సంతోషిమాత ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సంతోషిమాత ఆలయాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

2, మార్చి 2024, శనివారం

కన్నుల పండుగగా సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం

 


మద్నూర్ మండల కేంద్రంలోని సంతోషిమాత ఆలయ వార్షికోత్సవం కన్నుల పండుగ జరిగింది మూడు రాష్ట్రాల భక్తులు తరలివచ్చారు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు ప్రతి ఏడాది మహాశివరాత్రికి ముందు శుక్రవారం ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు.

ఆలయ నిర్వాహకురాలు సంతోషి యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి అధ్యక్షుడు కళ్యాణానంద స్వామీజీ భక్తులను ఉద్దేశించి మాట్లాడారు కుంకుమార్చన పూర్తికాగానే యజ్ఞ కార్యక్రమం ప్రారంభించారు సాయంత్రం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కల్యాణానంద స్వామీజీ మాట్లాడుతూ భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయం గొప్పదని ఆలయాలను దర్శించుకుని భక్తులు కోరిన కోర్కెలు తీర్చుకుంటారని గుర్తు చేశారు నీటి యువత పాఠ్యాంశ సంస్కృతిని అవలంబించి భారత సంస్కృతిని మరిచిపోతుందని తల్లితండ్రులు సంస్కృతి సంప్రదాయాలను గుర్తుచేయాలని అన్నారు ఆలయాలకు తీసుకెళ్లి ఆలయ విశిష్టతను తెలియజేయాలని గుర్తు చేశారు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా సంస్కృతి సాంప్రదాయాల విలువలు గుర్తిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని తెలిపారు కార్యక్రమానికి కాయ రాష్ట్రాల తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర నుంచి భక్తులు రావడంతో ఆలయం కిటకిటలాడింది


1, మార్చి 2024, శుక్రవారం

మద్నూర్ లో సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు

 ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు సంతోషిమాత వార్షికోత్సవాలు మద్దూర్లో నిర్వహిస్తారు అందులో భాగంగా నేటి శుక్రవారం సంతోషిమాత వార్షికోత్సవ వేడుకలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు పూజారి సంతోషి తెలిపారు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆలయ ఆవరణంలో గణపతి నవగ్రహాల పూజ కుంకుమ పూజ యజ్ఞం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు భక్తుల అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు

26, ఫిబ్రవరి 2024, సోమవారం

ఒకటి న సంతోషి మాతా ఆలయ వార్షికోత్సవం

 మద్నూర్ మండలం కేంద్రం లోని సంతోషి మాతా ఆలయం లో శుక్ర వారం మార్చి ఒకటి నాడు ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకురాలు సంతోషి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి వేడుక ను విజయవంతం చేయాలని కోరారు. ధ్వజా రోహణం, కుంకుమార్చన,అభిషేకం ,యజ్ఞం,హారతి కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.