భగవంతుడు జ్యోతి స్వరూపుడు.అందులో దీపం లక్ష్మీ స్వరూపం.ప్రతి ఇంట్లో పూజా మందిరంలోనూ , తులసి చెట్టు వద్ద ఉదయం , సంధ్యా సమయంలో దీపాలు వెలిగించాలి.ఇలా చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది.ఉదయమైతే దీపం వెలిగించాక ఆ దీపానికి పసుపు ,కుంకుమ ,గంధం ,పువ్వులు సమర్పించాలి.అదే విశేష పూజలు జరిగినప్పుడు నైవేద్యం కూడా సమర్పించాలి.దీపారాధన తరువాతనే పూజ ప్రారంభించాలి.నిత్య దీపారాధనతో సకల శుభఫలితాలు కలుగుతాయి.దీపాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశగా ఉంచి వెలిగించాలి.వత్తి కూడా తూర్పు లేదా ఉత్తరం వైపు చూడాలి.అశౌచం , సూతకం ఏర్పడ్డప్పుడు ఆయా పరిమిత దినాల వరకే దీపం వెలిగించవద్దు.ఆ తర్వాత దీపం వెలిగించవచ్చు.
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
Saturday, 10 June 2017
Wednesday, 7 June 2017
గోవు విశిష్టత ఏమిటి? / GOVU VISHISHTATHA YEMITI?
మాతా ఆదిత్యానాం దుహితా వసూనాం
ప్రాణ్:ప్రజానాం అమ్రుతస్య నాభి:
హిరణ్య వర్ణా మధుకళా ఘృతాచి
మహానుభర్గశ్చ రతిమర్త్యేషు
అనగా ద్వాదశాదిత్యులకు అనగా 12 మంది సూర్యులకు తల్లి.అష్ట వసువులకు / దేవతలకు బిడ్డ గోవు.ప్రజలకు ప్రాణం . అమృతమునకు పుట్టినిల్లు.బంగారు రంగు కలది , పాలను వర్షిస్తూ , నేతిని నింపుతూ పరిపూర్ణమైన గోవు మన లోకంలో సంచరిస్తున్నది అని అర్థం.దుష్టులను సమ్హరించేది, సజ్జనులను కాపాడేది గోవు.ప్రాణులకు అన్నపానీయాలు అందించేది ,హితమును బోధించే గురువును ప్రసాదించేది , ధర్మ పాలకులను అందించేది, దేవతలందరికీ నిలయమైనది.మహేశ్వరునికి వాహనమైనది గోవు. " గో " అనే శబ్దం " ఓం " అనే పవిత్ర శబ్దానికి సమానం.
గురువు ప్రేమ / GURUVU PREMA
జెన్ గురువు సుజుకి రోషికి గొప్ప పేరుంది.ఆయన తన శిష్యులను చాలా ప్రేమగా చూసుకునే వారు.శిష్యులకు కూడా గురువంటే అమిత గౌరవాభిమానాలు ఉండేవి.శిష్యుల్లో ఒక అమ్మాయికి గురువు గారిపై ప్రేమ కలిగింది.ఆయన లేనిదే బ్రతుకు లేదనే భావనలో పడిపోయింది.ఒక రోజు ఆమె గురువు దగ్గరికి వచ్చింది.ఎలాగైనా తన ప్రేమను ఆయనకు చెప్పాలనుకుంది.ప్రేమతో కూడిన హావభావాలు వ్యక్తం చేస్తూ,ఏదొరకంగా గురువు గారి మనసులో చోటు సంపాదించాలని భావించింది.ఐతే అది ప్రేమో కాదో తెలియని అయోమయ స్థితిలో ఉందామె.తీరా గురువు గారు ఏమంటారో అనే ఆలోచన ఆమెను కుదురుగా ఉండనివ్వడంలేదు.శిష్యురాలి ఇబ్బందిని గ్రహించిన సుజుకి ఆమె తలను ఆప్యాయంగా నిమిరి ' నీవు ఏమీ బాధ పడకు , మీ గురువు మీద ఉన్న ప్రేమనంతా, అభిమానాన్నంతా అలాగే మనసులో ఉంచుకోండి.అది మంచిదే.ఐతే మన ఇద్దరికీ సంబంధించి , అంటే గురు శిష్యులకు సంబంధించినంతవరకు కావలసినంత క్రమశిక్షణ నేను కలిగి ఉన్నాను.నా శిష్యురాలిగా నీలోనూ ఆ గుణం ఉందని విశ్వసిస్తున్నాను, అని సున్నితంగా ఆమె ప్రేమను తిరస్కరించాడు.ఆ మాటలు వినగానే ఆమెకు గురువు గొప్పదనం తెలిసివచ్చింది.ఆయన గురువుగా లభించడం తన అదృష్తంగా భావించింది.
Monday, 5 June 2017
Thursday, 1 June 2017
ఎదిగిన కొద్దీ ఒదగాలి / శ్రీకృష్ణుడి పాదసేవ / YEDHIGINA KODDEE ODHAGALI SREEKRUSHNUDI PADASEVA
పాండవాగ్రజుడు ధర్మరాజు రాజసూయ యాగం చేయ తలపెట్టాడు.యాగానికి 15 రోజుల ముందు సోదరులను ,కౌరవులను,కృష్ణ భగవానుణ్ణి ,ఇతర సామంతులను పిలిచి సమావేశం ఏర్పాటు చేశాడు.యాగానికి అందరూ సహకరించాల్సిందిగా కోరాడు.సభకు హాజరైన వారంతా ధర్మరాజు ఏం చెబితే అది చేస్తామన్నారు.భీముడికి భోజనాల విభాగం,కర్ణుడికి దాన ధర్మాలు,దుర్యోధనుడికి ఆదాయ వ్యయ విషయాలు ఇలా ఒక్కొకరికి ఒక్కో బాధ్యతను అప్పగించాడు.అప్పుడు శ్రీకృష్ణుదు లేచి అందరికీ పనులు అప్పగిస్తున్నావు మరి నా మాటేమిటి అని అడిగాడు.అపుడు ధర్మరాజు " పరమాత్మా మీరు యాగంలో ఉంటే చాలు మాకు కొండంత అండ మీ సాన్నిధ్యబలంతో యాగం నిర్విఘ్నంగా కొనసాగుతుంది అని బదులిచ్చాడు.ఐనా శ్రీకృష్ణుదు అందుకు ఒప్పుకోలేదు.తనకేదైన పని అప్పగింఛాల్సిందేనని పట్టుబట్టాడు.దైవంగా కొలిచే కృష్ణ పరమాత్మకు ఏ పని అప్పగించాలో తెలియక తికమక పడ్డాడు ధర్మరాజు.అతడి ఇబ్బందిని గ్రహించిన కృష్ణుడు " ధర్మరాజా యాగనికి వచ్చే మునులు ,రుషుల పాదాలు కడిగే బాధ్యత నాదని చెప్పాడు.అది విని ధర్మరాజు విస్తుపోయాడు.అన్నట్లుగానే తపస్సంపన్నుల పాదసేవ చేశాడు కృష్ణుడు.రాజసూయ యాగం పూర్తైన పిదప అగ్రపూజ అందుకున్నాడు.ఎంతవాడైనా ఒదిగి ఉండాలని లోకానికి చాటిచెప్పాడు శ్రీకృష్ణుడు ఈ సంఘటనతో.
Subscribe to:
Posts (Atom)