హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల రోడ్డు నెంబర్ 12 లో గల హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ లో గోవర్ధన పూజ, కార్తీక దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్ధన పర్వతం ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల స్వీట్లు, పిండివంటలు, పండ్లతో అన్నకూటాన్ని శ్రీ రాధా గోవిందులకు సమర్పించారు. గోపూజతో ప్రారంభమైన వేడుకలలో పల్లకి ఉత్సవం, భక్తి కీర్తనలు, హారతులు, దామోదరాష్టకం నిర్వహించారు. భక్తులు నెయ్యి దీపాలు వెలిగించి గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం భక్తులకు అన్నకూట ప్రసాదం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షుడు సత్య గౌరచంద్ర స్వామి మహారాజ్ మాట్లాడుతూ శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావన వాసులను ఇంద్రుడి ఆగ్రహం నుంచి రక్షించిన లీల భగవంతుడి అపార కరుణకు నిదర్శనమని వివరించారు. కృష్ణుడి పవిత్ర నామాలను జపించడం ద్వారా భగవంతుడి కరుణను పొందవచ్చు అని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి