుక్కాపూర్ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు ఆదివారం అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు వాహన పూజలు పుట్టు వెంట్రుకలు గండ దీపాల ముడుపులు మొక్కుబడులు చెల్లించుకున్నారు హైదరాబాద్ కు చెందిన కాసుల మధు సరిత స్వామి వారి ఆలయ అభివృద్ధికి ఐదువేల ఒక వంద రూపాయలు విరాళంగా అందజేశారు అర్చకులు పరంధామాచార్యులు సంజీవచార్యులు ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు



11, ఫిబ్రవరి 2024, ఆదివారం

చుక్కాపూర్ లో భక్తుల సందడి

 మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేశారు జిల్లా నలుమూలలతో పాటు ఇతర జిల్లాలనుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఓడి బియ్యం పట్టినామాలు కోరమీసాలు కండ్లు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించారు ఆలయ కమిటీ సిబ్బంది భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేశారు