కావ రాగదయ్యా కాశీ విశ్వనాథా
కాన రాగదయ్యా కన్నీటి ధారా " కావ "
నీలకంఠ రావా దిక్కు నీవె కావా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా " కావ "
విఠల నేత్ర నాపై కఠినమేలనయ్యా 3
నీలకంఠ నాపై జాలే లేదా " కావ "
పన్నగేంద్ర భూషా పలుకవేలనయ్యా 3
దేవ దేవ రావా కావా ఓ దేవా " కావ "
ప్రేమ మీద నీదు నామ భజన చేసే 3
రామచంద్ర బ్రోవ రావా ఓ దేవా " కావ "
No comments:
Post a Comment