సరస్సునైదు శిరస్సులున్న చేప ఉన్నదీ
సరసమైన మంచి మడుగు దానికున్నదీ
మర్మమెరిగియున్నదీ మాటలాడుచున్నదీ
మనసారా జలమునందు ఈదుచున్నదీ " సరస్సునైదు "
ఏరు కాదు దీనికెన్నొ దారులున్నవీ
దారులున్న తీరు నీరు పారుతున్నదీ
గమ్మతైన ద్వారమ్ములు తొమ్మిదున్నవీ
నమ్మరాదు నమ్మరాదు మోసమున్నదీ " సరస్సునైదు "
అలలు ఆరు జలమునంత ఊపుచున్నవీ
జలమునంత కలుషితంబు చేయుచున్నవీ
కలవరపడి చేప దిగులు చెందుతున్నదీ
కొలను వీడి పోవాలని ఆశ ఉన్నదీ " సరస్సునైదు "
మోసకారి చిత్రమైన మొసలి యున్నదీ
చేపతోటి తాను చెలిమి చేయుచున్నదీ
దిక్కు లేని దిశకు దీన్ని తింపుతున్నదీ
అదను చూచి మింగాలని ఆశ ఉన్నదీ " సరస్సునైదు "
చేప కొరకు జాలరి వల వేసి ఉన్నదీ
వలకు చిక్కరాదని గురువాజ్ఞ ఉన్నదీ
కొలనులోని చేపకేమి తోచకున్నదీ
కవి రాముని హృదయము దిగులొందుచున్నదీ " సరస్సునైదు "
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
జనరల్ భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జనరల్ భజనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
3, అక్టోబర్ 2018, బుధవారం
30, సెప్టెంబర్ 2018, ఆదివారం
నమ్మబోకే ఓ జీవా ఇది అంతా మాయా బొమ్మలాటా - భజన
నమ్మబోకే ఓ జీవా ఇది అంతా మాయా బొమ్మలాటా 2
కొన్ని దినములకొరకూ నీకెందుకింత ఉరుకులాటా " నమ్మ "
కొత్త వస్త్రమైతెనేమీ పాత వస్త్రమైతెనేమీ
కట్టు భ్రమ తీరే దాకా ఇది కర్మ భోగ ఫలమంటా " నమ్మ "
తల్లి దండ్రులంతావూ ఇల్లూ వాకిలంటావూ
తల్లి రాదు ఇల్లు రాదూ నీవు తరలిపోయే నాడు వెంటా " నమ్మ "
అన్నదమ్ములంటావూ అక్కా చెల్లెళ్ళంటావూ
అన్న రాడు అక్కా రాదూ నీవు వెడలిపోయే నాడు వెంటా " నమ్మ "
కొడుకులున్నా బిడ్డలున్నా కోటి సంపద కలిగి యున్నా
కంటికి కన్నీరే కానీ ఎవరూ రారు నీ వెంటా " నమ్మ "
కొన్ని దినములకొరకూ నీకెందుకింత ఉరుకులాటా " నమ్మ "
కొత్త వస్త్రమైతెనేమీ పాత వస్త్రమైతెనేమీ
కట్టు భ్రమ తీరే దాకా ఇది కర్మ భోగ ఫలమంటా " నమ్మ "
తల్లి దండ్రులంతావూ ఇల్లూ వాకిలంటావూ
తల్లి రాదు ఇల్లు రాదూ నీవు తరలిపోయే నాడు వెంటా " నమ్మ "
అన్నదమ్ములంటావూ అక్కా చెల్లెళ్ళంటావూ
అన్న రాడు అక్కా రాదూ నీవు వెడలిపోయే నాడు వెంటా " నమ్మ "
కొడుకులున్నా బిడ్డలున్నా కోటి సంపద కలిగి యున్నా
కంటికి కన్నీరే కానీ ఎవరూ రారు నీ వెంటా " నమ్మ "
15, సెప్టెంబర్ 2018, శనివారం
ఏమేమౌనో ఏమెరుక - భజన
ఏమేమౌనో ఏమెరుక
ఎటు పోతుందో ఈ నౌక
కావాలన్నది జరిగేనా
కాగలనున్నది ఆగేనా
ఏ ఈతి బాధలు ఎదురైనా
జీవన పయనం ఆగేనా " ఏమేమౌనో "
గమనం చేసే ఈ నౌక
గమ్యం ఏదొ ఏమెరుక
ఇతరుల జూచి ఏడ్చేము
అతుకుల బ్రతుకును గడిపేము
ఇహ సౌఖ్యముకే మురిసేము
వెతలెదురైతే వగచేము " ఏమేమౌనో "
ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడూ
ఊహలు చెదిరిన రాముడితో ఆహా శివలీలన్నాడు " ఏమే "
ఎటు పోతుందో ఈ నౌక
కావాలన్నది జరిగేనా
కాగలనున్నది ఆగేనా
ఏ ఈతి బాధలు ఎదురైనా
జీవన పయనం ఆగేనా " ఏమేమౌనో "
గమనం చేసే ఈ నౌక
గమ్యం ఏదొ ఏమెరుక
ఇతరుల జూచి ఏడ్చేము
అతుకుల బ్రతుకును గడిపేము
ఇహ సౌఖ్యముకే మురిసేము
వెతలెదురైతే వగచేము " ఏమేమౌనో "
ఊహలకందని వాడొకడు ఉన్నాడా జగదీశ్వరుడూ
