ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, మార్చి 2024, బుధవారం

వైభవంగా లక్ష్మీ నరసింహుడి దక్షిణ దిగ్ యాత్ర

 జగిత్యాల జిల్లా ధర్మపురిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం దక్షిణ దిగ్ యాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు సంప్రదాయం ప్రకారం ఆలయానికి దక్షిణ దిశలో ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పూజలు నిర్వహించారు


జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మంగళవారం అక్కడి పోలీస్ స్టేషన్ను సందర్శించారు స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్నారు స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముఖ్య ఘట్టమైన నరసింహుడి దక్షిణ దిగ్ యాత్రను మంగళవారం అంగరంగ వైభవంగా జరిపించారు ఇందులో భాగంగా ధర్మపురి పోలీస్స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఉదయ్ కుమార్ నేతృత్వంలో అర్చకుల వేద మంత్రచారణల మధ్య ప్రత్యేక పూజలు జరిపించారు ఆలయం నుంచి శోభాయాత్రగా తరలి వెళ్లిన స్వామివారికి పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక పూజలు జరిపారు స్వామి వారి కళ్యాణ అనంతరం దక్షిణ ఉత్తరలుగా బయలుదేరుతుంటారని మార్గమధ్యంలో ఉన్న పోలీస్ స్టేషన్ను లక్ష్మీనరసింహుడు సందర్శించి రికార్డులు రిజిస్టర్లను పరిశీలించి దుష్టులను శిక్షిస్తాడని ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం అని పండితులు తెలిపారు



26, మార్చి 2024, మంగళవారం

ధర్మపురిలో వైభవంగా తెప్పోత్సవం

  జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ పుష్కరిణిలో సోమవారం సాయంత్రం ఉగ్ర నరసింహుడి తెప్పోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవాలలో భాగంగా ఆరో రోజున ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిని వరకు మంగళ వాయిద్యాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు అనంతరం భోగమండపంలోని కూయలపై స్వామివార్లకు డోలోత్సవం నిర్వహించారు ఈ వేడుకలు ఆచార్యులు అధికారులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిసిఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు




25, మార్చి 2024, సోమవారం

కనుల పండుగగా నరసింహుడు తెప్పోత్సవం

 



జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి ఆదివారం సాయంత్రం బ్రహ్మ పుష్కరిణి కోనేరులో తెప్పోత్సవాన్ని కనుల పండుగ జరిపించారు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉత్సవమూర్తులను ఆలయం నుంచి బ్రహ్మ పుష్కరిణి వరకు మేళ తాళాల మధ్య తీసుకెళ్లారు కోనేరులో హంస వాహనంపై ఐదు ప్రదక్షిణలు చేయించారు అనంతరం భోగమండపంలోని ఊయలపై స్వామివారిలను ఆసీనులు చేసి డోలోత్సవం నిర్వహించారు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది వరకు భక్తులు తరలివచ్చారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్ ప్రభుత్వ విప్లరి లక్ష్మణ్ కుమార్ డిసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు



22, మార్చి 2024, శుక్రవారం

నేత్రపర్వంగా ధర్మపురి నరసింహుడు కళ్యాణం

 జగిత్యాల జిల్లాలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి రెండో రోజు అయిన గురువారం ఆలయంలోని శేషప్ప వేదికపై యువ శ్రీనివాసా ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండుగ జరిపించారు ప్రభుత్వం తరఫున కలెక్టర్ యాస్మిన్ భాష పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించారు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 50000 మంది భక్తుల తరలివచ్చారు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు వేడుక జరిపించారు ఎస్పీ సానుప్రీత్సింగ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విడ్మూరు లక్ష్మణ్ కుమార్ జాయింట్ కలెక్టర్ రాంబాబు డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు