THE WONDERFUL INFO ABOUT SPIRITUALITY OF ALL RELIGIONS. ANALYSIS, EXPERIENCES , FACTS, FESTIVALS INFO ,ETC ARE PROVIDED FOR YOU FOR YOUR ENLIGHTENMENT .THANK YOU.
Monday, 29 May 2017
Sunday, 28 May 2017
నీవు జయిస్తావు. / NEEVU JAYISTHAVU
మనందరిలోనూ అంతుచిక్కని గొప్ప విలువలు గోప్యంగా ఉన్నాయి.మన వల్ల చేతనవుతుంది, మనవల్ల చేతనవదు అన్నది మనకు సంబంధించిందిగానే ఉంటుంది.కాని 'నేను చేస్తాను 'అన్న మనోవైఖరి ఉండాలి.
ఏదైనా కౄరమృగాన్ని అదుపులో పెట్టాలంటే ఆరంభంలో చాలా కష్టంగా ఉంటుంది.కాని పోను పోను దానిపైన స్వారీ చేసినా అది ఏమీ చెయ్యనంత సమర్ధతతో దాని శిక్షకుడు దానిని వశం చేసుకుంటాడు.మనం సర్కస్ లో సాధారణంగా ఇలాంటివి చూస్తుంటాము.అదే విధంగా మనం కౄరంగా ఉన్న మనస్సును మన చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు.
జీవితం ఒక శారీరకమైన రాకపోకలతోనే పరిమితమైంది కాదు.అది చాలా విశాలమైనది.
వేదాంతపరంగా చెప్పే కాలనిర్ణయం వేరుగా ఉంటుంది.ఒక బండరాయిపైన ,ఇంటికప్పుపైనుంచి రోజూ ఒక్కొక్క బొట్టుగా నీరు పడుతుంటే కొంత కాలానికి రాయి అరిగిపోవడం చూస్తం.
ఒక భక్తుడు రోజూ సాష్టాంగ ప్రణామం చేసి,తన నుదురును నేలపైన ఆనిస్తుంటే కొన్ని సంవత్సరాలకు సొట్టపడటం చూసాను.దానివల్ల అభ్యాసానికి ఎంత విలువుందో తెలుస్తుంది.
మృదువైన నీటి బిందువు రాయిలో మార్పు తీసుకురాగలిగినప్పుడు ,చంచలంగా ఉన్న మనస్సుకు శిక్షణనిచ్చి నిశ్చలంగా చేసినట్లైతే సత్యంలోనికి అది తప్పకుండా చొచ్చుకుపోగలుగుతుంది.
గొప్ప గురువులు అనబడే వారందరిచేతా ' ఓర్పుగా ఉండి,మెలకువగా ఉండి,కష్టపడు,నీవు జయించుతావు ' అని చెప్పబడింది.
ఓటమికి ఆధ్యాత్మిక జీవితంలో స్థానమే లేదు.ఎన్నిసార్లు ఓటమి కలిగినా చివరికి జయిస్తావు.
---- స్వామి రంగనాథానందజీ .
Sunday, 14 May 2017
గణపతి ముందు గుంజిళ్లు ఎందుకు తీస్తారు? / GANAPATHI MUNDU GUNJILLU. ENDUKU THEESTHAARU.
ఒకనాడు శ్రీ మహా విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్లాడు.విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వినాయకుడు చూశాడు.అది తళ తళ మెరుస్తూ ఉండడంతో అది ఎంతో నచ్చింది.వెంటనే ఆకతాయితనంతో దానిని తన తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.ఇవ్వమని ఎంత బతిమాలినా ససేమిరా అన్నాడు.ఎంతమంది ఎంతలా అడిగినా మన బాల గణపతి వినలేదు.దీనితో విష్ణువు ఉపాయంతో గణపతిని నవ్వించాలని అనుకున్నాడు.అందుకోసం ఆయన గుంజిళ్లు తీశాడు.దాంతో బాల వినాయకుడు చేతిలో చక్రం వదిలేసి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మురిసిపోయాడు.గణపతికి గుంజిళ్లు తీస్తే ఇష్టమని ఈ కథ చెబుతారు.అందుకే భక్తులు గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ అయింది.
Friday, 12 May 2017
ఆలయానికి వెళ్లినప్పుడు పాటించాల్సిన నియమాలు / ALAYANIKI VELLINAPUDU PATINCHALSINA NIYAMALU.
అలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజ స్థంభానికి నమస్కారం చేసి ,వీలును,ఆలయ వైశాల్యాన్ని బట్టి 3,5,7,9,11 లేదా గరిష్టంగా 40 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయాలి.ఒకసారి ప్రదక్షిణ పనికి రాదు.వైష్ణవాలయం ఐతే గరుత్మంతుడికి ,శివాలయం ఐతే నందికేశ్వరుడికి నమస్కరించాలి.తర్వాత ద్వారపాలకులకు దండం పెట్టుకోవాలి.అటు పిమ్మట భగవంతుని భక్తులైన అనగా వైష్ణవాలయం ఐతే ఆళ్వారులకు,శివాలయంలో అయితే నాయనారులకు నమస్కరించాలి.తరువాత అమ్మవారికి,స్వామివారికి నమస్కారం చేయాలి.భగవంతుడిని మనసారా ధ్యానించాలి.
నిద్ర లేవగానే భూమికి ఎందుకు వందనం చేయాలి? / LEVAGANE BHOOMIKI VANDANAM YENDUKU CHEYALI?
ఉదయం నిద్ర లేవగానే చేతిని నేలకు తాకించి వందనం చేయాలి.ఎందుకంటే నిద్ర పోతున్నవారి శరీరంలో పొటెన్షియల్ ఎనర్జీ ప్రవహిస్తుంటుంది.అది కాస్తా మనం నిద్ర మేల్కొని లేచి నిలబడినపుడు కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది.నిద్రపోతున్నప్పటి ఎనర్జీ స్వచ్చమైనది కాదు.కావున లేవగానే మనం మొదలు చేతితో భూమిని కాసేపు తాకడం వల్ల శరీరంలో ఉన్న అశుద్ధ శక్తి చేతి ద్వారా బయటకు పోయి స్వచ్చమైన శక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది.అందుకే మన పూర్వీకులు నిద్రలేవగానే మొదట చేతిని భూమికి ఆనించి ఉంచాలని ఆ తరువాతే పాదాలను భూమికి తాకించాలని చెప్పడం జరిగింది.మన దిన చర్యలో భాగంగా ఈ నియమాన్ని పాటించినట్లైతే మనలో అనుకూలమైన శక్తి చేరుతుంది.
Thursday, 11 May 2017
పూజలో కొబ్బరికాయ పండితే మంచిదా కాదా ?/ POOJA LO KOBBARIKAYA PANDITHE MANCHIDA KADA?
కొబ్బరి కాయ కుళ్ళింది, పాడైంది అనడం కంటే పండింది అనడం సమంజసం.ఎందుకంటే కాయ పండుతుంది, పండు కుళ్ళుతుంది.దేవుడికి కొట్టిన కొబ్బరి కాయ పండితే మన కోరిక పండిందని , దేవుడు వరమిచ్చాడని అర్థం.కొబ్బరి కాయ పండిందని మరో కాయ తెచ్చి కొట్టదం అంటే దేవుడిచ్చిన వరాన్ని కాదన్నట్లే.
దేవాలయాల్లో గంటలు ఎందుకు కొడతారు? / DEVALAYALLO GANTALU YENDUKU KODATHARU?
ప్రతి ఆలయంలో గంటలు ఉంటాయి.ఈ గంటలు కొట్టడం వల్ల అసలు ఉపయోగం , అర్థం ఏమిటి అని అలోచిస్తే ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది.అవి ఏమిటంటే గంటలు కొట్టదం వల్ల మనకు తెలియకుండానే మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి.గంటను 7 సార్లు కొడితే మన శరీరంలో ఉన్న 7 చక్రాలు ఉత్తేజం చెందుతాయి.అంతే కాకుండా మెదడు కుడి,ఎడమ భాగాలు రెండు కొంతసేపు ఏకమౌతాయి.దీనివల్ల మన మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది.అలాగే ఏకాగ్రత సైతం పెరుగుతుంది.గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నిర్మూలించబడతాయి.
Monday, 8 May 2017
ఆలయాల్లో కొబ్బరి కాయ ఎందుకు కొట్టాలి? / ALAYALLO KOBBARIKAYA YENDUKU KOTTALI?
దేవాలయాలకు వెళ్లిన ప్రతీ భక్తుడు దేవాలయంలో ప్రత్యేకంగా కొబ్బరి కాయను కొడతారు.కొబ్బరి కాయ కొట్టినట్లైతే మోక్షం లభిస్తుంది అని భక్తులు భావిస్తారు.అందుకోసం దేవాలయాలకు వెల్లిన భక్తులు ఖచ్చితంగా దేవాలయంలోని గర్భ గుడిలో లేదా బయట కొబ్బరి కాయను కొట్టి మొక్కు తీర్చుకుంటారు.ఆలయంలో కొబ్బరి కాయ కొట్టినట్లైతే భగవంతుడి కృప ఉంటుందని భావించి ప్రతీ భక్తుడు దేవాలయాల్లో కొబ్బరి కాయలు కొడతారు.కొట్టిన కొబ్బరి కాయను దేవాలయంలోనే తీర్థ ప్రసాదంగా స్వీకరిస్తారు.
Saturday, 6 May 2017
Subscribe to:
Posts (Atom)