నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ గ్రామంలో గల శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రథోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతపద్మనాభస్వామి గోవిందా గోవిందా అంటూ భక్తుల రథాన్ని కొండపై నుండి కిందికి తాళ్లతో ఊరేగించారు కొండ కింది నుండి పైకి గోవిందా గోవిందా అంటూ నినాదాలతో రసాన్ని లాగే వేద పండితులు వేదమంత్రాలు చదివారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై రథోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అనంతని పట్టు వస్త్రాలు సమర్పించి ముక్కులు తీర్చుకున్నారు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గ్రామ మాజీ సర్పంచ్ శేఖర్ గౌడ్ సాయన్న గాయకులు కృష్ణ గ్రామ కమిటీ అధ్యక్షులు ఇసంపెల్లి గంగారం రామ్ రెడ్డి తదిత రులు పాల్గొన్నారు
THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
3, మార్చి 2024, ఆదివారం
29, ఫిబ్రవరి 2024, గురువారం
అంగరంగ వైభవంగా అనంతుని కళ్యాణోత్సవం
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ శివారులోని శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అలంతుని కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేద పండితుల వేదమంత్రాలు నడుమ అనంతుని ఆటపాటలతో భక్తిశ్రద్ధలతో కళ్యాణం జరిగింది చుట్టుప్రక్కల గ్రామాల నుంచి భక్తులు హాజరై మొక్కలు తీర్చుకున్నారు అనంత అనంతయ్య దేవేశ అనంత ఫలదాయకాయ అనంత దుఃఖనాశాయ అనంతయా నమో నమః అంటూ వేద పండితులు వేదమంత్రాలు చదివారు గుండారం మల్కాపూర్ జలాల్పూర్ సారంగాపూర్ ఖానాపూర్ గ్రామాలను ఉండే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ నుండి హాజరైన భక్తులు తమ కానుకలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు రమణాచార్యులు సీతారామచార్యులు శ్రీనివాసచార్యులు వివిధ గ్రామాల నుండి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
27, ఫిబ్రవరి 2024, మంగళవారం
ప్రారంభమైన అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి మంగళవారం ఉదయం స్వామివారిని లక్ష్మాపూర్ నుండి కొండపై వరకు డబ్బులు వాయిద్యాలతో పాటలు పాడుతూ ఊరేగించారు అనంతరం అంకురారోహణ రుత్విక్ కుల దీక్ష హారతి మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించారు మాజీ సర్పంచ్ బాగారెడ్డి వీడిసి గంగారాం రాంరెడ్డి మాజీ సర్పంచ్ శేఖర్గౌడ్ భోజన్న తదితరులు పాల్గొన్నారు.
నేటి నుండి పద్మనాభ స్వామి ఉత్సవాలు
ఆహ్లాదకర వాతావరణంలో ఎత్తైన రాతికుండల నడుమ వెలసిన అనంత పద్మనాభ స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారం గా నిలుస్తున్నాడు మల్కాపూర్ శివారులోని వందల ఏళ్ల నాటి ఆలయంలో స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఏటా మాఘ బహుళ తదియ నుంచి మాఘ బహుళ అష్టమి వరకు వేడుకలు నిర్వహిస్తారు మొదటిరోజు అంకురార్పణతో కార్యక్రమాలు మొదలై ఆరు రోజులపాటు కొనసాగుతాయి ధ్వజారోహణ కళ్యాణము డోలారోహణము రథోత్సవము చక్రతీర్థము ఏకాంత సేవ వంటి కార్యక్రమాలు చేపడతారు. మల్కాపూర్ ఏ లక్ష్మాపూర్ గ్రామాలకు చెందిన ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు వస్తారు
37 ఆలయ చరిత్ర శ్రీ లక్ష్మీనరసింహస్వామి రూపంలో వెలసిన పద్మనాభ స్వామి ఆలయానికి 300 ఏళ్ల చరిత్ర ఉందని అర్చకులు చెబుతున్నారు ఈ ప్రాంతాన్ని పాలించిన గాంధారి వంశస్థులు రాజ్యాన్ని విస్తరించే క్రమంలో మల్కాపూర్ ఏ శివారులో గుర్రపు బండ్లపై సంచరించారు గుండారము మల్కాపూర్ మధ్యనున్న పెద్ద చెరువు వద్దకు రాగానే గుర్రాలు ఆగిపోయాయి. ఓ అశ్వం తాళ్లు తెంచుకొని పరుగులు తీసింది దానిని సైనికులు రాజకుటింబీకులు వెంబడించారు చెరువుగట్టుపై ఎత్తైన కొండపై ఉన్న రాతి గుహల్లోకి వెళ్లిన గుర్రం కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి తర్వాత గుహల మధ్య సన్నటి కాంతి రావడానికి వారు గమనించారు భూపాలకు వెళ్లి చూడగా కుర్రం రాళ్ల మధ్యలో చిన్న బంధువుగా మారడాన్ని గుర్తించారు ఇది తమ కుల దైవమైన పద్మనాభుడి మహిమ అని తలిచి ఏకశిరతో ఆలయాన్ని నిర్మించి పూజలు చేయడం ప్రారంభి ంచారు
