నటరాజ గంగాధరా
హే జటధారి గంగాధరా 2
అట జూడ నీవే ఇట జూడ నీవే
ఎటు జూసినా నీవే 2
ఘటమందు నీవే మఠమందు నీవే
విఠలాక్ష జగమంత నీవే కదా " నటరాజ "
హే నాగభరణా నీ నామస్మరణా
నే మానలేదయ్యా 2
నానావిధంబుల గానంబు జేతూ
దీనావనా జాలి చూపించవా " నటరాజ "
కలవారలెన్నో కానుకలనిచ్చీ
కొలిచేరు ఓ దేవా 2
ఫలపత్రమైనా తేలేని నేనూ 2
పిలిచేను నా పిలుపు ఆలకించవా " నటరాజ "
భువనేశ సకలా భూతేశ్వరా
హే భవబంధ పరిహారా 2
శివచంద్రశేఖర భవదీయదాసూ
కవి రామచంద్రుణ్ణి కాపాడవా " నటరాజ "
No comments:
Post a Comment