4, సెప్టెంబర్ 2026, శుక్రవారం

జగన్నాధునికి 60,821 ఎకరాలు

 పూరీ లోని ప్రసిద్ధి చెందిన జగన్నాధ ఆలయం ఆస్తులను శ్రీ జగన్నాధ ఆలయ పరిపాలన ప్రకటించింది. పలు బ్యాంకులలో మొత్తం రూ. 1912 కోట్ల రూపాయలు ఉండగా , ఆలయం పేరు మీద పలు రాష్ట్రాలలో 60,821 ఎకరాల భూమి ఉందని తెలిపారు. వీటికి రత్న భండారు లో నిక్షిప్తం చేసిన బంగారు, డైమండ్ ఆభరణాలు అదనం. 

భక్తులు ఇచ్చే డొనేషన్లు , గుడికి ఉన్న స్వంత క్వారీలు , ఫిక్స్డ్ డిపాజిట్ల పై వచ్చే వడ్డీలు, భూ క్రయ విక్రయాల వల్ల సమకూరే సొమ్ములు ,ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్ల ద్వారా ఈ డబ్బులు సమకూరినట్లు ఎస్ జే టీ ఏ ముఖ్య నిర్వాహకుడు అరబింద కుమార్ పాధి ఓ ప్రకటనలో తెలిపారు.

సమర్పణ్ పేరుతో డిజిటల్ డొనేషన్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించామని , ఆగస్టు 31 నాటికి దాని వల్ల రూ 56.71 లక్షల వరకు వచ్చాయని తెలిపారు. ఆలయం పేరు మీద ఉన్న భూమిలో 60,426 ఎకరాలు రాష్ట్రంలోని 24 జిల్లా లలో విస్తరించి ఉండగా , మిగిలిన 395 ఎకరాల భూమి వెస్ట్ బెంగాల్ తో సహా ఆరు రాష్ట్రాల్లో ఉన్నట్లు ఆయన తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి