2, నవంబర్ 2026, సోమవారం

వేద స్వస్తి మహోత్సవం@యాదాద్రి..

 యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో ఆదివారం" వేద స్వస్తి కార్యక్రమాన్ని"  భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సుమారు 550 మంది వేద విద్యార్థులు, వారి గురువులు ఏకకాలంలో వేద స్వస్తిని పలికారు. చతుర్వేదాలైన రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లోని పవిత్ర మంత్రాలని విద్యార్థులు, అధ్యాపకులు పఠనం చేశారు. శ్రావ్యమైన మంత్రోచ్ఛరణలతో ఆలయముఖ మండపం, ప్రాకారాలు మార్మోగాయి . స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులు ఈ దివ్యమైన వేద నాదాన్ని విని పరవశించిపోయారు. లోక కళ్యాణం, సమాజ శ్రేయస్సు, రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి భవాని శంకర్ గారు తెలిపారు .ఈ కార్యక్రమంలో దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు ,వేద పండితులు శ్రీనివాస్ శర్మ, డిప్యూటీఈవో  దొర్బల భాస్కర్ శర్మ, ఆలయ ఏఈవో సురేందర్ రెడ్డి ,ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేద పఠనం పూర్తి చేసుకున్న విద్యార్థులు, గురువులకు ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి వారి తీర్థ ప్రసాదాలను, శేష వస్త్రాలు అందజేసి ఘనంగా సత్కరించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి