శ్రీ సాయి బాబా మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
శ్రీ సాయి బాబా మందిరాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, ఫిబ్రవరి 2024, బుధవారం

నేటి నుంచి శ్రీ సాయి దివ్య క్షేత్రంలో 18 వ వార్షికోత్సవాలు

 బాల్కొండ మండలంలోని చిట్టాపూర్ గ్రామంలో గల శ్రీ సాయి దివ్య క్షేత్రంలో 18 వ వార్షికోత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నాయి బుధవారం సామూహిక యజ్ఞాలు అభిషేకాలు కుంకుమార్చనల అనంతరం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు సాయంత్రం రథోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయి కృపకు పాత్రులు కాగలరని కోరారు భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లను పూర్తి చేశారు



13, ఫిబ్రవరి 2024, మంగళవారం

ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

 దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా 29వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు వేదమంత్రోచారణల మధ్య భావాకు ఫల పంచామృతాలు అష్ట ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు రుద్రహోమం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా చేపట్టారు దాత ప్రమార్తి సుమన్ రేఖ పోతా రెడ్డి గారు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం గ్రామ ప్రధాన వీధుల గుండా సాయిబాబా ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగ జరిగింది కార్యక్రమంలో పద్మశాలి సంఘం కొట్టాలగడ్డ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధ్యక్షుడు కన్న దామోదర్ ఉపాధ్యక్షులు బల్ల ఆనంద్ గుడ్ల విజయ్ ప్రధాన కార్యదర్శి సబ్బని జగదీష్ కోశాధికారి నాగుల సురేష్ సహాయ కార్యదర్శి సబ్బని ప్రవీణ్ కుమార్ వెల్దండ హరిశంకర్ కన్న చంద్రబాబు సంయుక్త కార్యదర్శి సబ్బని ప్రేమ్ కుమార్ దైవశక్తి అంకం సంతోష్ సలహాదారులు ఎల్దండ రవీందర్ నాగుల సత్యనారాయణ నాగుల ప్రసాద్ నాగుల దశరథం కట్ట సుదర్శన్ తిరుమల లక్ష్మీకాంత్ పాండిదారులు నాగుల నారాయణ సబ్బని బాలయ్య వెల్దండ నరసయ్య మెరుగు గంగారం తిరుమల పోశెట్టి పాల్గొన్నారు




దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ 29వ వార్షికోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దాత రామర్ర్తి సుమన్ రేఖ పోతారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ పద్మశాలి సంఘం సభ్యులు దామోదర్ ఆనంద్ విజయ్ జగదీష్ సురేష్ ప్రవీణ్ కుమార్ హరిశంకర్ చంద్రబాబు ప్రేమ్ కుమార్ సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు



ఉత్సవాలకు ముస్తాబైన సాయిబాబా ఆలయం

 దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం 29వ వార్షికోత్సవ ఉత్సవాలకు ముస్తాబైనది మంగళవారం ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేయడానికి ఏర్పాటు చేశారు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కన్న దామోదర్ తెలిపారు



11, ఫిబ్రవరి 2024, ఆదివారం

14న ఎల్లారెడ్డి లో సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

 ఎల్లారెడ్డి పట్టణంలోని సాయిబాబా ఆలయ 20వ వార్షికోత్సవాన్ని ఈనెల 14న నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి బాబాకు విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు సాయంత్రం 6 గంటలకు రథయాత్ర పల్లకి సేవ ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు



సాయిబాబా ఆలయ వార్షికోత్సవాలు

 దోమకొండ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఆలయంలో ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ కమిటీ కొట్టాల గడ్డ పద్మశాలి సభ్యులు దామోదర్ ఆనంద్ విజయ జగదీష్ సురేష్ ప్రవీణ్ కుమార్ హరి శంకర్ చంద్రబాబు ప్రేమ్ కుమార్ సంతోష్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు



శ్రీ సాయిబాబా మందిర 29వ వార్షికోత్సవం దోమకొండ

 దోమకొండలో నెలకొన్న శ్రీ సాయిబాబా మందిరం 29వ వార్షికోత్సవ వేడుకలు ఈనెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్తులు ఆలయంలో జరిగే కార్యక్రమాలకు హాజరై ఆ సాయిబాబా ఆశీస్సులు పొందాలని కోరుతున్నారు

శ్రీ సాయిబాబా ఆలయ కమిటీ దోమకొండ.

భావన ఋషి అన్నపూర్ణ సేవా సమితి దోమకొండ










10, ఫిబ్రవరి 2024, శనివారం

ఘనంగా సాయిబాబా ఆలయ వార్షికోత్సవం

 గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో ఉన్న సాయిబాబా ఆలయ ఏదో వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమంలో సర్పంచ్ అంజయ్య ముధెల్లి విండో చైర్మన్ సాయిరాం ఎంపీటీసీలు గాజుల ఉమారాణి తూము అంజయ్య బొల్లారం రమేష్ తదితరులు పాల్గొన్నారు