నేటి అలంకారం.. శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం.
ఆశ్వయుజ శుద్ధ పంచమి,గురువారం ..
శరన్నవరాత్రి మహోత్సవాలలో ఐదవ రోజున శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి గా విజయవాడ శ్రీ కనక దుర్గమ్మ దర్శనమిస్తారు.త్రిపురాత్రయంలో లలితాదేవి రెండో శక్తి. దేవీ ఉపాసకులకు ఈ తల్లి ముఖ్య దేవత.త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఆమెది. లక్ష్మీ సరస్వతులు ఇరువైపులా ఉండి వింజామరలు వీస్తుండగా శ్రీ చక్ర అధిష్టాన శక్తిగా ఆమె కొలువై ఉంటుంది. చెరుకు గడ, విల్లు పాశ అంకుశాలను ధరించి శివుడి వక్షస్థలంపై కూర్చుని భక్తులకు వరాలు ఇస్తుందని ,పంచ, దశాక్షరి మహామంత్రాది దేవతగా తనను కొలిచే భక్తులను, ఉపాసకులను అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. లలితా దేవి విద్యా స్వరూపిణి. సమస్త సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి, అని మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం .లలితా దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేయాలని, వివిధ పూలతో, కుంకుమతో అర్చించాలని పురాణాలు పేర్కొంటున్నాయి .త్రిమూర్తులు, సకల దేవతలు ఆమెను కొలుస్తారని ,ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ సుఖ సౌఖ్యాలు కలుగుతాయని స్పష్టం చేస్తున్నాయి .
నైవేద్యం.. అల్లం గారెలు ,ఐదు రకాల తీపి పదార్థాలు.
అలంకరించే చీర రంగు.. బంగారు వర్ణం.
అర్చించే పూల రంగు .. వివిధ రకాలు.
పారాయణ చేయాల్సింది..లలితా సహస్ర నామం.

కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి