జుక్కల్ మండలంలోని మహమ్మదాబాద్ గ్రామంలో భవ్యమైన మహాత్ముడు బొమ్మ గొండేశ్వర్ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కురుమ కులస్తుల సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల మధ్య కొనసాగగా ఇట్టి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, కురుమ సంఘం పెద్దలు, కురుమ కులస్తులు పాల్గొన్నారు. కురుమ కులస్తుల ఆరాధ్య దైవమైన బొమ్మ గుండేశ్వర మహారాజ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని పలువురు వ్యక్తులు సూచించారు. శ్రీ బొమ్మ గొండేశ్వర్ మహారాజ్ విగ్రహాన్ని గ్రామ నడిబొడ్డున ఏర్పాటు చేయడం గ్రామానికి వన్నె తెస్తుందని అన్నారు. విగ్రహావిష్కరణ కన్నా ముందు గ్రామంలో కురుమ కులస్తుల మహిళలు, గ్రామ మహిళలు నిండు కలశాలతో మంగళహారతులు చేత పట్టుకొని భారీ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు ముందు కురుమ కులస్తుల డప్పు వాయిద్యాలు అందరినీ ఆకర్షించాయి. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులకు, నాయకులకు కురుమ సంఘం ఆధ్వర్యంలో కురుమ కులస్తుల వస్త్రమైన గొంగళ్ళతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. మండల కేంద్రమే కాకుండా వివిధ గ్రామాల నుంచి కురుమ కులస్తులు, ప్రజలు తరలిరావడంతో మహమ్మదాబాద్ గ్రామం జనసంద్రంగా మారింది. గ్రామ కురుమ సంఘానికి చెందిన అంజుగొండ మహారాజ్, కండుకొండ ,హనుమ గొండ, బల్దేవ్ పాటు కురుమ కులస్తులు సకల ఏర్పాట్లు చేయడమే కాకుండా కార్యక్రమం సక్సెస్ కావడానికి ఎంతో కృషి చేసినారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి