యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం మరో అరుదైన రికార్డ్ సాధించింది కేంద్ర ప్రభుత్వం నిర్వహించే 29వ జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డు ఎంపిక ప్రక్రియలో భాగంగా న్యూ ఢిల్లీలో జరిగిన సదస్సులో శుక్రవారం ఆలయ ఈవో భవాని శంకర్ పాల్గొన్నారు ఆలయ డిజిటల్ సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు తీవ్ర కాలంలో యాదగిరి క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఆలయాధికారులు భక్తులకు డిజిటల్ సేవలు చేరువ చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారు దీంతో నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ అధికారులు ఇటీవల యాదగిరి క్షేత్రాన్ని సందర్శించి పరిశీలించి సేవలతో భక్తులు ఎలాంటి అనుభూతి పొందుతున్నారు. ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని అంశాలపై అధ్యయనం చేశారు 82 దరఖాస్తులు లో జాతీయస్థాయి ఈ గవర్నెన్స్ 29వ సదస్సులో భాగంగా మొదటి దశలో దేశవ్యాప్తంగా 82 దరఖాస్తులు వివిధ విభాగాల నుంచి అందాయి ఇందులో 32 ప్రాజెక్టులతో షార్ట్ లిస్ట్ తయారు చేశారు ఫిస్టులో తెలంగాణ నుంచి యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఉండటం విశేషం. ఈ నెల 14న యాదగిరి దేవస్థానం ఈవో బృందం ఢిల్లీకి వెళ్లి జూరీ సమక్షంలో ఫైనల్ ప్రెసెంటేషన్ సమర్పించింది ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జాతీయస్థాయిలో యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరింత గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
16, మే 2026, శనివారం
15, మే 2026, శుక్రవారం
ప్రాచీన చరిత్ర కలిగిన పెద్దంగంటి ఎల్లమ్మ
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని బడా భీంగల్ విరజానది ఒడ్డున గల పెద్దంగంటి ఎల్లమ్మకు 700 సంవత్సరాల ప్రాచీన చరిత్ర ఉందని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈ గ్రామ దేవత 14వ శతాబ్దానికి చెందినదిగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం రాష్ట్ర కన్వీనర్ శ్రీరామోజు హరిగోపాల్ రూడీ పరిచారని అన్నారు. ప్రధాన నల్లరాతి ఎల్లమ్మ విగ్రహం యొక్క ముఖము, చేతులు భిన్నమైనందున తమ చేతులలో ధరించిన పరికరాలు కనిపించడం లేదు. ఎల్లమ్మ అపార శక్తి స్వరూపిణి మాతగా ఆది, మంగళవారాలలో భక్తుల పూజలు అందుకుంటుంది. ఎల్లమ్మ ముందు పరశురాముని తల్లి రేణుకా దేవి విగ్రహం ఉంది .ఎల్లమ్మ పక్కనే ఒక వేప చెట్టు కానుకొని ఉన్న శిథిల రండంతస్తుల వీరగల్లు పదవ శతాబ్దం చాళుక్యుల కాలానికి చెందిన వీరగల్ల శిల్పం ఉంది. రెండో అంతస్తులో వీరులు తలబడే తీరు గతంలో ఏ వీర గల్లులో కనబడలేదు. పై అంతస్తు విరిగిపోయింది .ఒక్క వీరున్ని రెండు వైపులా నుంచి ఇద్దరు దాడి చేస్తున్నట్టుంది. ఇలాంటి వీరగల్లు శిల్పం చాలా అరుదు .చరిత్రకారుడు కంకణాల రాజేశ్వరి వెంట భీమ్గల్ సర్వ సమాజాభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షుడు తీగల రఘు ,రామ్ గిరి ఆనంద్ ఉన్నారు.
