ఓ....కైలాస హిమగిరి శంకరా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా...2
నీలకంఠా నిను చూడగోరి
నిరతమూ నిను ప్రార్థింతురా
జగతినేలా జాగేల దేవా
జ్యోతులివిగో జగమేలయా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా " ఓ "
మనసు నిలిపిన మహనీయులెందరో
జన్మ సద్గతి సాధించిరీ
కానరాని కలిమాయలోనా
గమ్యమెరుగక పడిపోతినీ
కరుణించవేమయా
మనసార మోము చూపించవా " ఓ "
చంద్రమౌళీ చితభస్మధారీ
చంద్రకిరణాల తేజోవిహారీ
దండమోయీ ఓ లింగరూపా
అండ నీవే భూతాధిపా
కరుణించవేమయా
మనసార మోము చూపించవా " ఓ "
No comments:
Post a Comment