బీర్కూరు మండల కేంద్రంలో గంగమ్మ ఆలయ 11 వ వార్షికోత్సవ వేడుకలను బుధవారం గంగపుత్రులు ఘనంగా జరుపుకున్నారు గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు మహిళలు నిండు కడవలను తలపై పెట్టుకుని మంగళ హారతులతో భాజ భజంత్రీలతో ఊరేగింపుగా ఆలయానికి తరలి వెళ్లారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి అభిషేకం చేసి మొక్కలు చెల్లించారు