23, జులై 2018, సోమవారం

కృష్ణమ్మ పరవళ్ళు - కవిత

తుళ్ళి తుళ్ళి పడుతూ
పరవళ్ళు తొక్కుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

ఒక్కో అడ్డంకి దాటుతూ
తడారిన ప్రాజెక్టులు నింపుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

జనుల కళ్ళలో సంతసం నింపుతూ
జన దాహం ,భూదాహం తీర్చుతూ
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

పిల్లా పాపల భవిష్యత్ కు భరోసానిస్తూ
తెలుగు ప్రజల కడగండ్లు తీర్చడానికి
బిర బిరా వస్తోంది కృష్ణమ్మ

స్వాగతం సుస్వాగతం కృష్ణవేణీ
తెలుగింటి విరిబోణీ మా ఇంటి అలివేణీ
నీ పాదాలకు మా వినమ్ర నమస్సుమాంజలులు

పచ్చదనం పరవళ్ళు-గ్రీన్ చాలెంజ్-కవిత

పచ్చదనం పరవళ్ళు తొక్కుతోంది కొంగ్రొత్త ఆలోచనలతో
ఇగ్నిటెడ్ మైండ్స్,వాక్ ఫర్ వాటర్ వంటి స్వచ్చంద సంస్థల విజ్రుంభణతో
గ్రీన్ చాలెంజ్ పరుగెత్తుతోంది నూతనోత్తేజం తో
ప్రతి మనిషీ కావాలి ఒక స్వచ్చంద సేవకుడు ఈ విజయ స్ఫూర్తితో
ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో అంకురార్పణ కావాలి ఈ ప్రేరణతో
ప్రపంచం ఉలిక్కి పడాలి తెలుగు ప్రజల ఖ్యాతితో
అభివృద్ధి జరుగుతుంది శరవేగంగా ఇలాంటి వినూత్న ఆలోచనలతో
ఇరుగు పొరుగు రాష్ట్రాలనూ కలుపుకోవాలి ఈ కార్యక్రమంలో స్నేహభావంతో
అందరి అభివృద్ధీ మా కోరికని చాటాలి విశాల భావంతో
అపుడు నెలకొంటుంది శాంతి సుస్థిరంగా సంభ్రమాశ్చర్యాలతో
విచ్చేయుదురు లక్ష్మీ సరస్వతులు కరుణా కటాక్షములతో
పలకాలి సుస్వాగతం వారికి మంగళ వాయిద్యాలతో