5, అక్టోబర్ 2026, సోమవారం

ఏళ్లనాటి ఆచారం.. గంగిరెద్దుల విన్యాసం

 దసరాకు ముందు గ్రామాలలో గంగిరెద్దుల విన్యాసాలు గ్రామస్తులను అలరించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా ఆదివారము దోమకొండ గ్రామంలోని రెడ్డి సంఘంలో గంగిరెద్దుల విన్యాసాలు అమితంగా ఆకట్టుకున్నాయి .తమ పూర్వీకుల నుంచి దోమకొండలో పెద్దమనుషుల సమక్షంలో గంగిరెద్దులను నాట్యం ఆడించి వారి వద్ద తోచిన సహాయం పొందడం ఆనవాయితీగా వస్తుందని గంగిరెద్దుల విన్యాసకుడు గంట బిక్షపతి తెలిపారు.ఆవులు, ఎద్దులను సైతం పూజించే గొప్ప సంప్రదాయాన్ని భవిష్యత్ తరాలు సైతం కొనసాగించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయనకు ఐదువేల రూపాయలు సహాయం అందించినట్లు రెడ్డి సంఘాల అధ్యక్షుడు పెద్దిరెడ్డి సిద్ధారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి ఐక్యవేదిక మండలాధ్యక్షుడు పన్యాల రామ్మోహన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి నాయిని సంతోష్ రెడ్డి, మన్నె సాయి రెడ్డి, దుంపల ప్రతాపరెడ్డి, శంకర్ రెడ్డి, నర్సారెడ్డి, అనంతరెడ్డి, గోపాల రెడ్డి, నాగరాజు రెడ్డి పాల్గొన్నారు. .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి