ఆశ్రమములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ఆశ్రమములు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2024, బుధవారం

శ్రీ భగవాన్ శ్రీ సత్యానంద గీతాశ్రమంలో వజ్రోత్సవాలు

 బాల్కొండ మండలంలోని కిసాన్ నగర్ గ్రామంలో గల భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్త జనాశ్రమంలో ఈ నెల 16 17 18 తేదీలలో వజ్రోత్సవాల నిర్వహిస్తున్నట్లు ఆశ్రమ సహాయ కార్యదర్శి ఆడెపు జయరాం తెలిపారు భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి 1964 గీతా భక్త జనాశ్రమాన్ని స్థాపించడం జరిగిందని ఆయన తెలిపారు ఇట్టి ఆశ్రమానికి అవసరమైన స్థలాన్ని స్వర్గీయ వీకే రెడ్డి విరాళంగా ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు దేశంలోని నలుమూలల నుండి సుమారు 130 మంది స్వామీజీలు హాజరవుతారని వారి అమూల్యమైన సత్సంగ సందేశాలను విని మీ జన్మను సార్ధకం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారాలు అందించి జన్మ సార్థకం చేసుకోవాలని అన్నారు