10, నవంబర్ 2026, మంగళవారం

కొత్తకోటలో.. కళ్యాణి చాళుక్యుల శాసనం

 వనపర్తి జిల్లా కొత్తకోటలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి అరుదైన శాసనం వెలుగు చూసింది. కొత్త కోట మున్సిపాలిటీ లోని శివాలయ ప్రాంగణంలో ఉన్న ఈ శాసనాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధకులు బైరోజు చంద్రశేఖర్ , డా. బైరోజు శ్యాం సుందర్ , హనుమన్నగారి వేమారెడ్డి, పండ్రా ప్రగడ రామారావు గుర్తించారు. శాసనంలోని త్రిభువన మల్లదేవ పేరును బట్టి ఇది కళ్యాణీ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుడి కాలానికి చెందినదిగా పరిశోధకులు నిర్ధారించారు. 12 వ శతాబ్దపు తెలుగు కన్నడ లిపిలో , కన్నడ భాషలో ఉన్న ఈ శాసనం క్రీ.శ.1118 మే 22 నాటిదని పరిశోధకులు వెల్లడించారు. కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు రామోజు హరగోపాల్ శాసనాన్ని పరిష్కరించి , వివరాలను ఒక ప్రకటన లో తెలిపారు. సూర్య గ్రహణం సందర్భంగా కేశవ దేవాలయంలో కాది రాజన్న పాదాలు కడిగి , మల్లా దేసరెడ్డి మూడు మర్తురుల భూమిని , పల్లయ నాయకుడు మరో 11 మర్తురుల భూమిని దానం చేసినట్లు శాసనంలో పేర్కొన్నారు. అలాగే రామేశ్వర పండితుడు , శ్రీ నాయకుడి పేర్లతో కూడిన వివరాలు కూడా శాసనంలో కనిపిస్తున్నాయి. ఆలయ ప్రాంగణంలో ని శివ లింగం, నంది, గణపతి విగ్రహాలు చాళుక్య, కాకతీయ శిల్ప కళా శైలులను ప్రతి బింబిస్తున్నాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ శాసనం ద్వారా 12 వ శతాబ్దంలో కొత్తకోట ప్రాంత చరిత్ర, భూ దానాలు , మతపరమైన కార్య కలాపాలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి