Wednesday, 3 October 2018

మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా - భజన

మట్టి తీసావా మట్టి బొమ్మను చేసావా
ప్రాణం పోసావా అయ్యప్పా మనిషిని చేసావా  " మట్టి "

తల్లి గర్భమున నన్నూ తొమ్మిది నెలలూ ఉంచావూ
పిమ్మట మమ్ము భువిపై వేసి పువ్వులాగ తుంచేస్తున్నావు   " మట్టి "

కులములోన పుట్టించావూ కూటికి పేదను చేసావూ
కర్మ బంధాల ముడిలో వేసి త్రుటిలోనే తుంచేస్తున్నావు   " మట్టి "

కోటీశ్వరుని చేసావూ కోటలెన్నొ కట్టించావూ
సిరిసంపదలను శిధిలం చేసి కాటిలోనె కలిపేస్తున్నావు  " మట్టి "

హరిహరులకు జన్మించావూ శబరి గిరీపై వెలిశావు
శరణన్న భక్తుల కోర్కెలు తీర్చి శబరీ వాసుడవయ్యావు   " మట్టి "

No comments:

Post a Comment