పెరుగుతున్న రూపము రెండు రాతి పలకల మధ్య చిన్న బిందువు రూపంలో వెలసిన స్వామి రూపం క్రమంగా పెరుగుతూ వస్తుందని అర్చకులు చెబుతున్నారు ప్రస్తుతం శంకు చక్రాలు ధరించిన లక్ష్మీ అనంతపద్మనాభుడి రూపంలో భక్తులకు స్వామివారి దర్శనం ఇస్తున్నారు
26, ఫిబ్రవరి 2024, సోమవారం
అభయమిచ్చే అనంతపద్మనాభుడు
భక్తుల కొంగుబంగారము అనంత పద్మనాభ స్వామి ఆలయం రేపటి నుంచి వారం రోజులపాటు ఆలయ బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేస్తున్న లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామస్తులు
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ ఏ గ్రామ శివారులో గల శ్రీ లక్ష్మీ అంత పద్మనాభ స్వామి ఆలయం భక్తులకు బంగారంగా ప్రసిద్ధికి ఎక్కింది భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోర్కెలు నెరవేరుతాయి అని భక్తుల విశ్వాసం గ్రామ శివారు గుట్ట ప్రాంతంలో ఒక గుహలో నరసింహస్వామి రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు వృత్తాకారంలోనే శంఖ చక్రధారుడిగా వెలసి దినదినం తన రూపాన్ని పెంపొందించుకుంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అనంత పద్మనాభ స్వామి ఆలయ ఉత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి మార్చి మూడు మూడవ తేదీ వరకు నిర్వహించనున్నారు ఇందుకోసం లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ గ్రామాల అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏటా మాఘమాసంలో తదియ నుండి నష్టం వరకు వారం రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివస్తారు
చిన్న బిందు రూపంలో వెలసిన శ్రీ లక్ష్మీ అనంతపద్మనాభ స్వామి క్రమక్రమంగా పెరుగుతూ పూర్తి రూపాన్ని సంతరించుకున్నాడు ఇరుకైన రాళ్ల మధ్యలో శంకు చక్రం వక్షస్థల వాయాంశంపై కొలువు దీరిన శ్రీ లక్ష్మీ సహిత అనంతపద్మనాభుడిగా భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారి నిజరూపం గుహలో ఇరుకైన రాళ్ల మధ్యలో చిన్న ఖాళీ స్థలంలో ఉన్నది భక్తుల సౌలభ్యం కోసం అదే గుహలో కింది భాగంలో మరో విగ్రహాన్ని ప్రతిష్టించారు వేటా భాద్రపద మాసంలో అనంత చతుర్దశి రోజున నిర్వహించే అనంతపద్మనాభుడి వ్రతం అత్యంత శక్తివంతమైనదని భక్తుల విశ్వాసం పవిత్రమైన దీక్షతో ఏడు శిరస్సులు కలిగిన సర్ప రూపంలో అనంత పద్మనాభ స్వామిని ప్రతిష్టించి ఆ ప్రతిమను 16 నూలు పోగులతో తయారు చేసిన మాలను అలంకరించి అత్యంత పవిత్రంగా నియమనిష్ఠలతో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వ్రతాన్ని ఆచరిస్తున్నారు 27వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ఈనెల 27వ తేదీ నుండి ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవనున్నాయి మొదటిరోజు అంకురారోహణ రుత్వికుల దీక్ష ధారణ హారతి మంత్రపుష్పం 28వ తేదీన సుప్రభాత సేవ ధ్వజారోహణం 29వ తేదీన మధ్యాహ్నం శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారి కల్యాణోత్సవం మార్చి ఒకటవ తేదీన డోలారోహణం రెండవ తేదీన రథోత్సవం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు మూడవ తేదీన ఉదయం పూర్ణాహుతి చక్రతీర్థము నాగవెల్లి బాదషా వర్ణ పూజ సప్తావరన పూజలు దేవతా ఉద్వాసన భూత బలి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు సంపూర్ణం అవుతాయి జాతర సహకారంతో అష్టముఖి కోనేరు నిర్మాణం నలుగురు దాతలు అందించిన విరాళాలతో ఆలయ ఆరణాలు మూడు లక్షల రూపాయలతో అష్టముఖి కోనేరుగా కొత్తగా నిర్మించారు ఈ కోనేరు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే భూపతిరెడ్డి గ్రామ పెద్దలతో కలిసి సందర్శించారు 60 లక్షల రూపాయలతో బిటి సిసి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు ఆలయ ముఖద్వారం నుండి ఆలయం పై వరకు ఆలయ ఆవరణలో సిసి రోడ్డును నియమించనున్నారు









