6, సెప్టెంబర్ 2026, ఆదివారం

గోపీ చందనం అంటే

 అవతార పురుషుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్ముడు సంచరించిన ప్రాంతాలనుండి స్వీకరించిన మట్టి ని" గోపీ చందనం" అంటారు. అది కృష్ణుడి పాద స్పర్శ తో పవిత్రమైన లేత పసుపు రంగులో ఉన్న మన్ను. బృందావనం, ద్వారక తదితర క్షేత్రాలలో ఈ చందనం లభ్యమవుతుంది. బృందావనం మట్టి, పూరీ జగన్నాథుని ప్రసాదం పరమ పవిత్రం అనే వారు రామకృష్ణ పరమ హంస. 

అంతే కాదు, ఆ రెండింటిని ఎప్పుడూ తన వద్ద ఉంచుకునే వారు ఆయన. ఈ మన్ను ధారణ యోగ్యం అని చెబుతారు.అందుకే దీన్ని " ఊర్ధ్వ పుండ్రంగా" ( వైష్ణవుల నుదుట నిలువు నామాలు ) ధరించడం ఆనవాయితీ. పుణ్య తీర్థాలలో ,తులసి మొక్క మూలం లోని మట్టి కూడా ధారణ యోగ్యమని మహర్షులు పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి