2, అక్టోబర్ 2026, శుక్రవారం

కోటగుళ్ళు గోశాలకు..

 ప్రసిద్ధి గాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు గోశాల గోమాతలకు గాంధీ నగర్ ఎం జే పీ పాఠశాల ప్రిన్సిపల్ స్వప్న గురువారం దానా బస్తాలు అందచేశారు. ప్రిన్సిపల్ స్వప్న జన్మ దినం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాన బస్తాల వితరణ అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు, పూలమాల లతో ఘనంగా సన్మానించారు. ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అంద చేశారు. కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. 



1, అక్టోబర్ 2026, గురువారం

వారం వర్జ్యం 1-10-2026

 శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయణం, వర్ష రుతువు, భాద్రపద మాసం, బహుళ పక్షం పంచమి: మ. 2-45 తదుపరి షష్టి, కృత్తిక: ఉ. 9-04 తదుపరి రోహిణి, వర్జ్యం: రా. 12-00నుంచి 1-30 వరకు, దుర్ముహూర్తం: ఉ 9-55 నుంచి 10-43 వరకు, తిరిగి మ. 2-44 నుంచి 3-33 వరకు, అమృత ఘడియలు: ఉ. 6-47 నుంచి 8-18 వరకు , తిరిగి తె. 4-29 నుంచి 

రాహుకాలం.. మ.1-30 నుంచి 3-00 వరకు 

సూర్యోదయం.. ఉ.5-54, సూర్యాస్తమయం.. సా.5-48