2, సెప్టెంబర్ 2026, బుధవారం

అలంపూర్ ఆలయంలో.. సౌండ్ అండ్ లైట్స్ షో

 దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఆలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక , సాంస్కృతిక వైభవాన్ని వెలుగు జిలుగుల, ధ్వనుల సమ్మేళనంతో ఆవిష్కరించే మల్టీ మీడియా , సౌండ్, లైట్ షో ను 4.60 కోట్ల రూపాయల నిధులతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకంలో భాగంగా ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఈ షోను ఆలంపూర్ ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. అనంతరం  మల్టీ మీడియా, సౌండ్, లైట్ షో ను ప్రతినిధులు, ప్రజలతో కలిపి తిలకించారు. 

ఈ సందర్భంగా ఒగ్గు కళాకారులు ఆలంపూర్ ఆలయ విశిష్టతపై ప్రదర్శన ఇచ్చారు. ఈ కార్యక్రమంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రముఖులు, అధికారులు, పరిసర ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 




శక్కర్ బేస్ ఆంజనేయ ఆలయం,మద్నూర్

 కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల పురాతన శక్కర్ బేస్ ఆంజనేయ స్వామి ఆలయం లో శిఖర, విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఏళ్ల నాటి చరిత్ర కలిగిన ఈ ఆలయ ఆవరణలో ధర్మ ధ్వజాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆలయం పైన శిఖర ప్రతిష్ఠాపన , ఆలయంలో నంది, శివ లింగం , ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

బిచ్ కుంద మండలం ఖత్ గావ్ మల్లిఖార్జున స్వామి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.