నింపుతున్నాయి నిర్మాతల జేబు,
ప్రదర్శిస్తున్నాయి సీరియల్ అంతా డాబు ,
నిండి ఉంటున్నాయి పాత్రలన్నీ యెంతో రుబాబు,
ఆలోచిస్తున్నాయి పాత్రలన్నీ ఏమిటని ఈ మతలబు,
చేస్తున్నాయి మనుషుల మనసంతా ఖరాబు,
మారుస్తున్నాయి మనసుని దీపావళి మతాబు,అవుతున్నాయి మనసులు సదాలోచనల లేమితో గరీబు,
చెడగొడుతున్నాయి దురాలోచనలతో యెందరిదో నసీబు ,
ఎప్పుడిస్తాయో ఈ దుష్ట సీరియళ్ళనుండి విముక్తి అనే ప్రశ్నకు జవాబు
విడిపోతాయి తప్పకుండా దుష్ట సీరియళ్ళ సంకెళ్ళు ,దృష్టిపెడితేనే తప్పకుండా నవాబు.