Monday, 24 May 2021

కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీస్తారు?

 కొబ్బరికాయకు పీచు కింది భాగంలో మూడు కళ్ళు ఉంటాయి .ఈ కళ్ళు ఉన్న ప్రదేశం సున్నితంగా ఉంటుంది .అక్కడ గోటితో  గిచ్చిన నీళ్ళు బయటకు వచ్చేస్తాయి .కొబ్బరి పీచు ను పూర్తిగా తీసి నట్లయితే నీళ్లు కారిపోయే అవకాశం ఉంటుంది .అందుకే కళ్ళున్న వైపు పిలకలా పీచును విడిచిపెడతారు .అరటి వంటి పళ్ళను కొద్దిగా వలిచి నివేదన చేస్తారు .భగవంతుడు తినడానికి సిద్ధంగా చేసి ఇవ్వడం అన్నమాట .అందుకే పిలకతో ఉన్నా కొబ్బరికాయను పగలకొట్టి ఆపైన పిలక తీసివేసి నివేదన చేస్తాము.

కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు?

 ప్రతి మంచి పని లోనూ పసుపును విరివిగా వినియోగిస్తారు మనవాళ్ళు. శుభకార్యాలలో యజ్ఞ దీక్ష సమయాలలో వస్త్రాలను పసుపు నీళ్లలో ముంచి ఆర వే య డ ము ఆచారం. తడిపి ఆరవేసిన వస్త్రాలు ఇతరులకు ఇవ్వకూడదు .నూతన వస్త్రాలు ఇవ్వాలి. పసుపు నీళ్లతో తడిపితే ఆ వస్త్రాలు పా త వైపోతాయి. అందుకే పసుపు నీళ్లలో తడిపిన ఫలం కోసం ఇతరులకు కొత్తబట్టలు పెట్టేటప్పుడు పసుపు బొట్టు పెడతారు .ఇలా చేయడం మంగళకరంగా భావిస్తారు .పసుపు క్రిమిసంహారిణి .అనేక చేతులు మారి వచ్చే కొత్త బట్టల లో ఎటువంటి క్రిములు ఉన్నా పసుపు నివారిస్తుంది. అప్పటికప్పుడు కట్టుకున్న ఎటువంటి అనారోగ్యం కలగకుండా ఉంటుంది

శుభకార్యం చేసిన తర్వాత దర్భలు, నువ్వులు తాకకూడదా?

 దర్భలు ఎప్పుడూ పవిత్రమైనవే. దర్భను తాకకూడదు అని చెప్పే సందర్భం ఒక్కటీ లేదు. అశుచి నుంచి మనల్ని బయటపడేసేది  దర్భయే. ఇంటిలో ఏదైనా పెద్ద శుభకార్యం చేసిన కొద్ది కాలానికే పెద్దలకు సంవత్సరీకాలు , త ద్ది నా లు పెట్టుకోవలసి వస్తే నువ్వులు తాకక పోవడం మాత్రం కనిపిస్తుంది .నువ్వుల కు బదులుగా వాడేవి ఏ వీ  సరైన ప్రత్యామ్నాయాలు కావు . పితృకార్యం చేయవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా నువ్వుల నేఉపయోగించాలి .అందులోనూ తల్లిదండ్రులకు శ్రాద్ధకర్మలు నిర్వహించవలసి వచ్చినప్పుడు అస్సలు మానేయకూడదు.

గుడిలోనికి వెళ్లేముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు?

 గుడిలోనికి మాత్రమే కాదు ఇక్కడ గడప ఉన్నా నమస్కరించిన తరువాతే లోనికి వెళ్ళాలి .లక్ష్మీ దేవి గా భావిస్తాము. అందుకే  రోజు గడపన కడిగి పసుపు కుంకుమలతో అలంకరించి నమస్కరిస్తాము. దేహ లీ దేహ పర్యంత స్థాన సంపర్క శోభితే మత్కర్మ పరి పూర్ణయ యతో భవే సదా మమ అనే మంత్రాన్ని చెబుతూ గడపకు నమస్కరించాలి .నేను ఆచరించిన కర్మలు పరిపూర్ణంగా సఫలం చేసుకోవడానికి కావలసిన సంస్కారాన్ని ప్రసాదించు తల్లి, నన్ను మంచివాడిగా చేయమని ఈ శ్లోకానికి అర్థం. మంచివాడిగా ఉంటే సమాజం తద్వారా దేశం ఉత్తమంగా తయారవుతాయి .సంస్కారాన్ని మనకు నేర్పేది గడప రూపంలోని లక్ష్మీదేవి .అందుకే గడపకు నమస్కరించాలి.

ఆలయాలలో నవగ్రహ దర్శనం తర్వాత కాళ్ళు కడుక్కోవాలా?

 అవసరం లేదు .పరిహార పూజలు జరిపించే సందర్భంలో మాత్రమే కొన్ని విధి నియమాలు ఉంటాయి. అటువంటి సందర్భం లేనప్పుడు నవగ్రహ దర్శనానంతరం కాళ్ళు కడుక్కుని అక్కరలేదు .ఆలయంలో అందరూ దేవి దేవతలను దర్శించినట్లు నవగ్రహాలను దర్శించుకోవచ్చు ,.తాకవచ్చు ,పూజించవచ్చు.

