ఒకనాడు శ్రీ మహా విష్ణువు శివుడిని కలవడానికి కైలాసానికి వెళ్లాడు.విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రాన్ని వినాయకుడు చూశాడు.అది తళ తళ మెరుస్తూ ఉండడంతో అది ఎంతో నచ్చింది.వెంటనే ఆకతాయితనంతో దానిని తన తొండంతో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.ఇవ్వమని ఎంత బతిమాలినా ససేమిరా అన్నాడు.ఎంతమంది ఎంతలా అడిగినా మన బాల గణపతి వినలేదు.దీనితో విష్ణువు ఉపాయంతో గణపతిని నవ్వించాలని అనుకున్నాడు.అందుకోసం ఆయన గుంజిళ్లు తీశాడు.దాంతో బాల వినాయకుడు చేతిలో చక్రం వదిలేసి రెండు చేతులతో చప్పట్లు కొడుతూ మురిసిపోయాడు.గణపతికి గుంజిళ్లు తీస్తే ఇష్టమని ఈ కథ చెబుతారు.అందుకే భక్తులు గణపతి దర్శనానికి వెళ్ళినప్పుడు గుంజిళ్ళు తీయడం ఆనవాయితీ అయింది.
No comments:
Post a Comment