ఊహలు చెదిరిన రాముడితో ఆహా శివలీలన్నాడు " ఏమే "
11, సెప్టెంబర్ 2018, మంగళవారం
నాటినావు పూదోటను నీవే - భజన
నాటినావు పూదోటను నీవే
తోటలోన ప్రతి చోటను నీవే 2
మొక్కలు కొన్ని వృక్షములాయె
వాడిన తీగలు మోడులు ఆయె
నీటితోనె ఈ తోట పెరుగగా
తోటమాలి ఈ లోటు ఎరుగడా " నాటినావు "
పూలూ కాయలు ఊయలలూగే
గాలికి పూలు నేలకు రాలే 2
పూలు రాల పూ బాలలు నవ్వే 2
కాలగతిని వనమాలి తెలియడా " నాటినావు "
పూవులు కొన్నీ పూజలకేగే
ప్రాప్తము లేనివీ పాడైపోయే 2
ఋణము దీరెనా ఏ జీవికైనా 2
తనువులు వదిలి తరలిపోవునులే " నాటినావు "
చంద్రధరుని సేవించేటి
రామచంద్రుడు శ్రీ గురువాయే
వాడిన తీగై వనములనుండే
నీడ జూసి కాపాడగ రావే " నాటినావు "
తోటలోన ప్రతి చోటను నీవే 2
మొక్కలు కొన్ని వృక్షములాయె
వాడిన తీగలు మోడులు ఆయె
నీటితోనె ఈ తోట పెరుగగా
తోటమాలి ఈ లోటు ఎరుగడా " నాటినావు "
పూలూ కాయలు ఊయలలూగే
గాలికి పూలు నేలకు రాలే 2
పూలు రాల పూ బాలలు నవ్వే 2
కాలగతిని వనమాలి తెలియడా " నాటినావు "
పూవులు కొన్నీ పూజలకేగే
ప్రాప్తము లేనివీ పాడైపోయే 2
ఋణము దీరెనా ఏ జీవికైనా 2
తనువులు వదిలి తరలిపోవునులే " నాటినావు "
చంద్రధరుని సేవించేటి
రామచంద్రుడు శ్రీ గురువాయే
వాడిన తీగై వనములనుండే
నీడ జూసి కాపాడగ రావే " నాటినావు "
7, సెప్టెంబర్ 2018, శుక్రవారం
నిను చూడక నేనుండగలనా - భజన
నిను చూడక నేనుండగలనా
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం 2
మనసున్నది నీ ధ్యాసలోనే
తనువున్నది నీ సేవలోనే
ప్రతి నొటా నీ శరణ గానం
నా నోటే నీ మధుర గానం 2 " నిను "
ఆ బ్రహ్మకు నే ఋణపడనా
రాత రాశాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లిదండ్రులే
జన్మనిచ్చారు ఏనాటి వరమో 2 " నిను "
ఈ ఇహమందు ఏ దుష్ట కోరికలు
ఇక రాకుండ నువు చూడవా
ఈ జన్మంత సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్యా 2 " నిను "
నీ కొండకు రాకుండగలనా
ఈ దేహం నీదు ప్రసాదం
నా ప్రాణం నీ ఉపకారం 2
మనసున్నది నీ ధ్యాసలోనే
తనువున్నది నీ సేవలోనే
ప్రతి నొటా నీ శరణ గానం
నా నోటే నీ మధుర గానం 2 " నిను "
ఆ బ్రహ్మకు నే ఋణపడనా
రాత రాశాడు నిను చూడగా
కనిపించే దైవాలు తల్లిదండ్రులే
జన్మనిచ్చారు ఏనాటి వరమో 2 " నిను "
ఈ ఇహమందు ఏ దుష్ట కోరికలు
ఇక రాకుండ నువు చూడవా
ఈ జన్మంత సేవింతునయ్యా
ఇక మరుజన్మ నాకివ్వకయ్యా 2 " నిను "
16, ఆగస్టు 2018, గురువారం
ప్రాణ్ ప్రదాతా సంకట్ త్రాతా - భజన
ప్రాణ్ ప్రదాతా సంకట్ త్రాతా
హే సుఖ్ దాతా ఓం ఓం
సవితా మాతా పితా వరేణ్యం
భగవాన్ భ్రాతా ఓం ఓం
తేరా శుద్ధ్ స్వరూప్ ధరే హం
ధారణ్ దాతా ఓం ఓం
ప్రజ్ఞా ప్రేరిత్కర్ సుకర్మ్ మే
విశ్వ విధాతా ఓం ఓం
ఓమానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం
బ్రహ్మానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం
హే సుఖ్ దాతా ఓం ఓం
సవితా మాతా పితా వరేణ్యం
భగవాన్ భ్రాతా ఓం ఓం
తేరా శుద్ధ్ స్వరూప్ ధరే హం
ధారణ్ దాతా ఓం ఓం
ప్రజ్ఞా ప్రేరిత్కర్ సుకర్మ్ మే
విశ్వ విధాతా ఓం ఓం
ఓమానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం
బ్రహ్మానంద్ ఓమానంద్ ఓమానంద్ ఓం ఓం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)