ఆంజనేయా వరములీయా వేగ రావయా
నీవె దేవా మమ్ము బ్రోచే భక్త మందారా " ఆంజ "
నీదు మధుర నామము నే ప్రేమతో భజియింతును
నిన్ను కొలిచే భక్త కోటి మొరలు వినవయ్యా కావ రావయ్యా " ఆంజ "
నిన్ను తలచిన చాలునూ మా చెంతనుండి గాతువూ
భయము లేదు దేవ నీ కరుణ ఉండగనూ మాకు
తోడు ఉండగనూ నీ కరుణ ఉండగనూ " ఆంజ "
నీదు చల్లని నీడలోన నిండు స్వర్గము ఉన్నదయ్యా
రామ దూత నీవె మాకు దిక్కు నీవయ్యా
మమ్మేల రావయ్యా " ఆంజ "
No comments:
Post a Comment