శ్రీశైల మల్లికార్జున స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీశైల మల్లికార్జున స్వామి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

5, మార్చి 2024, మంగళవారం

శ్రీశైలం మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు

 స్థలం ఇస్తే 200 గదుల భవనం కడతాం అంటున్న టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి గారు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టిటిడి తరఫున సమర్పించడం సంగతి తెలిసిందే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వామి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు నాలుగో రోజైన సోమవారం మయూర వాహనంలో స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం మయూర వాహనంపై శ్రీశైలం పురవీధులలో స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించారు శివ స్వాములతో శ్రీశైలం పోటెత్తింది భక్తుల రద్దీ భారీగా పెరిగింది శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం టిటిడి ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు శ్రీశైలం దేవస్థానం స్థలం కేటాయిస్తే టిటిడి దేవస్థానం తరఫున 200 గదుల భవనం కడతామని ప్రకటించారు క్షేత్రంలో టీటీడీ సత్రం పాత పడడంతో వాటిని ఆధునికరిస్తామని చెప్పారు

28, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీశైలంలో అమెరికా భక్తుడు భూరి విరాళం

 శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఒక భక్తుడు మంగళవారం బూరి విరాళం సమర్పించారు తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్ దత్ బంగారు వెండి సామాగ్రి ఆభరణాలను ఆలయానికి అందజేశారు 28.3 గ్రాములు ఉన్న రెండు బంగారు బాషకాలు ఐదు గ్రాముల బంగారు కంకణం ఒకటి. రెండు ఐదు కిలోల వెండి పళ్ళెం 865 గ్రాముల వెండి శక్తి ఆయుధము 550 గ్రాముల వెండి నాగ హారతి 20090 గ్రాముల కుక్కుట ధ్వజము 750 గ్రాముల 5 వెండి గిన్నెలు 920 గ్రాముల గంధక్షత గిన్ని ఒక వంద 90 గ్రాముల కమండలాన్ని 300 గ్రాముల పెద్దక మండలాన్ని కొత్తపల్లి సునీల్ దత్ గారు కుటుంబం అందజేసింది నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూరి సింధూర కూడా 810 మరియు 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్ళాలు 615 గ్రాములున్న మూడు వెండి చెంబులను ఆలయానికి అందజేశారు అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేష వస్త్రము ప్రసాదము అందజేసి సత్కరించారు రెండు రోజుల క్రితం చెన్నైకి చెందిన భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.