2, సెప్టెంబర్ 2026, బుధవారం

జాతీయ స్మారక కట్టడంగా.. గొల్లల గుడి..

 తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా పాలంపేటలోని పురాతన కట్టడం ' గొల్లల గుడి ' కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ కట్టడాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత పురావస్తు సర్వేక్షణ (ఏ ఎస్ ఐ) అధికారిక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రాచీన స్మారక కట్టడాలు , పురావస్తు ప్రదేశాలు , అవశేషాల చట్టం ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గొల్లల గుడి ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా ప్రకటించే ఉద్దేశం తో అంతకు ముందు ఈ ఏడాది మార్చి 6 న ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. చట్టం నిర్దేశించిన 2 నెలల గడువులోగా ప్రజల నుండి ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదు. దీంతో ఆగస్టు 31 న ఏ ఎస్ ఐ డైరెక్టర్ జనరల్ యదు బీర్ సింగ్ రావత్ దీనిపై తుది గెజిట్ విడుదల చేశారు. గెజిట్ నోటిఫికేషన్ లో పొందు పరచిన షెడ్యూల్ ప్రకారం గొల్లల గుడి పరిధిలోని పావు ఎకరం విస్తీర్ణాన్ని రక్షిత ప్రాంతంగా భారత పురావస్తు సర్వేక్షణ తమ యాజమాన్యం లోకి తీసుకుంది. ఈ మేరకు రక్షిత స్మారక చిహ్నం పరిమితులను ఖరారు చేస్తూ మ్యాప్ ను గెజిట్ లో పొందు పరచారు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి