Monday, 29 May 2023

శ్రీ వేణు గోపాలస్వామి ఆలయానికి విరాళం.

 కామారెడ్డి పట్టణంలోని పురాతన వేణు గోపాల స్వామి ఆలయ పునరుద్ధరణ కు ఆదివారం ఆరేపల్లి గ్రామ వాస్తవ్యుడు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శ్రీ తిరుపతి రెడ్డి గారు రూ 5000 విరాళం అంద చేశారు. ఆలయ అభివృద్ధి లో ఆయా వర్గాల వారు భాగస్తులు కావాలని ఆలయ ధర్మ కర్త శ్రీ కంజర్ల మధు పేర్కొన్నారు 

చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు.

 మాచారెడ్డి మండలం లో నీ చుక్కా పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తులు ఆదివారం అధిక సంఖ్య లో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం చుట్టూ దీపాలతో ప్రదక్షిణలు చేసి  మొక్కులు చెల్లించుకున్నారు. పుట్టు వెంట్రుకలు, ఓడి బియ్యం, కోర మీసాలు, కానుకలు సమర్పించారు.

చీనూరు గ్రామం లో శ్రీ ఆంజనేయ స్వామి పునః ప్రతిష్ట.

 నాగిరెడ్డి పేట్ మండల పరిధిలోని చీనూర్ గ్రామంలో తోగిట పీఠాధిపతి శ్రీ మాధవా నంద స్వామి ఆధ్వర్యంలో 28-5-2023 ఆదివారం , ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామి మూల విరాట్ పునః ప్రతిష్ట కార్య క్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




Friday, 26 May 2023

శ్రీ రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట, ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా.

 ఎడపల్లి మండల కేంద్రము లో మహాలక్ష్మి మందిరం పక్కన కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, దాతల సహకారంతో నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం లో గురువారం25-5-2023 , మల్లారం పిట్ల కృష్ణ మహరాజ్ అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు. మూడు రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్ట వేడుకలలో యాగాలు,పూజలు,నిర్వహించి గురువారం విగ్రహ ప్రతిష్ట చేశారు.భక్తులకు ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ప్రతిష్ట అనంతరం అలంకరించిన అమ్మవారిని భక్తులు దర్శించు కున్నారు.వేడుకల్లో కౌండిన్య గౌడ సంఘం సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Wednesday, 24 May 2023

మాండాపూర్ ఎల్లమ్మ ఆలయం, బిబిపెట్ మండలం.

 

మాందాపూర్ ఎల్లమ్మ ఆలయం లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు, ఒడిబియ్యం సమర్పించారు. కుంకుమ పూజలు చేశారు.తీర్థప్రసాదాలు స్వీకరించారు. గౌడ సంఘం సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.




పెద్ద బజార్ పాత హన్మాండ్లు పునః ప్రతిష్ట , కామారెడ్డి.

 కామారెడ్డి పట్టణంలోని పెద్ద బజార్ లో ఉన్న పురాతన ఆంజనేయ స్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, శివపంచాయతన మూర్తి స్థిర ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు.మంగళ వారం పురోహితులు గంగవరం నారాయణ శర్మ,గంగవరం ఆంజనేయ శర్మ,ఇతర అర్చకులతో హోమాలు,యంత్ర స్థాపన,స్థిర ప్రతిష్ట,మొదలగు కార్య క్రమాలు నిర్వహించారు,ఆలయ కమిటీ సభ్యులు ,భక్తులు పాల్గొన్నారు.




బేగంపూర్ తండా,పెద్ద కొడప్ గల్ మండలం - సంత్ సేవాలాల్ విగ్రహ ప్రతిష్ట

 పెద్ద కోడప్ గల్ మండలం లోని బేగం పూర్ తండా లో మంగళవారం ,జగదంబ సేవలాల్ విగ్రహ ప్రతిష్ట కన్నుల పండుగ గా జరిగింది.నూతనంగా నిర్మించిన రెండు ఆలయాలలో ,జగదాంబ, సేవాలాల్ మహరాజ్ ల విగ్రహాలను ప్రతిష్టించారు.మొదటి రోజున గణపతి పూజ, గో యాగశాల కార్య క్రమాలు ,.రెండో రోజు హోమము, ధాన్యాదివాసం,మూడో రోజు యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట,

పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.




బాసర అమ్మవారికి వెండి హంస బహూ కరణ...

 బాసర సరస్వతి అమ్మవారికి జీ ఎం ఆర్ సంస్థ అధిపతులు తయారు చేయించిన 2 కిలోల 800 గ్రాముల వెండి హంస విగ్రహాన్ని ఆలయ ఇ ఓ విజయ రామారావు ,ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి,ల సమక్షంలో ఆలయ అధికారులకు అందించారు.అమ్మవారి సన్నిధిలో వెండి హంసను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలతో ఊరేగింపు నిర్వహించారు.ఆలయ వ్యవస్థాపక వంశీయుడ శరత్ పాటక్, ఏ ఇ ఓ సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.





వాసవీ మాతకు ఘనంగా పూజలు

 23-5-2023,జంగం పల్లి,భిక్ నూర్ మండలం.

వాసవీ మాత పీఠం జంగంపల్లి గ్రామానికి వచ్చిన సందర్భంగా , భికనుర్ మండలం లోని జంగంప ల్లి గ్రామ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక పూజలు నిర్వహించారు. అమ్మ వారి కి ఓడి బియ్యం, కట్న కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా వాసవి మాత చాలీసా ను సామూహిక పారాయణం చేశారు. ఈ కార్య క్రమంలో ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు కె.శంకర్, ప్రధాన కార్యదర్శి నాగరాజు , మాజీ సర్పంచ్ సిద్ధ రాములు, వాసవీ క్లబ్ రీజియన్ చైర్మన్ గందే శ్రీనివాస్,,ప్రతినిధులు కొత్త సిద్ధరాములు,వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.