ప్రజోపయోగ ప్రకటనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రజోపయోగ ప్రకటనలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, మార్చి 2024, సోమవారం

రాజాం రచయితల వేదిక 110వ సమావేశం

 ఈనెల మార్చి 31వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో రాజాం రచయితల వేదిక ఒక వంద పది వ సమావేశం జరుగుతుంది రాజాకు శాంతారావు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో వేమన ప్రగతి శీలత అనే అంశంపై బొంతు సూర్యనారాయణ ప్రవాహి ముఖ్య ప్రసంగం చేస్తారు

గారా రంగనాథం 9885758123

10, మార్చి 2024, ఆదివారం

14 నుంచి గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవం

 15న రాష్ట్రపతి చేతులమీరుగా కనహా శాంతి వనంలో ప్రారంభం 100 దేశాల నుంచి 300కు పైగా గురువుల రాక

సంస్కృతి ఆధ్యాత్మిక మార్గ నిర్దేశంతో భారత్ యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇది నూతనలపై కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని చెప్పారు ఈనెల 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కన్హ శాంతి వనంలో కేంద్ర సాంస్కృతిక శాఖ హార్ట్ ఫుల్ నెస్ సంస్థతో కలిసి గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవం 2024 నిర్వహించబోతున్నట్లు తెలిపారు దీనికి సంబంధించిన విషయాలు కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధ్యాత్మిక గురువులందరికి ఒక వేదిక పైకి తీసుకురాబోతున్నామని మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటల్ వేయాలని ప్రధాని మోడీ ఆలోచనలకు అనుగుణంగా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని తెలిపారు 15న రాష్ట్రపతి మురుము కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని 16న ఉపరాష్ట్రపతి ఘనకాడ పాల్గొంటారని చెప్పారు 17న వివిధ దేశాలకు చెందిన గురువులు చర్చలు జరుపుతారని వెల్లడించారు దాదాపు 100 దేశాల నుంచి 300కు పైగా ఆధ్యాత్మిక గురువులతో పాటు దాదాపు లక్ష మంది వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నామన్నారు ఇది ఒక మతానికి సంబంధించిన కార్యక్రమం కాదని అన్ని మతాలవారు పాల్గొంటారని స్పష్టం చేశారు సమావేశంలో రామచంద్ర మిషన్ అధ్యక్షుడు హార్ట్ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ చిన్న జీయర్ స్వామి స్వామి బోధమయానంద తో పాటుగా ప్రతినిధులు పాల్గొన్నారు



18, ఫిబ్రవరి 2024, ఆదివారం

415 ఆలయాలకు త్వరలో పాలకవర్గాలు

 




రాష్ట్రంలోని 415 ఆలయాలకు నూతన పాలకవర్గాల నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జారీ చేసింది ఒకటి రెండు నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించింది ఎంత భారీ సంఖ్యలో నియామకాలు చేపట్టడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి అని అధికారులు చెబుతున్నారు అధిక సంఖ్యలో ఆలయాల పాలకవర్గాల పదవీకాలం గడువు ముగిసిన నేపథ్యంలో అధికారులు ఆ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకువచ్చారు ఖాళీగా ఉన్న ఆలయాలకు దశలవారీగా నియామకాలు చేపట్టాలని ఆమె ఆదేశించడంతో అధికారులు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నియోజకవర్గాల వారీగా జాబితాలను రూపొందిస్తారు ఆ తర్వాత ఈ జాబితాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు తో పాటు ఆలయాన్నిబట్టి సభ్యుల సంఖ్య ఉంటుంది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేస్తాయి చిన్నా పెద్దా కలిపి రాష్ట్రంలో 875 ఆలయాలకు ప్రభుత్వం పాలకవర్గాలను నియమించాల్సి ఉంది వీటిలో 19 ఆలయాలకు పాలకవర్గ పదవీకాలం ఇంకా మిగిలింది మిగిలిన 685 ఆలయాలకు నియామకాలు చేపట్టాల్సి ఉండగా తొలి దశలో 415 ఆలయాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు మరో 270 ఆలయాలకు రెండు దశలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ఆలేక పాలకవర్గం ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేశారని సాధ్యమైనంత త్వరగా మిగతా నియామకాలను పూర్తి చేస్తామని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు


15, ఫిబ్రవరి 2024, గురువారం

గదులను సద్వినియోగం చేసుకోవాలి

 మాచారెడ్డి వీర హనుమాన్ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వేలం పాటలో గదులను దక్కించుకున్న భక్తులు ఉపాధి పొందుతూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని దేవాదాయ ఉమ్మడి నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ సూచించారు బుధవారం నిర్వహించిన వేలం పాటలు గదులను దక్కించుకున్న తొమ్మిది మందికి ఆ గదిలోకి సంబంధించిన తాళాలను అందజేశారు కిరాయిదారులు 1 నెంబర్ నుండి 10 నెంబర్ గదులకు గాను 3500 11వ గది నుంచి 20వ గది వరకు 3000 రూపాయలు అద్దె నిర్ణయించారు మిగిలిన గదులకు ఈనెల 20వ తేదీ వరకు అవకాశం ఉన్నట్టు ఆమె వెల్లడించారు ఎవరైనా ఆసక్తి ఉన్నవారు దేవాలయంలో సంప్రదించాలని కోరారు కార్యక్రమంలో ఈవో ప్రభు సిబ్బంది లక్ష్మణ్ పోలీసు రెవెన్యూ అధికారులు ఉన్నారు



ఆర్టీసీ కార్గోలు సమ్మక్క సారక్క ప్రసాదం

 ఆర్టీసీ కార్గో సేవల ద్వారా సమ్మక్క సారక్క ప్రసాదం బెల్లం ప్రసాదం అందజేయనున్నట్లు ఆర్టిసి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రాజు బుధవారం ఒక ప్రకటనలు తెలిపారు కామారెడ్డి జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో ఉన్న కార్గోలలో 299 రూపాయలు చెల్లించి బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే ప్రసాదం డెలివరీ చేస్తామని పేర్కొన్నారు సమ్మక్క సారక్క జాతరకు వెళ్లలేని భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇతర వివరాలకు 9 1 5 4 2 9 8 7 3 0 నెంబర్ లో సంప్రదించాలని సూచించారు



10, ఫిబ్రవరి 2024, శనివారం

14న అయ్యప్ప ఆలయ వార్షికోత్సవం

 


ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఈనెల 14న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు శనివారం తెలిపారు వివిధ పూజా కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించినట్లు పేర్కొన్నారు ఆలయ కమిటీ చైర్మన్ పద్మ శ్రీకాంత్ చంద్రం స్వామి కృష్ణారెడ్డి రాజేంద్రనాథ్ శ్రీనివాస్ స్వామి పాల్గొన్నారు