తెల్లారినదీ లేరా స్వామీ పూజకు పూవులు పూచినవీ
సన్న జాజులూ బంతి పువ్వులూ వెంకటరమణని కొలచినవీ " తెల్లా "
గొల్లలు పిల్లలు తలుపులు తెరువగ కర్పూర హారతి ఇచ్చెనులే
పరిమళాలు పంచామృతములతో చక్కటి స్నానము చేయరే " తెల్లా "
మంగళ హారతి గైకొనుమా మా మానస మంగళ హారతీ
కర్పూర హారతి వెలుగులె నీకు ముత్యాల మంగళ హారతీ " తెల్లా "
వెండి కొండపై నిండు మనసుతో కోయిల నీకై పాడెనులే
త్యాగయ్య గీతిక పదములె నీకూ ముత్యాల మంగళ హారతీ " తెల్లా "
No comments:
Post a Comment