THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
Saturday, 29 December 2018
హనుమంతుడికి ఎలా నమస్కరించాలి? / HANUMANTHUDIKI YELA NAMASKARINCHAALI?
ఏ దేవతకైనా అర్చనలో భాగంగా భక్తులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.మహిళలు సాష్టాంగ నమస్కారం చేయరాదని శాస్త్ర నియమం.హనుమంతుడి విషయంలో పురుషులు సాష్టాంగ నమస్కారం చేయకూడదనే నియమం ఏదీ లేదు.అది ఒక విశ్వాసం మాత్రమే.ఆంజనేయుడు అంటే సేవకు ప్రతీక.అనితర సాధ్యమైన ఘనకార్యాలు చేసి కూడారామచంద్రుని పాదసన్నిధిని కోరుకునే సేవా తత్పరుడు.తాను రామదాసుణ్ణని త్రికరణశుద్ధిగా భావించే ఆంజనేయుడు భక్తి అంతా శ్రీరామునికే సమర్పించాలని భావిస్తాడు.ఈ అభిప్రాయంతో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయరాదనే నమ్మిక లోకంలో ప్రచారమైంది.ఐతే స్వామి త్రిమూర్తి స్వరూపుడనీ ,రుద్రాంశ సంభూతుడనీ సమ్హితలు చెబుతున్నాయి.ఈ దృష్టితో ఆంజనేయుడికి సాష్టాంగ నమస్కారం చేయవచ్చు.కొందరు హనుమ పాదాల కింద శైనైశ్చరుడు ఉంటాడు కాబట్టి సాష్టాంగం చేయకూడదని అనుకుంటారు,అది సరి కాదు.
Friday, 21 December 2018
నాలుగు మంచి మాటలు
1. సర్వ ప్రాణులలో చైతన్య స్వరూపి అయిన పరమేశ్వరుని దర్శింపుము.
2. నీ భాగ్య రేఖ తొలగిన వేళలో నీకు తోడెవ్వరు రారు.అలాగని బాధ పడవద్దు.నిరంతరం నిన్ను వెంటాడే నీ నీడ నీవే కనుక వెలుగు నుండి చీకటిలోకి వెళ్ళినప్పుడు లేదు కదా.
3. నీకన్నా తక్కువ అదృష్టం గల వారిని చిన్న చూపుతో చూడకు.
4. కళయే దైవ సమానం.
5. యాచకులను నిందించకు.నిజానికి లోకులందరూ యాచకులే.
6. కళను,కళాకారులను దూషించకు.నీవు కళాకారుడవైతే ఇతరులను కళావంతులుగా చేయుటకై యత్నించు.
7. జగమంతయు జగదీశ్వరుని సామ్రాజ్యం.అతడు ఎవరికి ఏ పదవినిచ్చునో ఎవ్వరమెరుగలేము.
8. మత్తు పానీయాలు తాగినవాడు దేహాన్ని మరచిపోతాడు.బ్రహ్మ జ్ఞానాన్ని పొందినవాడు జగత్తునే మరచిపోతాడు.
9.లోభత్వం వీడక మనిషి జ్ఞానం పొందలేడు.
10. మహాత్ములు పరోపకారార్థమై ,లోక కళ్యాణార్థమై అవతరిస్తారు.
11. చంచల చిత్తం సంగీత శ్రవణం ద్వారా ప్రశాంతం నొందగలదు.
12. శ్రమను గుర్తెరుగని యజమానులను సేవింపకు.
13.అపాత్ర దానం మంచిది కాదు.
14. ధనము లేనిదే ఏ పని జరుగదు.కావున ధనం విలువైనది.ధనము విలువను గుర్తెరిగే జ్ఞానము ఇంకా విలువైనది.
15.నీవు పొందుతున్న సౌఖ్యాలు ప్రస్తుతం తరిగిపోతున్న గతములోని పుణ్యపు మూట ,కష్టాలు తరిగిపోతున్న గతములోని నీ పాపపు మూట.
16. కోరకయే ప్రతివారికి భగవంతుడిచ్చే వరం మరణం.
17. ఎంతటి వారైనా దురభిమానం వీడవచ్చు కాని ఆత్మాభిమానాన్ని పూర్తిగా వీడలేరు.
18. విద్య,బల,జాతి,ధన గర్వముతో ఇతరులను వంచించి బాధించకూడదు.
19. అహంకారం నశించే వరకు మనిషి జ్ఞాని కాలేడు.
20. మనిషి ఏది చేసినా జన్మమున్నంతవరకే,త్వరపడి మంచి పనులు చేయండి.పుణ్యాత్ములై శుభఫలితాలనొందండి.మీరు జ్ఞానులై అజ్ఞానులను జ్ఞానులుగా చేయండి.
21. సామ వేద సారమే సంగీతము.
22. జీవ హింస మహా పాతకం.
23.దేహధారి అయిన ప్రతివారికి ఇంచుమించుగా కష్టసుఖాలుంటాయి.
24. మనిషి డబ్బుతో ఎన్నో కొన్నప్పటికి నిమిషమాయువును కూడా కొనలేడు.
25. నిరాకార స్వరూపి అయిన భగవానుని ఉనికి తెలిసికొనుటకు ఏ మూర్తినైనా పూజించవచ్చు.
26. నైరాశ్యము మరియు దురాశ - ఇవి జీవిత లక్షణాలు కావు.
27. భక్తి పేరున అమాయకులను దోచుకునే వారు పాపాత్ములు.
28. అతిథులను శక్తికొలది ఆదరింపుము.
29.ప్రశ్నిచిన వాని ప్రశ్నను బట్టి అతని వివేకము నిర్ధారించవచ్చు.వివేకమైన ప్రశ్న అల్పుడడగలేడు.
30. కళను ఆదరించేవారికన్నా కళను ఆరాధించే వారు చాలా తక్కువగా ఉంటారు.
31.వృద్ధాప్యము మనిషికి భగవంతుడిచ్చే శిక్షలలో చిట్టచివరిది.
Subscribe to:
Posts (Atom)