ఇంటిలో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయవచ్చా?

 శాస్త్ర ప్రకారం ఇంట్లో గర్భవతులైన స్త్రీలు ఉన్నప్పుడు ఇంటి శంకుస్థాపన చేయకూడదు .గర్భవతిగా ఉన్న ఇల్లాలికి సహాయం చేయవలసిన పురుషుడు ఇంటి నిర్మాణంలో పడితే ఆమెకు పుట్టబోయే బిడ్డకు సరైన సేవ చేయలేడు వారిద్దరికీ అన్యాయం చేసినట్లు అవుతుంది .కాబట్టి ఇంటిలో గర్భవతులు ఉండగా గృహనిర్మాణ గృహప్రవేశం చేయకూడదు .అయితే ఇల్లు కట్టబడి ప్రారంభించిన తరువాత ఇల్లాలు నెల తప్పితే గృహనిర్మాణం, గృహప్రవేశం నిరభ్యంతరంగా చేయవచ్చు.

సంప్రదాయం అంటే ఏమిటి?

 ఆయము అంటే మన సంపాదన. మనం మాత్రమే వినియోగించుకుంటారు. దాయం అంటే ఒకే ఇంటి పేరు ఉన్న వాళ్ళు నలుగురు పంచుకునే వారసత్వపు ఆస్తి. ప్రదాయము అంటే ఎంత పంచుకున్న తరగని గొప్ప సంపద .అంటే మన విజ్ఞానం ఇంటి పేరు గోత్రం వంశ చారం వంటివి .సంప్రదాయం అంటే సమ్యక్ ప్రదాయం  వేలాది సంవత్సరాలు గడిచిపోయినా మానవుని ని జీవితానికి ఉపయోగపడే సందేశాన్ని ఇచ్చేది సంప్రదాయమే .ఏ సందేశాన్ని ఆచరించడం వల్ల మానవుడు మెరుగైన ఫలితాలు పొందుతాడో అదే సత్సంప్రదాయం.

శ్రీ అంటే అర్థం ఏమిటి?

 ఓం కారం శ్రీకారం మంగళ వాచకాలు. శ్రీకారం తో ప్రారంభించిన ఏ కార్యమైనా జయం పొందుతుంది .క్షేమము కలుగుతుంది. ఏ కార్యక్రమమైనా ప్రారంభించడానికి శ్రీకారం చుట్టారు అని అంటూ ఉంటాం .శ్రీ అనే శబ్దానికి లక్ష్మి మొదలైన అర్థాలు లు ఉన్నాయి .అలాగే శ్రీ ని స్త్రీ వాచకంగా గుర్తిస్తారు. సీత తో కూడిన రాముని శ్రీరాముడు అనాలని కొందరు చెబుతారు .మంత్ర సాధన లో కూడా శ్రీ బీజానికి ప్రత్యేక ప్రతిపత్తి ఉంది .మొత్తంమీద శ్రీ అనేది గౌరవ పురస్సరంగా వాడే శబ్దం గా గుర్తించాలిి.

గుమ్మాలకు తోరణాలు ఎందుకు కట్టాలి

 ఇంటి గుమ్మాలకు తోరణాలు కట్టకుండా శుభ కార్యాలు పండగలు నిర్వహించరు. మామిడి రావి జువ్వి మర్రి ఉత్తరేణి ఆకులను పంచపల్లవాలు అంటారు. శుభకార్యాలలో వీటిని విరివిగా వాడతారు .తోరణాలుగా మాత్రం మామిడి ఆకులను మాత్రమే వినియోగిస్తారు. మామిడి నిద్రలేమిని పోగొడుతుంది పండుగల వేళ పని ఒత్తిడిని శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణం. మామిడి కోరికలనూ తీరుస్తుందని భావిస్తారు .పర్వదినాలలో యజ్ఞ యాగాలలో ధ్వజారోహణం చేయడం ఆచారం .దానికి ప్రతీకగా తోరణాలు కట్టి ఆచారం వచ్చింది.

గృహప్రవేశం లో పాలు ఎందుకు పొంగిస్తారు?

పాలు పొ0గి న ఇల్లు శ్రీలు పొంగిన ఇల్లు అవుతుందని మన వారి  నమ్మకం. పాలు పొంగిన ఇంట్లో  అష్ట ఐశ్వర్యాలు ,భోగభాగ్యాలు విలసిల్లు తాయి .కొత్త ఇంటిలోకి ముందుగా గోవు ను ప్రవేశపెట్టి తర్వాత క యజమాని ప్రవేశిస్తాడు .గోవు మహాలక్ష్మి తిరిగిన ఇంటిలో దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఇంటి ఆడపడుచు లను పిలిచి గృహప్రవేశ సమయంలో ముందుగా పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తారు. ఆ పాలతో పరమాన్నం వండి వాస్తు పురుషుని కి నైవేద్యం పెడతారు. దీనితో ఆ ఇంట్లో సుఖశాంతులకు సంపదలకు కొదవ ఉండదని నమ్మకం .అందుకే కొత్త ఇంట్లో పాలు పొంగిస్తారు.